వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Khiladi wife: కెనడాలో కత్తిలాంటి భార్య, ఇక్కడ భర్త, మామకు పంగనామాలు, స్వాహా, చివరికి !

|
Google Oneindia TeluguNews

పంజాబ్/ కెనడా/ చెన్నై: విదేశాల్లో మంచి ఉద్యోగం చెయ్యాలని యువకుడు బావించాడు. రైతు అయిన తండ్రి తన కొడుకు సంతోషంగా ఉంటాడని అతను విదేశాలకు వెళ్లడానికి సహకరించాడు. యువకుడి పెళ్లి నిశ్చయం అయ్యింది. కెనడాలో కంప్యూటర్ కోర్స్ చెయ్యడానికి వెళ్లిన కాభోయే భార్యకు ఆ యవకుడు, అతని కుటుంబ సభ్యులు లక్షలాది రూపాయలు పంపించారు. సంవత్సరం తరువాత భారత్ వచ్చిన యువతి ఆ యువకుడిని పెళ్లి చేసుకుంది. త్వరలో మనకు కెనడా పౌరసత్వం వస్తోందని, మనం అక్కడ సిటిల్ అయిపోతామని, త్వరలో నిన్ను కెనడాకు పిలుచుకుని వెలుతానని చెప్పిన భార్య కెనడాకు చెక్కేసింది. ఇప్పటికే భార్యకు రూ. 24 లక్షల రూపాయలు ఇచ్చిన భర్త, అతని తండ్రి ఇచ్చారు. అప్పటి నుంచి భర్త కెనడాకు వెళ్లడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే కెనడాలో కుర్చున్న కత్తిలాంటి భార్య ఆమె భర్త, మామ జీవితాన్ని సంకనాకించేసింది. మోసం జరిగిందని ఆలస్యంగా గుర్తించిన భర్త ఇక్కడ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

Illegal affair: భార్య ప్రియుడు, మర్మాంగాన్ని తుపాకితో కాల్చేసిన భర్త. గుత్తి ఢమాల్, ఇప్పుడు చెయ్యి !Illegal affair: భార్య ప్రియుడు, మర్మాంగాన్ని తుపాకితో కాల్చేసిన భర్త. గుత్తి ఢమాల్, ఇప్పుడు చెయ్యి !

కొడుక్కి కెనడా మీద మోజు

కొడుక్కి కెనడా మీద మోజు

పంజాబ్ లోని బర్నాలా జిల్లాలోని కోథర్ గోవిందాపుర్ గ్రామంలో బల్విందర్ సింగ్ అనే ఆయన నివాసం ఉంటున్నారు. బల్విందర్ సింగ్ ఐదు ఎకరాల సొంత పోలంలో వ్యవసాయం చేయించేవాడు. బల్విందర్ సింగ్ కుమారుడు లవ్ ప్రీత్ (24) విద్యాభ్యాసం పూర్తి చేసి విదేశాలకు వెళ్లి మంచి ఉద్యోగం చెయ్యాలని ఎదురు చూశాడు.

అమ్మాయికి ఆదే ఆశ

అమ్మాయికి ఆదే ఆశ

పంజాబ్ లోని బర్నాలా జిల్లాలోని ఖుడి కలాన్ గ్రామంలో నివాసం ఉంటున్న బీంట్ కౌర్ విద్యాభ్యాసం పూర్తి చేసి కెనడా వెళ్లి అక్కడే స్థిరపడాలని అనుకుంది. బీంట్ కౌర్, లవ్ ప్రీత్ ఇద్దరు విదేశాలకు వెళ్లి మంచి ఉద్యోగం చెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్నారు. బంధువుల వలన ఈ విషయం ఇరుకుటుంబ సభ్యులకు తెలిసింది.

కాభోయే భార్యకు లక్షలు ఖర్చు చేశాడు

కాభోయే భార్యకు లక్షలు ఖర్చు చేశాడు

లవ్ ప్రీత్, బీంట్ కౌర్ కు పెళ్లి చెయ్యాలని ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఇదే సమయంలో తాను కెనడా వెళ్లి కంప్యూటర్ కోర్సు చెయ్యాలని కాభోయే భర్త లవ్ ప్రీత్ కు కౌర్ చెప్పింది. బీంట్ కౌర్ కెనడాకు వెళ్లడానికి లవ్ ప్రీత్ తండ్రి కొంచెం పొలం అమ్మి కాభోయే కోడలు బీంట్ కౌర్ విదేశాలకు వెళ్లడానికి ఇచ్చాడు.

పెళ్లికి ముందే కెనడాకు చెక్కేసిన కౌర్

పెళ్లికి ముందే కెనడాకు చెక్కేసిన కౌర్

2018 ఆగస్టు 19వ తేదీన బీంట్ కౌర్ కెనడాలోని అంటారియోలో కంప్యూటర్ కోర్సు చెయ్యడానికి వెళ్లిపోయింది. లవ్ ప్రీత్ మాత్రం పంజాబ్ లోనే ఉంటూ కెనడా వెళ్లడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు. ఇదే సమయంలో పెళ్లి డేట్ ఫిక్ చేసిన లవ్ ప్రీత్ కుటుంబ సభ్యులు కెనడాలో ఉన్న పెళ్లి కూతురు బీంట్ కౌర్ ను పంజాబ్ కు పిలిపించారు.

పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన భార్య

పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన భార్య


భారత్ తరిగి వచ్చిన బీంట్ కౌర్ 2019 ఆగస్టు 7వ తేదీన లవ్ ప్రీత్ ను వివాహం చేసుకుంది. రెండు నెలల పాటు భర్త లవ్ ప్రీత్ తో కాపురం చేసిన బీంట్ కౌర్ తరువాత కెనడా బయలుదేరడానికి సిద్దం అయ్యింది. తాను కెడనా వెళ్లి ఆదేశం పౌరసత్వం తీసుకుని మంచి ఉద్యోగం సంపాధిస్తానని, తరువాత నిన్ను పిలుచుకుని వెలుతానని కౌర్ ఆమె భర్త లవ్ ప్రీత్ కు మాయమాటలు చెప్పింది.

కెనడా నుంచి భర్తను, మామ ఫ్యామిలీని నాకించేసింది

కెనడా నుంచి భర్తను, మామ ఫ్యామిలీని నాకించేసింది


కెనడా వెళ్లిపోయిన భార్య బీంట్ కౌర్ భర్త లవ్ ప్రీత్ కుటుంబ సభ్యుల నుంచి లక్షల రూపాయల వసూలు చేసుకుని తరువాత వారిని పట్టించుకోవడం మానేసింది. రానురాను భర్త లవ్ ప్రీత్ సింగ్ ఫోన్ కాల్స్ కూడా రిసీవ్ చేసుకోకుండా అతన్ని పూర్తిగా దూరం పెట్టిన బీంట్ కౌర్ కెనడాలో సెటిల్ అయిపోయింది. కెనడాలోనే వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న కౌర్ అక్కడే ఎంజాయ్ చేస్తోందని తెలుసుకున్న లవ్ ప్రీత్ ఆవేదన చెందాడు. తన కోసం, తన భార్య బీంట్ కౌర్ బాగుండాలనే ఉద్దేశంతో తన తండ్రి ఆస్తులు అమ్మి రూ. 24 లక్షలు ఖర్చు చేశాడని లవ్ ప్రీత్ కుమిలిపోయాడు.

కెనడాలో కత్తిలాంటి భార్య.... మోసం చేసిందని భర్త ఆతహత్య

కెనడాలో కత్తిలాంటి భార్య.... మోసం చేసిందని భర్త ఆతహత్య

భార్య కౌర్ మోసం చేసిందని ఆవేదనతో గత నెల జూన్ లో సోంతఊర్లో లవ్ ప్రీత్ ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పంజాబ్ రాష్ట్ర మహిళా కమీషన్ చైర్మన్ మనిశ్రా గులాటి ఈనెల 13వ తేదీన లవ్ ప్రీత్ ఇంటికి చేరుకుని అతని కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. తరువాత బీంట్ కౌర్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని పంజాబ్ ప్రభుత్వానికి, విదేశాంగ శాఖ అధికారులకు మనిశ్రా గులాటి లేఖ రాశారు.

రూ. 24 లక్షలు నొక్కేసిన కిలాడి కౌర్

రూ. 24 లక్షలు నొక్కేసిన కిలాడి కౌర్

బీంట్ కౌర్ కెనడా వెళ్లి కంప్యూటర్ కోర్సు చెయ్యడానికి, ఆమె ఖర్చులకు, తన కొడుక్కి కెనడా పౌరసత్వం ఇప్పిస్తానని చెప్పినందుకు ఇప్పటి వరకు రూ. 24 లక్షలు బీంట్ కౌర్ కు ఇచ్చామని లవ్ ప్రీత్ తండ్రి బల్విందర్ సింగ్ చెప్పారు. భర్త లవ్ ప్రీత్ కుటుంబ సభ్యులను మోసం చేసి కెనడాలో ఎంజాయ్ చేస్తున్న బీంట్ కౌర్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని గురువారం పంజాబ్ పోలీసులు చెప్పారు. లవ్ ప్రీత్ తండ్రి బల్విందర్ సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కెనడాలో ఉన్న బీంట్ కౌర్ ను భారత్ రప్పించడానికి చర్యలు తీసుకుంటున్నారు.

English summary
Khiladi wife: A woman’s desire to settle abroad has allegedly claimed the life of a 24-year-old man in Barnala district of Punjab. Beant Kaur, a resident of Khudi Kalan village, took lakhs of rupees from her husband’s family for settling with him in Canada, but later dumped him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X