తండ్రి సలహా: కేశూభాయ్‌కి షాకిచ్చి బిజెపిలోకి కొడుకు

2012లో కేశూభాయ్ జిపిపిని ఏర్పాటు చేశారు. భరత్ బిజెపి నుండి అందులోకి మారారు. ఇప్పుడు మళ్లీ సొంతగూటికి చేరారు. 2014 ఎన్నికలకు ముందు భరత్ తిరిగి బిజెపిలోకి చేరడం గమనార్హం. ఎన్నికల ముందు జరిగిన ఈ మార్పు పార్టీకి ఇబ్బందికరమని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తాను పార్టీ మారుతానని తన తండ్రికి చెప్పినప్పుడు నచ్చిన మార్గంలోనే వెళ్లమని ఆయన తనకు సూచించారని భరత్ అన్నారు. తాను మొదటి నుండి ఆర్ఎస్ఎస్‌లో పని చేశానని, బిజెపి నుండి తన రాజకీయ జీవితం ప్రారంభమైందని అన్నారు. తన తండ్రి పార్టీని స్థాపించినప్పుడు కేవలం తన తండ్రి నియోజకవర్గంలో మాత్రమే క్రియాశీలకంగా పని చేశానని చెప్పారు.
భరత్‌తో పాటు జిపిపికి చెందిన మరో నేత రాకేశ్ రావు కూడా బిజెపిలో చెరారు. గతంలో ఈయన బిజెపి శాసన సభ్యుడిగా పని చేశారు. గుజరాత్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌సి పాల్దు, జనరల్ సెక్రటరీ రూపాణి సమక్షంలో భరత్ బిజెపిలో చేరారు. వారు ఆయనకు కండువా కప్పి స్వాగతించారు.












Click it and Unblock the Notifications