Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Khiladi wife: లవ్ మ్యారేజ్, భర్తను పొడిచేసిన భార్య, అత్తను వదల్లేదు, ఆ విషయంలో తేడాలు !

చెన్నై: కాలేజ్ లో చదువుకోవడానికి ప్రతిరోజు బస్సులో వెళ్లి వస్తున్న యువతికి, బస్సు కండెక్టర్ కు పరిచయం అయ్యింది. మూడు సంవత్సరాలు ప్రేమించుకున్న యువతి యువకుడు తరువాత పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. దంపతులకు 7 నెలల పాప ఉంది. పాప పుట్టిన తరువాత యువతి, యువకుడి కుటుంబ సభ్యులు వారిని చేరదీశారు. దంపతుల మద్య నిత్యం గొడవలు జరగడంతో భార్య కూతురిని పిలుచుకుని పుట్టింటికి వెళ్లిపోయి భర్త మీద వరకట్నం వేదింపుల కేసు పెట్టింది. భర్తను అరెస్టు చేసిన పోలీసుు అతన్ని జైలుకు పంపించారు. జైలు నుంచి బెయిల్ మీద వచ్చిన భర్తతో మళ్లీ భార్య టచ్ లోకి వచ్చింది. భార్య కేసు వెనక్కి తీసుకోవడంతో దంపతులు మళ్లీ కలిసిపోయి కాపురం చేస్తున్నారు. పుట్టింటి నుంచి మళ్లీ అత్తారింటికి వెళ్లిన భార్య ఆమె భర్తతో పాటు అత్తతో కూడా వీరలెవల్లో గొడవపడింది. ఇదే సమయంలో భార్యకు వేరే వ్యక్తి పదేపదే ఫోన్లు చేసిమాట్లాడటం భర్త గమనించాడు. ఏమిటి నువ్వు చేస్తున్న పని అని ప్రశ్నించిన భర్తను అతని భార్య కత్తితో పొడిచేసింది. కొడుకును కోడలు కత్తితో పొడుస్తున్న సమయంలో అడ్డుపడిన అత్తను కూడా దారుణంగా పొడిచిన కోడులు ఇప్పుడు కటకటాలపాలైయ్యింది.

బస్సు కండెక్టర్ తో కాలేజ్ అమ్మాయి

బస్సు కండెక్టర్ తో కాలేజ్ అమ్మాయి

తమిళనాడులోని సేలం జిల్లా ఎడప్పాడి సమీపంలోని మాసయ్యన్ స్ట్రీలో నివాసం ఉంటున్న బాలచంద్రన్ కుమారుడు బాలమురుగన్ (32) అనే యువకుడు ప్రైవేట్ బస్సులో కండెక్టర్ గా పని చేస్తున్నాడు. క్రిష్ణగిరి జిల్లాలోని పారిస్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఇలాకియా (26) ప్రైవేట్ కాలేజ్ లో చదువుకోవడానికి బస్సులో వెళ్లి వస్తున్న సమయంలో బాలమురుగన్ పరిచయం అయ్యాడు.

పెద్దలను ఎదరించి లవ్ మ్యారేజ్

పెద్దలను ఎదరించి లవ్ మ్యారేజ్


మూడు సంవత్సరాలు ప్రేమించుకున్న బాలమురుగన్, ఇలాకియా తరువాత పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. పెద్దలను ఎదిరించిన బాలమురుగన్, ఇలాకియా 2020 ఫిబ్రవరిలో వివాహం చేసుకున్నారు. బాలమురుగన్, ఇలాకియా దంపతులకు 7 నెలల పాప ఉంది.

దంపతులను చేరదీసిన ఫ్యామిలీలు

దంపతులను చేరదీసిన ఫ్యామిలీలు

పాప పుట్టిన తరువాత బాలమురుగన్, ఇలాకియాను వారి కుటుంబ సభ్యులు చేరదీశారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న బాలమురుగన్, ఇలాకియా దంపతుల మద్య నిత్యం గొడవలు జరిగాయి. పెద్దలు పంచాయితీలు చేసినా దంపతులు మాట వినలేదు. భర్త బాలమురుగన్ తో గొడవపడిన ఇలాకియా ఆమె కూతురిని పిలుచుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.

