యూపీ అసెంబ్లీ మూడో దశ-అఖిలేష్ భవితవ్యం తేలిపోనుందా ? కీలకాంశాలివే

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మూడో దశకు చేరుకున్నాయి. మూడో దశలో భాగంగా రేపు 59 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగబోతోంది. ఇందులో సమాజ్ వాదీ పార్టీ ఛీఫ్ అఖిలేష్ యాదవ్ భవిష్యత్తు తేలిపోతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో బీజేపీ, ఎస్పీ మధ్య హోరాహోరీ పోరు సాగుతుందని భావిస్తున్న నేపథ్యంలో అసలు పోరును మూడో దశ పోలింగ్ నిర్ణయించబోతోందనే సంకేతాలు కూడా వెలువడుతున్నాయి.

పశ్చిమ యూపీ, రోహిల్‌ఖండ్‌లో జరిగిన మొదటి రెండు దశల్ల తరహాలో కాకుండా ముస్లిం-జాట్ సమీకరణాలు ఈ ఈసారి ప్రధాన పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది. 2017లో అధికార భారతీయ జనతా పార్టీ 50 సీట్లు గెలుచుకుని ఈ ప్రాంతాన్ని క్లీన్ స్వీప్ చేసింది. దీంతో ఈసారి ఈ నియోజకవర్గాల్లో అఖిలేష్ పార్టీ సమాజా్ వాదీ చూపయోే ప్రభావం కీలకంగా మారిపోయింది.

కాషాయ వర్గాల ఏకీకరణ అప్పట్లో యాదవుల భూమిలో సమాజ్‌వాదీ పార్టీని కుప్పకూలేలా చేసింది. అలాగే బుందేల్‌ఖండ్‌లో బహుజన్ సమాజ్ పార్టీని తుడిచిపెట్టేసింది. అలాగే కాన్పూర్ ప్రాంతంలోని పట్టణ కోటలో ఎన్నికలలో ఆధిపత్యం సాధించింది. ఈసారి అవే ప్రాంతాల్లో సమాజ్ వాదీ సత్తా చాటితేనే తర్వాతి దశల్లో నిలదొక్కుకునేందుకు వీలుంటుందని అంచనా వేస్తున్నారు.

Key Factors in UP assembly Elections Phase 3- do or die situation for akhilesh yadav

ఎంబీసీలుగా పరిగణించే అత్యంత వెనుకబడిన తరగతుల ఓటింగ్ సరళిపై ఈ దశలో ఫలితాలు ఆధారపడబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఫిరోజాబాద్, మెయిన్‌పురి, ఇటావా, ఔరయ్యా, కాన్పూర్ దేహత్‌లోని సాంప్రదాయ యాదవ భూమిలోని మౌర్య, కుష్వాహ, శాక్యాలు, సైనీల నుంచి ఎటా, కస్గంజ్ నియోజకవర్గాలలో లోధ్ ఓబీసీ ఓటింగ్ సరళి కీలకంగా మారింది. ఇందులో ఎస్పీ ప్రభావం చూపగలిగితే ఇక తిరుగుండకపోవచ్చు.

అలాగే బుందేల్‌ఖండ్‌లోని జలౌన్, హమీర్‌పూర్, మహోబా, ఝాన్సీ, లలిత్‌పూర్ ఐదు జిల్లాల్లో యాదవేతర ఓబీసీ , దళితులు కూడా పెద్ద సంఖ్యలో నిర్ణయాత్మకంగా ఉన్నారు. బుందేల్‌ఖండ్‌లోని 19 స్థానాల్లో 13 ఈ దశలో పోలింగా్ కు వెళ్లబోతున్నాయి. బండాలోని నాలుగు స్థానాలు, చిత్రకూట్‌లోని రెండు స్థానాలకు వరుసగా నాలుగు, ఐదు దశల్లో పోలింగ్ జరగనుంది. దీంతో ఆయా చోట్ల ఎస్పీకి గట్టి పోటీ ఇచ్చేందుకు యోగీ ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+