మహిళతో ఫోన్ లో అసభ్యంగా మాట్లాడిన మంత్రి రాజీనామా చేసి ఇలా...
మహిళతో ఫోన్ లో అసభ్యంగా మాట్లాడిన కేరళ రాష్ట్ర రవాణ శాఖ మంత్రి ఎకె ససీంద్రన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తనపై వచ్చిన ఆరోపణలపై కమిటీ వేసి దర్యాప్తు చేయించాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు.
తిరువనంతపురం: మహిళతో ఫోన్ లో అసభ్యంగా మాట్లాడిన కేరళ రాష్ట్ర రవాణ శాఖ మంత్రి ఎకె ససీంద్రన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తనపై వచ్చిన ఆరోపణలపై కమిటీ వేసి దర్యాప్తు చేయించాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు.
కేరళలో సిపిఎం నేతృత్వంలోని ఎల్ డి ఎఫ్ లో ఎన్సీపికి భాగస్వామిగా ఉంది.అయితే ఎన్సీపి నుండి ఎకె ససీంద్రన్ విజయన్ మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలను చేపట్టారు.

అయితే ససీంద్రన్ ఓ మహిళతో అశ్లీలంగా మాట్లాడినట్టు ఆదివారం నాడు ఓ మీడియా చానల్ బయటపెట్టింది. దీనిపై కాంగ్రెస్, బిజెపిలు తీవ్రంగా మండిపడ్డాయి. ససీంద్రన్ ను మంత్రివర్గం నుండి తొలగించాలని డిమాండ్ చేశాయి.
కేరళ సిఎం పినరయి విజయన్ ఈ విషయమై సీరియస్ గా తీసుకొన్నారు. రవాణ శాఖ మంత్రి ససీంద్రన్ తన పదవికి రాజీనామా చేయాలని ఆయన ఆదేశించారు.దీంతో ససీంద్రన్ ఆదివారంనాడు మంత్రి పదవికి రాజీనామా చేశారు.తనపై వచ్చిన ఆరోపణలపై కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications