కేరళలో తగ్గని కరోనా ఉధృతి: 11,150 కరోనా కేసులు, 82 మంది మృతి
దైవభూమి కేరళలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. రోజువారీ కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. 10 వేలకు పైగా కేసులు వస్తున్నాయి. గత 24 గంటల్లో 11 వేల 150 కరోనా కేసులు వచ్చాయి. వైరస్ సోకిన 82 మంది చనిపోయారు. దీంతో చనిపోయిన వారి మొత్తం సంఖ్య 27 వేల 84కి చేరింది. పాజిటివీ రేటు 11.84 శాతంగా ఉంది. ఎర్నాకులంలో 2012, తిరువనంతపురంలో 1700, త్రిసూర్‌లో 1168, కోజికోడ్ 996, కొట్టాయం 848, కొల్లాం 846, మల్లప్పురం 656, అలప్పుజాలో 625, కన్నూర్‌లో 535, ఇడుక్కిలో 439, పతనంమిట్టలో 427, పలక్కడ్‌లో 415, వాయనాడులో 328, కసర్ గడ్‌లో 159 కేసులు వచ్చాయి. గత 24 గంటల్లో 94 వేల 151 మందిని పరీక్షించారు.
ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. వైరస్‌ను జయించేందుకు రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనిపై ప్రకటన రాలేదు.

ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు డిసెంబర్ వరకు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు థర్డ్ వేవ్ ఇంపాక్ట్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు. దానిని దాటేస్తే గానీ.. పరిస్థితి ఏంటో చెప్పలేమని ఒకవిధంగా వార్నింగ్ ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications