కొల్లాంలో కూలిన బ్రిడ్జి: ఒకరి మృతి, 57 మందికి గాయాలు
కేరళలోని కొల్లాంలో ఓ పురాతన ఐరన్ బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, 57 మంది గాయపడ్డారు.
కొల్లాం: కేరళలోని కొల్లాంలో ఓ పురాతన ఐరన్ బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, 57 మంది గాయపడ్డారు.
కొల్లాంలోని చవారా సమీపంలో సోమవారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదం జరిగిన సమయంలో ఈ బ్రిడ్జి పైన 80 మంది వరకు ఉన్నట్లుగా తెలుస్తోంది.బ్రిడ్జిపై స్థానికులు రోజూ ఉదయం వాకింగ్ చేస్తుంటారు. ఈ సమయంలో బ్రిడ్జి కూలింది.












Click it and Unblock the Notifications