వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళలో ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ: భారీ నుంచి అతి భారీ వర్షాలు, ప్రజలకు సూచనలు

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా, భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కేరళలోని ఆరు జిల్లాలకు ఆదివారం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. కొచ్చిలోని పలు ప్రాంతాలు జలమయం కావడంతో రాష్ట్రంలోని పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.

కొల్లాం, పతనంతిట్ట, అలప్పుజా, ఎర్నాకులం, ఇడుక్కి, కొచ్చి జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ హెచ్చరించింది. మరో ఆరు జిల్లాలతో పాటు రాష్ట్ర రాజధాని తిరువనంతపురం మంగళవారం ఆరెంజ్ అలర్ట్ కిందకు వస్తుందని ఒన్మనోరమ నివేదిక తెలిపింది.

Kerala Weather: IMD Issues Orange Alert For Six Districts Today, heavy rains

ఆరెంజ్ అలర్ట్ ఒక రోజులో 204 మి.మీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షపాతాన్ని సూచిస్తుంది. ఈ జిల్లాల్లో ఆదివారం నాడు ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షాలు, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

వర్ష సూచన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అవసరమైన ఏర్పాట్లు చేశారు. శనివారం సాయంత్రం, ప్రధాన కార్యదర్శి, వీపీ జాయ్, అన్ని సంబంధిత శాఖలతో సమావేశానికి పిలిచారు. సన్నాహాలను ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ నివేదించింది.

కొండచరియలు విరిగిపడే ప్రాంతాలు, వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలను అవసరమైతే తరలించేందుకు వీలుగా వరద సహాయక శిబిరాలను ప్రారంభించారు. నీరు నిలిచే ప్రాంతాల నుంచి నీటిని తోడేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. కొండ ప్రాంతాల ప్రజలు రాకపోకలకు దూరంగా ఉండాలని, పర్యాటకులు ఎక్కడున్నా అక్కడే ఉండాలని, కొండ ప్రాంతాలకు వెళ్లవద్దని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ద్వారా కోరారు.

రుతుపవనాలు ఆదివారం దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతంలోకి చేరుకుంటాయని ఐఎండీ అంచనా వేసింది.

English summary
Kerala Weather: IMD Issues Orange Alert For Six Districts Today, heavy rains.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X