లా విద్యార్థిని రేప్, హత్య కేసు: దోషికి మరణ దండన
Recommended Video

కొచ్చి: కేరళ లా విద్యార్థిని హత్య, రేప్ కేసులో నిందితుడు అమీరుల్ ఇస్లాంంకు ఎర్నాకులం ప్రిన్సిపల్ సెషన్ కోర్టు మరణ దండన విధించింది. ఇప్పటికే అతన్ని దోషిగా నిర్ధారించిన కోర్టు గురువారం శిక్షను ఖరారు చేసింది.
లా విద్యార్థిని జిషా నిరుడు ఏప్రిల్ 28వ తేదీన శవమైన తేలిన విషయం తెలిసిందే. అమీరుల్ ఇస్లాం అస్సాం నుంచి వలస వచ్చిన కూలీ. నిరుడు కేరళలో 30 ఏళ్ల దళిత లా విద్యార్థినిపై అత్యాచారం జరగడమే కాకుండా ఆమె కిరాతకంగా హత్యకు గురైంది. ఈ కేసులో అమీరుల్ ఇస్లాం ఒక్కడే నిందితుడు.
దళిత విద్యార్థిని శవం 2016 ఏప్రిల్‌లో రక్తం మడుగులో పడి ఉంది. ఆ స్థితిలో జిషాను ఆమె తల్లి చూసింది. ఈ సంఘటన పెరంబవూరులోని వట్టోలిపాడిలో జరిగింది. హత్య గురించి ఇరుగుపొరుగువారికి ఏ విధమైన ఆనవాళ్లు కూడా దొరకలేదు. అరుపులు కూడా వారికి వినిపించలేదు.

అమీరుల్ ఇస్లాం అత్యాచారం చేయాలనే ఉద్దేశంతో ఇంట్లోకి ప్రవేశించాడు. అయితే ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో పదునైన ఆయుధంతో చంపేశాడు. ఆమె శవం కనిపించిన 50 రోజుల తర్వాత పోలీసులకు అమీరుల్ ఇస్లాం పట్టుబడ్డాడు.
కేసు విచారణ ఏప్రిల్ 4వ తేదీన ప్రారంభమై 85 రోజుల పాటు సాగింది. ప్రాసిక్యూషన్ వంద మంది సాక్షులను విచారించింది. ఐదు వేల మంది వేలిముద్రలను పరీక్షించారు.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications