వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: 'ఇస్లాంకు వ్యతిరేకంగా మాట్లాడితే యాసిడ్ పోస్తా', 'నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తా'

మరోసారి ఇస్లాంకు వ్యతిరేకంగా మొరిగితే ముఖం మీద యాసిడ్ పోస్తానంటూ బెంగుళూరులో ఉండే మళయాళీ యువతి అంజియా ఆస్మిన్ ను కేరళకు చెందిన ఓ ముస్లిం వ్యక్తి బెదిరించాడు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు:మరోసారి ఇస్లాంకు వ్యతిరేకంగా మొరిగితే ముఖం మీద యాసిడ్ పోస్తానంటూ బెంగుళూరులో ఉండే మళయాళీ యువతి అంజియా ఆస్మిన్ ను కేరళకు చెందిన ఓ ముస్లిం వ్యక్తి బెదిరించాడు.

సమాజంలోని పలు రుగ్మతలపై కోజికోడ్ కు చెందిన అంజియా తరచూ పోస్ట్ చేస్తుంటారు. ఫేస్ బుక్ సర్కిళ్ళలో ఆమె బాగా పాపులర్ .అయితే ఆమె ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ పై కొందరు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

తాను పెట్టిన పోస్టుకు వ్యతిరేకంగా కామెంట్లు చేసిన వారికి ఆమె గట్టిగానే సమాధానం చెప్పారు.ఇటీవల ఆమె తన ఫేస్ బుక్ వాల్ పేజీలో ఇద్దరు పురుషులు, ఒక మహిళతో కలిసి తానున్నపోటోను ఒకదాన్ని ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశారు.

Kerala Muslim fanatic wants acid poured on woman's face if 'she barks against Islam'

కాసేపటికి ఈ ఫోటోపై కామెంట్లు వెలువడ్డాయి.అందులో ఆమె నుదుటి మీద బొట్టు పెట్టుకోవడమే కాకుండా ముసుగు కూడ ధరించలేదు.దాంతో నిజంగానే నువ్వు ముస్లింవేనా అంటూ కొందరు ఆమెపై సోషల్ మీడియాలో తిడుతూ పోస్టులు పెట్టారు.

మరికొందరైతే ఆమెను వ్యభిచారి అంటూ ఇంకా అసహ్యకరమైన కామెంట్లు పెట్టారు. ఇంతకుముందు మళయాళీ ముస్లిం నటులు అసిఫ్ అలీ, ఫహద్ ఫాసిల్ , దుల్కర్ సల్మాన్ తమ భార్యలతో కలిసి ఉన్న ఫోటోలు పోస్ట్ చేసే సమయంలో ముసుగులు ధరించకపోవడంతో ఇలాంటి వ్యాఖ్యలు వాళ్ళ మీద ఇదే రకంగా విమర్శలు చేశారు.

అయితే, ఈ వ్యాఖ్యలతో అంజియా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. తాను తన ఇష్టం వచ్చినట్యటు జీవిస్తానని అడగడానికి మీరెవరూ అంటూ ఆమె తిరిగి సమాధానం చెప్పింది. ఇస్లామిక్ సనాతనవాదాన్ని మోరల్ పోలీసింగ్ ను ఆమె ఘాటుగానే విమర్శించారు.

అయితే ఆమె వ్యాఖ్యలతో అహం దెబ్బతిన్న మునీర్ ధీర అనే ఫేస్ బుక్ యూజరర్ తీవ్రంగా స్పందించారు. మరోసారి ఇస్లాం కు వ్యతిరేకంగా మాట్లాడితే ముఖం మీద యాసిడ్ పోస్తానని ఆమెను ఫేస్ బుక్ లో బెదిరించాడు.

అంజియా చేసిన పోస్టుకు వ్యతిరేకంగా, అనుకూలంగా సోషల్ మీడియాలో పెద్ద చర్చే సాగుతోంది. విమర్శలకు ధీటుగానే సమాధానం చెప్పేవారు కూడ తమ అభిప్రాయాలను వారు వ్యక్తం చేస్తున్నారు.

English summary
Banglore based Malayali woman Aziya Ashmin , who hails from kazhikode's Nadapuram is well known, at least in the kerala facebook circle.for being an outspoken critic of an array of issues raging from rampart sexism to religious fundamentalism and extremism.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X