తల్లా, రాక్షసా: కొడుకును చంపి శవాన్ని ముక్కలు చేసింది
తిరువనంతపురం: కేరళలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కన్నకొడుకును అతి క్రూరంగా హత్య చేయడమే కాకుండా మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కాల్చేసింది. ఈ కేసును పోలీసులు రెండు రోజుల వ్యవధిలోనే ఛేదించారు.
కొళ్లాం జిల్లా పోలీసులు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జీతూ జాబ్ (14) తన తల్లి జియోమోల్‌తో కలిసి కొళ్లాం జిల్లా నెడుంబనలో నివాసం ఉంటున్నాడు. తొమ్మిదో తరగతి చదువుతున్న అతను గత సోమవారం రాత్రి అదృశ్యమైనట్లు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

స్కేలు కొనుక్కునేందుకు దుకాణానికి వెళ్లిన కుమారుడు ఇంటికి రాలేదని ఫిర్యాదులో చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జితూ కోసం గాలింపు చర్యలు చేపట్టరు. వారి ఇంటి సమీపంలో మృతదేహ ముక్క ముక్కలుగా పడి ముఖం కాలి ఉండడాన్ని పోలీసులు గుర్తించారు.
అయితే, తమకు శత్రువులు ఎవరూ లేరని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులపైకి పోలీసుల దృష్టి మళ్లింది. పోలీసులు జితూ కుటుంబ సభ్యులను విచారించారు. ఈ క్రమలో బాలుడి తల్లి చేతికి కాలిన గాయాలున్నట్లు గుర్తించారు.
దాంతో ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. విచారణలో ఆమె తన నేరాన్ని అంగీకరించింది. సోమవారం తల్లితో గొడవ పడిన తర్వాత జీతూ గొంతు నులిమి కుమారుడిని హత్య చేసినట్లు తేలింది.
చంపిన తర్వాత జియో మోల్ తన కుమారుడి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికింది. ఆ తర్వాత గుర్తు పట్టకుండా ఉండడానికి అతని ముఖంపై కిరోసిన్ పోసి నిప్పంటించింది.












Click it and Unblock the Notifications