ఏబీవీపీ లీడర్ హత్య: కేరళలలో ఎస్ డీపీఐ కార్యకర్తలు అరెస్టు, వెంటాడి ఇంట్లో చంపారు!

కొచ్చి: కేరళలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నాయకుడు శ్యామ్ ప్రసాద్ అలియాస్ శ్యామ్ దారుణ హత్యకు గురైనాడు. శ్యామ్ ప్రసాద్ హత్య కేసులో కేరళలోని కన్నూర్ పోలీసులు సోషల్ డెమొక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ)కి చెందిన నలుగురు కార్యకర్తలను శనివారం అరెస్టు చేశారు.

ఏబీవీపీ కార్యకర్త శ్యామ్ ప్రసాద్ శుక్రవారం రాత్రి బైక్ లో వెలుతున్న సమయంలో కుతుపరంబలో హత్యకు గురైనాడు. ముఖానికి ముసుగులు వేసుకున్న కొందరు వ్యక్తులు వేటకోడవళ్లతో శ్యామ్ ప్రసాద్ మీద దాడి చేశారు.

Kerala Police arrested 4 SDPI members regarding to ABVP activist murder case.

శనివారం బీజేపీ, ఏబీవీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.కణ్ణవరంలో నివాసం ఉంటున్న శ్యామ్ ప్రసాద్ పెరవూరు పోలీస్ స్టేషన్ పరిథిలోని కుతుపరంబలో హత్యకు గురైనాడని పోలీసులు తెలిపారు. శ్యామ్ ద్విచక్ర వాహనంపై వెళ్తూండగా, అతనిపై ముగ్గురు దాడి చేశారని పోలీసులు చెప్పారు.

తీవ్రగాయాలైన శ్యామ్ ప్రసాద్ సమీపంలోని ఓ ఇంట్లోకి పరుగు తీశాడు. శ్యామ్ ప్రసాద్ ను వెంబడించిన నిందితులు అదే ఇంట్లోని వరండాలో అతనిని పట్టుకుని మారణాయుధాలతో పొడిచారు. తీవ్రంగా గాయాలైన శ్యామ్‌ ప్రసాద్ ను సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడని పోలీసులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+