భర్తను జైలుకు పంపిచిన భార్య

భర్తను జైలుకు పంపిచిన భార్య

పుట్టింటికి చేరుకున్న ఇలాకియా కొన్ని రోజులకే ఆమె భర్త బాలమురుగన్ మీద వరకట్నం వేదింపుల కేసు పెట్టింది. పోలీసులు బాలమురుగన్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. కొంతకాలం జైల్లో ఉన్న బాలమురుగన్ తరువాత బెయిల్ తీసుకుని బయటకు వచ్చాడు. జైలు నుంచి బెయిల్ మీద వచ్చిన భర్త బాలమురుగన్ తో మళ్లీ అతని భార్య ఇలాకియా టచ్ లోకి వచ్చింది.

భార్య రెచ్చిపోయింది

భార్య రెచ్చిపోయింది

బాలమురుగన్ మీద అతని భార్య ఇలాకియా పెట్టిన వరకట్నం వేధింపుల కేసు వెనక్కి తీసుకోవాలని, పాపకోసం అయినా కలిసి కాపురం చెయ్యాలని పెద్దలు రాజీ చేశారు. భార్య ఇలాకియా కేసు వెనక్కి తీసుకోవడంతో బాలమురుగన్ దంపతులు మళ్లీ కలిసిపోయి కాపురం చేస్తున్నారు. పుట్టింటి నుంచి మళ్లీ అత్తారింటికి వెళ్లిన ఇలాకియా ఆమె భర్త బాలమురుగన్ తో పాటు అత్త జ్యోతితో గొడవ పడుతూ వీరలెవల్లో రెచ్చిపోయింది.

యువకుడితో చనువుగా ఫోన్ లో మాట్లాడిన భార్య

యువకుడితో చనువుగా ఫోన్ లో మాట్లాడిన భార్య


భార్య ఇలాకియాకు వేరే వ్యక్తి పదేపదే ఫోన్లు చేసిమాట్లాడటం ఆమె భర్త బాలమురుగన్ గమనించాడు. ఏమిటి నువ్వు చేస్తున్న పని, లవ్ మ్యారేజ్ చేసుకుని ఇప్పుడు వేరే యువకుడితో ఫోన్ లో మాట్లాడుతున్నావా ? అంటూ భర్త బాలమురుగన్ అతని భార్య ఇలాకియాను ప్రశ్నించాడు. ఇదే విషయంలో బాలమురుగన్, ఇలాకియా దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి.

 భర్తను పొడిచి పారేసిన భార్య

భర్తను పొడిచి పారేసిన భార్య

భర్త మందలించినా ఇలాకియా మాత్రం ఫోన్ లో ఆమె బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడకుండా ఉండలేకపోయింది. ఇలాకియా ఫోన్ లో మాట్లాడుతున్న సమయంలో ఆమె ఫోన్ లాక్కొవడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో ఆవేశంతో ఊగిపోయిన ఇలాకియా కత్తి తీసుకని ఆమె భర్త బాలమురుగన్ ను ఇష్టం వచ్చినట్లు పొడిచేసింది.

Recommended Video

    సినీ పరిశ్రమలో విషాదం.. నటుడు Uttej Wife కన్నుమూత..!! || Oneindia Telugu
     అత్తను కూడా వదలని కోడలు

    అత్తను కూడా వదలని కోడలు

    కొడుకు మీద కోడులు కత్తితో దాడి చేస్తున్న సమయంలో అడ్డుపడిన అత్త జ్యోతిని కూడా ఇలాకియా పొడిచేయడంతో కుప్పకూలిపోయారు. విషయం గమనించిన బంధువులు ఇలాకియాను పట్టుకుని రూమ్ లో వేసి తాళం వేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తీవ్రగాయాలైన భర్త బాలమురుగన్ ను, అతని జ్యోతిని ఎడప్పాడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషయంగా ఉండటంతో ఇద్దరిని సేలం జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఇలాకియాను అరెస్టు చేసి సేలం జిల్లా మహిళా కారాగారానికి పంపించారు. భర్తను పొడియిన ఇలాకియా ఇప్పుడు రోజూ మద్యం సేవించి వచ్చి తన మీద తన భర్త బాలమురుగన్ దాడి చేస్తున్నాడని, అందుకో పొడిచానని రివర్స్ లో కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+