చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Khiladi lady: ఎర్రగా, లావుగా ఉన్న భార్య, కాన్పూ కాలేదు, క్లైమాక్స్ వరకు భర్తకే ? సినిమా ట్విస్టులు !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ పుదుచ్చేరి/దర్మపురి: కుటుంబ సభ్యులు చూపించిన యువతి తెగ నచ్చడంతో అతను వెనుకా ముందు ఆలోచించకుండా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. యువతి చూడటానికి ఎర్రగా, బొద్దుగా, లావుగా ఉండటంతో యువకుడికి భలే నచ్చేసింది. రెండు సంవత్సరాల క్రితం యువతి, యువకుడికి గ్రాండ్ గా పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన తరువాత భార్య ఆమె అత్తారింటికి వెళ్లింది. వివాహం జరిగిన సంవత్సరం తరువాత భార్య గర్బవతి అయ్యిందని ఆమె భర్తతో పాటు అతని కుటుబ సభ్యులు తెగ సంతోషపడ్డారు. అమ్మాయి కుటుంబ సభ్యులు కూడా మా అమ్మాయి తల్లి అవుతోందని మురిసిపోయారు. మహిళకు నాలుగు నెలల క్రితం గ్రాండ్ గా శీమంతం చేశారు. శీమంతానికి బంధువులు, స్నేహితులు అందరూ హాజరైనారు. డిసెంబర్ లో పండంటి బిడ్డ పుడుతుందని డాక్టర్లు డేట్ ఫిక్స్ చేశారు. డిసెంబర్ దాటిపోయి జనవరి నెల వచ్చినా బిడ్డ పుట్టకపోవడంతో భర్తతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. భార్యను ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రికి పిలుచుకుని వెళ్లి కాన్ఫు ఎందుకు కాలేదు అని ఆరా తీశారు. ఆసుపత్రిలో చేరిన మరుసటి రోజు మహిళ మాయం అయ్యింది. రెండు రోజుల వరకు భర్త, పోలీసులు ఆమె కోసం గాలించారు. తనను కిడ్నాప్ చేసిన కొందరు తన కడుపులో పుట్టిన బిడ్డను ఎత్తుకుని పారిపోయారని రెండు రోజుల తరువాత భార్య ఫోన్ చేసి ఆమె భర్తకు చెప్పింది. పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే సినిమా ట్విస్టులు మించిపోయే ట్విస్టులు వెలుగు చూడటంతో అందరూ బిత్తరపోయారు.

Khiladi lady: పొలిటికల్ లీడర్స్ కు ఇంట్లో పార్టీలు, ఏంకావాలంటే అది ఇస్తానని ?, బాయ్ ఫ్రెండ్ తో!Khiladi lady: పొలిటికల్ లీడర్స్ కు ఇంట్లో పార్టీలు, ఏంకావాలంటే అది ఇస్తానని ?, బాయ్ ఫ్రెండ్ తో!

పెళ్లి కూతురిని చూసిన కుటుంబ సభ్యులు

పెళ్లి కూతురిని చూసిన కుటుంబ సభ్యులు


తమిళనాడులోని ధర్మపురిలో రాజేష్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కోయంబత్తూరులోని స్వప్నా (పేరు మార్చడం జరిగింది) అనే యువతిని చూసిన కుటుంబ సభ్యులు నీకు ఇష్టం అయితే ఈ అమ్మాయితో పెళ్లి జరిపిస్తామని, ఆలోచించి చెప్పాలని రాజేష్ కు చెప్పారు.

 లావుగా, ఎర్రగా, బొద్దుగా ఉందని గ్రీన్ సిగ్నల్

లావుగా, ఎర్రగా, బొద్దుగా ఉందని గ్రీన్ సిగ్నల్


కుటుంబ సభ్యులు చూపించిన స్వప్నా తెగ నచ్చడంతో అతను వెనుకా ముందు ఆలోచించకుండా రాజేష్ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. స్వప్నా చూడటానికి ఎర్రగా, బొద్దుగా, లావుగా ఉండటంతో రాజేష్ కు భలే నచ్చేసింది. రెండు సంవత్సరాల క్రితం ధర్మపురిలో రాజేష్, స్వప్నాల పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది. పెళ్లి జరిగిన తరువాత స్వప్నా ధర్మపురిలోని ఆమె అత్తారింటికి వెళ్లింది.

ఏడాదికే గుడ్ న్యూస్.... గ్రాండ్ గా శ్రీమంతం

ఏడాదికే గుడ్ న్యూస్.... గ్రాండ్ గా శ్రీమంతం

వివాహం జరిగిన సంవత్సరం తరువాత తన భార్య స్వప్నా గర్బవతి అయ్యిందని ఆమె భర్త రాజేష్ తో పాటు అతని కుటుబ సభ్యులు తెగ సంతోషపడ్డారు. స్వప్నా కుటుంబ సభ్యులు కూడా మా అమ్మాయి తల్లి అవుతోందని మురిసిపోయారు. నాలుగు నెలల క్రితం స్వప్నాకు గ్రాండ్ గా శీమంతం చేశారు. స్వప్నా శీమంతానికి బంధువులు, స్నేహితులు అందరూ హాజరైనారు.

10 నెలలు అయినా బిడ్డ పుట్టలేదని ఆందోళన

10 నెలలు అయినా బిడ్డ పుట్టలేదని ఆందోళన


డిసెంబర్ లో స్వప్నాకు పండంటి బిడ్డ పుడుతుందని డాక్టర్లు డేట్ ఫిక్స్ చేశారు. డిసెంబర్ దాటిపోయి జనవరి నెల వచ్చినా స్వప్నాకు బిడ్డ పుట్టకపోవడంతో ఆమె భర్త రాజేష్ తో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఒక్కోసారి కాన్పు లేటుగా అవుతుందని, తల్లి లావుగా ఉండటంతో సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఓ డాక్టర్ రాజేష్ కు చెప్పిందని తెలిసింది.

 ఆసుపత్రిలో మాయం అయిన మహిళ

ఆసుపత్రిలో మాయం అయిన మహిళ

రాజేష్ అతని భార్య స్వప్నాను పుదుచ్చేరిలో ప్రముఖ జిమ్సర్ ప్రైవేట్ ఆసుపత్రికి పిలుచుకుని వెళ్లి కాన్ఫు ఎందుకు కాలేదు అని ఆరా తీశారు. పుదుచ్చేరిలోని ఆసుపత్రిలో చేరిన స్వప్నా రాత్రి కాలం గడిపింది. మరుసటి రోజు వేకువ జామున స్పెషల్ వార్డులో ఉన్న స్వప్నా మాయం అయ్యింది. ఆసుపత్రిలో ఉన్న స్వప్నా మాయం కావడంతో అందరూ హడలిపోయారు. రెండు రోజుల వరకు భార్య స్వప్నా కోసం వెతికిన ఆమె భర్త రాజేష్ పోలీసు కేసు పెట్టారు.

 ఫోన్ చేసి షాకింగ్ విషయం చెప్పిన భార్య

ఫోన్ చేసి షాకింగ్ విషయం చెప్పిన భార్య

పోలీసులు, రాజేష్ స్వప్నా కోసం గాలించారు. స్వప్నా మొబైల్ నెంబర్ ట్రేస్ చెయ్యడంతో ఆమె తమిళనాడులోని కోయంబత్తూరులో ఉందని పోలీసులు గుర్తించారు. రెండు రోజుల తరువాత స్వప్నా ఆమె భర్త రాజేష్ కు ఫోన్ చేసింది. తనను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి ఆసుపత్రిలో తన కడుపులో పుట్టిన బిడ్డను ఎత్తుకుని పారిపోయారని స్వప్నా ఆమె భర్త రాజేష్ కు చెప్పింది. పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే సినిమా ట్విస్టులు మించిపోయే ట్విస్టులు వెలుగు చూడటంతో అందరూ బిత్తరపోయారు.

 అసలు గర్బవతి కాలేదు

అసలు గర్బవతి కాలేదు

పోలీసులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో స్వప్నాకు చికిత్స చేయించడంతో అసలు మ్యాటర్ బయటకు వచ్చింది. అసలు స్వప్నా గర్బవతి కాలేదని, ఇంతకాలం ఆమె కుటుంబ సభ్యులను మోసం చేసిందని వైద్యులు చెప్పడంతో అందరూ హడలిపోయారు. తాను లావుగా ఉండటం వలను అందరూ గర్బవతి అని అనుకున్నారి, తాను గర్బవతి కాలేదని చెప్పినా మాట వినలేదని, అందుకే ఇంతకాలం డ్రామా ఆడానని, కాన్పు అయిన తరువాత బిడ్డను ఎవరో ఎత్తుకెళ్లారని చెబితే సమస్య పరిష్కారం అవుతుందని స్కెచ్ వేశానని స్వప్నా చెప్పడంతో అందరూ హడలిపోయారు.

 అందరికి మైండ్ బ్లాక్

అందరికి మైండ్ బ్లాక్


అయితే భర్తతో పాటు కుటుంబ సభ్యులకు ఎలాంటి అనుమానం రాకుండా ఇంతకాలం స్వప్నా ఎలా మేనేజ్ చేసింది అనే విషయం అంతు చిక్కడం లేదని పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. మొత్తం మీద 10 నెలల పాటు ఓ మహిళ తాను గర్బవతి అని అందర్ని నమ్మించి మోసం చెయ్యడం తమిళనాడులో హాట్ టాపిక్ అయ్యింది.

English summary
Khiladi lady: Until she was allowed to give birth in the hospital, a woman deceived the family by telling a lie that she is pregnant.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X