కేరళలో కరోనా కల్లోలం.. 24 వేల కేసులు.. 173 మరణాలు
కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. దేశంలో కరోనా హాట్‌స్పాట్‌గా కేరళ కొనసాగుతోంది. వరుస పండుగ సెలవుల నేపథ్యంలో గత మూడు రోజులుగా తగ్గిన కరోనా కేసులు..ఇప్పుడు తర్వాత మళ్లీ పెరిగాయి. మంగళవారం కేరళలో 24,296 కొత్త కోవిడ్ కేసులు,173 మరణాలు నమోదయ్యాయి. దీంతో కేరళలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 38,51,984, మొత్తం మరణాల సంఖ్య 19,757కి చేరింది. రాష్ట్రంలో టెస్ట్ పాజిటివిటీ రేటు 18.04 శాతంగా నమోదైంది.
గత 24 గంటల్లో 19,349 మంది కరోనా రోగులు కోలుకుని హాస్పిటల్స్ నుంచి డిశ్చార్జ్ అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 36,72,357కు చేరుకుందని, ప్రస్తుతం రాష్ట్రంలో 1,59,335 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది.

కేసుల సంఖ్య పెరుగుతన్నప్పటికీ..మరిన్ని ఆంక్షలు విధించకూడదని రాష్ట్ర కోవిడ్ -19 రివ్యూ కమిటీ నిర్ణయించింది. ఆదివారం రోజు మాత్రం పూర్తిస్థాయి లాక్ డౌన్ కొనసాగించాలని ఈ కమిటీ నిర్ణయం తీసుకుంది. కాగా, స్వాతంత్ర్య దినోత్సవం మరియు ఓనం వేడుకల దృష్ట్యా కేరళలో ఆదివారం లాక్ డౌన్ రెండు వారాలుగా నిలిపివేయబడిన విషయం తెలిసిందే.
ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం అయితే ప్రకటించలేదు.
Recommended Video
ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications