భార్యతో సహా కీలక మావోయిస్టు ఊసెండీ లొంగుబాటు

ఉసెండి దండకారణ్య స్పెషల్ జోన్ అధికార ప్రతినిధిగా, చత్తీస్‌గడ్ స్పెషల్‌జోన్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ఉసెండి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరంగల్ జిల్ల్లా దేవరుప్పల్ మండలం కడివెండి గ్రామం. ఊసెండితో పాటు లొంగిపోయిన మహిళా మావోయిస్టును ఆయన భార్యగా భావిస్తున్నారు.
ఊసెండిపై 20 లక్షల రూపాయల అవార్డు ఉంది. గత 25 ఏళ్లుగా ఊసెండీ నక్సలైట్ ఉద్యమంలో పనిచేస్తున్నారు. ఆయన లొంగుబాటుకు కారణాలు తెలియడం లేదు.
ఊసెండీ ఛత్తీస్‌గడ్ అటవీ ప్రాంతంలో ఉంటూ నక్సలైట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. ఆయన పేర ఇటీవలి కాలంలో ప్రకటనలు వెలువడుతూ వచ్చాయి.












Click it and Unblock the Notifications