మోడీజీ ఇంకెన్ని రోజులు? కులగణనపై ప్రకటన ఆశ్చర్యం!
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) ప్రత్యేక సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. సుమారు రెండు గంటలపాటు జరిగిన సమావేశంలో పహల్గాం దాడి అనంతరం నెలకున్న పరిస్థితులు, కులగణనకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ మోడీ సర్కారుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
పహల్గాం దాడి జరిగి చాలా రోజులు గడుస్తున్నా.. ఆ తర్వాతి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం వద్ద నిర్దిష్టమైన వ్యూహం ఏమీ కనిపించడం లేదని ఖర్గే అన్నారు. ఈ విషయంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా విపక్షాలు మొత్తం కేంద్రంతోనే ఉన్నాయని పునరుద్ఘాటించారు. దేశ ఐక్యత, సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలపై కఠినంగా వ్యవహరించాలన్నారు.

ఉగ్రదాడిలో మరణించిన బాధిత కుటుంబీకులను రాహుల్ గాంధీ పరామర్శించారని, వారికి అమరుల హోదా కల్పించాలని కోరినట్లు ఖర్గే చెప్పారు. కులగణనపై తమ డిమాండును ప్రభుత్వం అంగీకరించిందని, అయితే, ప్రకటించిన సమయం మాత్రం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ప్రజాసమస్యలను నిజాయతీగా లెవనెత్తితే.. ప్రభుత్వం తలవంచక తప్పదనే విషయాన్ని రాహుల్ గాంధీ నిరూపించారన్నారు.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పలు అనుమానాలకు తావిస్తోందని మల్లిఖార్జున ఖర్గే అన్నారు. కులగణనకు ఓ ముగింపు వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు మల్లికార్జున ఖర్గే సూచించారు.మరోవైపు, కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ మాట్లాడుతూ.. కులగణన విషయంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇప్పటి వరకు బడ్జెట్, సంక్షేమ పథకాల అమలు విషయంలో పారదర్శకత లేదన్నారు. అందుకే కుల గణన విషయంలో సమయాన్ని వృథా చేయకుండా, నిర్దిష్ట కాలపరిమితితో దానిని చేయాలని తాము డిమాండ్ చేస్తుమని చెప్పారు.
हाल ही में भारत सरकार ने जातिगत जनगणना की घोषणा की।
— Congress (@INCIndia) May 2, 2025
पूरी BJP सरकार और नेताओं के तमाम विरोध के बावजूद, कई वर्षों से राहुल गांधी जी और कांग्रेस पार्टी इस मुद्दे को लेकर बहुत प्रखर रहे।
BJP के एक बहुत बड़े नेता का बयान आया था- 'बंटोगे तो कटोगे'
कांग्रेस नेताओं और राहुल गांधी… pic.twitter.com/sc4hETDBy0
సీడబ్ల్యూసీ సమావేశంలో రేవంత్
కులగణన ప్రధాన అజెండాగా సమావేశమైన అఖిల భారత కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కులగణనలో తెలంగాణ మోడల్‌ను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం చేసింది సీడబ్ల్యూసీ.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications