Khiladi lady: భార్యకు కాదు, భర్తకే అక్రమ సంబంధం, ఐదు మంది హత్య అందుకే, పక్కాస్కెచ్ !
బెంగళూరు: కొన్ని రోజుల క్రితం భర్త, అతని భార్య అన్న, వదిన కలిసి వ్యాపారం చెయ్యడానికి బయట ఊరికి వెళ్లారు. ఇంట్లో మహిళ ఆమె ముగ్గురు పిల్లలు, అన్న కొడకుతో ఉంది. మరుసటి రోజు ఉదయం బంధువు అయిన మహిళ వారి ఇంటికి వెళ్లి చూడగా వివాహిత మహిళతో పాటు నలుగురు పిల్లలు ఇంట్లో దారుణ హత్యకు గురైనారు. మహిళ, నలుగురు బిడ్డలను కత్తితో దారుణంగా నరికి చంపేసి ఇంటి బయట లాక్ చేసుకుని వెళ్లిపోవడంతో ఆ ప్రాంతంలో కలకలం రేపింది. ఒకే ఇంట్లో ఐదు మంది దారుణ హత్యకు గురి కావడంతో ఆమె కుటుంబ సభ్యులు హడలిపోయారు. హత్యకు గురైన మహిళకు ఏమైనా అక్రమ సంబంధం ఉందా ? అనే కోణంలో పోలీసులు విచారణ చేశారు. అయితే పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు బయటకు వచ్చాయి. హత్యకు గురైన మహిళ భర్తకు అక్రమ సంబంధం ఉందని, భర్త ప్రియురాలు ఐదు మందిని చంపేసిందని వెలుగు చూడటం కలకలం రేపింది.

హ్యాపీలైఫ్ అనుకున్న భార్య
మండ్య జిల్లాలోని శ్రీరంగపట్టణం తాలుకాలోని కేఆర్ ఎస్ ఊరిలోని బజార్ లైన్ ప్రాంతంలో గంగారామ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. బంధువుల అమ్మాయి లక్ష్మీ (31)ని వివాహం చేసుకున్న గంగరామ్ అతని భార్యతో చక్కగా కాపురం చేస్తున్నాడు. గంగరామ్, లక్ష్మీ దంపతులకు , రాజ్ (12), కోమల్ (7), కునాల్ (4) అనే నలుగురు పిల్లలు ఉన్నారు.

ఉమ్మడి కాపురం..... కలిసే వ్యాపారం
గంగారామ్ భార్య లక్ష్మీ అన్న గణేస్, అతని భార్య చంపాణి కూడా ఒకే ఇంటిలో ఉంటున్నాడు. గంగారమ్, లక్ష్మీ దంపతులతో పాటు గణేష్, చంపాడి దంపతులు అందరూ కలిసి ఉమ్మడి కాపురం ఉంటున్నారు. గణేష్, చంపాడి దంపతులకు గోవింద (8) అనే కుమారుడు ఉన్నాడు. బావబావమరిది గంగారామ్, గణేష్ కలిసి ప్లాస్టిక్ పూలు, ప్లాస్టిక్ వస్తువుల వ్యాపారం చేస్తున్నారు.

ఐదు మంది దారుణ హత్య
కొన్ని రోజుల క్రితం లక్ష్మీ భర్త గంగారామ్, అతని భార్య వదిన చంపాడి, అన్న గణేష్ కలిసి వ్యాపారం చెయ్యడానికి బయట ఊర్లకు వెళ్లారు. తరువాత లక్ష్మీ ఆమె ముగ్గురు పిల్లలతో పాటు అన్న గణేష్ కొడుకు గోవిందతో కలిసి ఇంటిలో ఉంటున్నది. వివాహిత మహిళ లక్ష్మీతో పాటు ఇంట్లో ఉన్న నలుగురు పిల్లలు రాజు, కోమల్, కునాల్, గోవింద దారుణ హత్యకు గురైనారు. లక్ష్మీతో పాటు నలుగురు బిడ్డలను కత్తులు, కొడవళ్లతో దారుణంగా నరికి చంపేసిన నిందితులు ఇంటి బయట లాక్ చేసుకుని వెళ్లిపోయారు.

ఏదో అనుకుంటే...... ఏదో మ్యాటర్ బయటకు వచ్చింది
హత్యకు గురైన గంగరామ్ భార్య లక్ష్మీకి ఏమైనా అక్రమ సంబంధం ఉందా ? అనే కోణంలో మొదట పోలీసులు విచారణ చేశారు. అయితే పోలీసుల విచారణలో హత్యకు గురైన లక్ష్మీ భర్తకు వేరే ఊరిలో నివాసం ఉంటున్న శ్రీలక్ష్మి అనే మహిళతో అక్రమ సంబంధం ఉందని వెలుగు చూడటం కథ మలుపు తిరిగింది.

ప్రియుడి భార్య హత్యకు చికెన్ కత్తి స్కెచ్
గంగారామ్ కు శ్రీలక్ష్మి అలియాస్ లక్ష్మీతో చాలాకాలంగా అక్రమ సంబందం ఉందని పోలీసు అధికారులు చెప్పారు. గంగారామ్ వ్యాపారం చెయ్యడానికి బయట ఊరికి వెళ్లాడని తెలుసుకున్న శ్రీలక్ష్మి ఆమె ప్రియుడి భార్య లక్ష్మిని చంపేయాలని పక్కా స్కెచ్ వేసుకుంది. మైసూరు తాలుకాలోని బెలవత్త గ్రామంలో చికెన్ సెంటర్ లో కోళ్లు కత్తిరించడానికి ఉపయోగించే కత్తిని, బయట ఓ సుత్తిని శ్రీలక్ష్మి తీసుకుంది.

గుర్తు పడతారని పిల్లలను చంపేసింది
గంగారామ్ ఇంటికి వెళ్లిన శ్రీలక్ష్మి ప్రియుడి భార్య లక్ష్మితో గొడవ పెట్టుకుంది. అర్దరాత్రి వరకు అక్కడే ఉన్న శ్రీలక్ష్మి తరువాత కోడిమాంసం కత్తిరించే కత్తితో లక్ష్మీని చంపేసింది. ఆసమయంలో చప్పుడు కావడంతో పిల్లలు నిద్రలేచారని, తనను గుర్తు పట్టి పోలీసులకు పట్టిస్తారనే భయంతో శ్రీలక్ష్మి నలుగురు పిల్లలను కూడా అప్పుడే చంపేసిందని పోలీసు అధికారులు అన్నారు.

శవాల పక్కనే కాలం గడిపింది
ఐదు మందిని చంపేసిన శ్రీలక్ష్మి వేకువ జామున 3 గంటల వరకు శవాల పక్కన అదే ఇంట్లో ఉందని, తరువాత లక్ష్మి ఇంట్లోని వస్తువులు చెల్లాచెదురు చేసి దొంగలు ఐదు మందని చంపేశారని కేసు విచారన పక్కదోవ పట్టించడానికి వస్తువులు చెల్లా చెదురు చేసి వెళ్లిపోయిందని పోలీసులు అన్నారు. రక్తపు మరకలు అయిన దుస్తులను ఇంటికి వెళ్లి తీసేసిన శ్రీలక్ష్మి మరుసటి రోజు నేరుగా హత్యలు జరిగిన లక్ష్మీ ఇంటి దగ్గరకు వచ్చింది.

అందరిముందు డ్రామాలు ఆడిన ప్రియురాలు
లక్ష్మీని, ఆమె పిల్లలను హత్య చేశారని శ్రీలక్ష్మి అందరి ముందు విలపించి కేసు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిందని పోలీసు అధికారులు అన్నారు. పక్కాసాక్షాలతో ఒకే ఇంట్లో ఐదు మందిని హత్య చేసిన శ్రీలక్ష్మిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. లక్ష్మీ, ఆమె పిల్లల హత్యలతో భర్త గంగారామ్ కు ఏమైనా సంబంధం ఉందా ? అనే కోణంలో కూడా విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications