వాస్తు ప్రకారం తలుపు వెనక ఇవి పెడితే దురదృష్టాన్ని తెచ్చుకున్నట్లే
వాస్తు శాస్త్రంలో ఇంటి ప్రధాన ద్వారం, గదుల తలుపులను కేవలం రాకపోకలకు ఉపయోగపడే సాధనాలుగా మాత్రమే చూడరు. అవి లక్ష్మీదేవి, సానుకూల శక్తి మన ఇంట్లోకి ప్రవేశించే పవిత్ర మార్గాలు. చాలామంది ఇళ్లను అందంగా అలంకరిస్తారు కానీ, తలుపుల వెనుక భాగాలను నిర్లక్ష్యం చేస్తుంటారు. తెలియక అక్కడ పెట్టే కొన్ని వస్తువులు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పెంచి, ఆర్థిక ఇబ్బందులకు, మానసిక అశాంతికి కారణమవుతాయి. ముఖ్యంగా ఈ ఐదు వస్తువులను తలుపుల వెనుక నుంచి వెంటనే తొలగించాలి.
1. బట్టల గుట్టలు (వాడేసిన దుస్తులు)
చాలామందికి ఆఫీసు నుంచి లేదా బయటి నుంచి రాగానే తలుపు వెనుక ఉండే హుక్స్‌కు బట్టలు తగిలించడం అలవాటు. తలుపు వెనుక బట్టల భారం పెరిగితే, అది ఇంట్లోని మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది.ఇంట్లో ఉండే వారికి తెలియని అలిసిపోయిన భావన, చిరాకు,నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

2. మందుల సంచులు లేదా మెడిసిన్ బాక్సులు
అందుబాటులో ఉంటాయనే నెపంతో కొందరు తలుపు వెనుక ఉండే అరల్లో లేదా తలుపుకు తగిలించిన సంచుల్లో మందులు పెడుతుంటారు.వాస్తు ప్రకారం తలుపు అనేది ప్రగతికి మార్గం.అక్కడ మందులు ఉంచడం అంటే అనారోగ్యాన్ని ఇంట్లోకి ఆహ్వానించడమే.ఆ ఇంట్లో ఏదో ఒక అనారోగ్య సమస్య నిరంతరం వేధిస్తూనే ఉంటుంది.
వైద్యం కోసం ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి.
3. కాలం చెల్లిన పాత క్యాలెండర్లు
కొత్త క్యాలెండర్ వచ్చినా, పాత క్యాలెండర్లను తలుపు వెనుక అలాగే ఉంచేస్తుంటారు చాలామంది.పాత క్యాలెండర్లు నిలిచిపోయిన సమయానికి గతాన్ని పట్టుకుని వేలాడటానికి సంకేతం.ఇది ఇంట్లో ఉన్నవారి ఆర్థిక, వృత్తిపరమైన ఎదుగుదలను స్తంభింపజేస్తుంది.కొత్త అవకాశాలు రాకుండా అడ్డుకుంటుంది.
4. చెప్పులు, బూట్లు (పాడైపోయినవి కూడా)
తలుపు వెనుక ఎవరికీ కనిపించకుండా చెప్పులు విడవడం లేదా పాత బూట్లను అక్కడ దాచడం తీవ్రమైన వాస్తు దోషం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పాదరక్షలు 'రాహు' గ్రహ ప్రభావానికి ప్రతీకలు. లక్ష్మీదేవి వచ్చే మార్గంలో రాహువు ప్రభావం ఉంటే ఇంట్లో అనవసరపు గొడవలు,కోర్టు సమస్యలు, కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అపనమ్మకాలు పెరుగుతాయి.
5. తడి తువ్వాళ్లు
స్నానం చేసి రాగానే తలుపుల పైనో, లేదా వెనుక వైపో తడి తువ్వాళ్లను
ఆరేయడం చాలా ఇళ్లలో కనిపించే సాధారణ దృశ్యం.
తడి వస్తువులు ప్రతికూల శక్తిని
రాహు-కేతువుల దుష్ప్రభావాన్ని త్వరగా ఆకర్షిస్తాయి.
దీనివల్ల భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే అపార్థాలు రావడం,
ప్రశాంతత లోపించడం వంటివి జరుగుతాయి.
ఇంటి తలుపులు ఎప్పుడూ ఎలాంటి అడ్డంకులు లేకుండా
సులభంగా, పూర్తిగా తెరుచుకునేలా ఉండాలి.
ఇంటి తలుపుల వెనుక భాగాన్ని ఎప్పుడూ ఖాళీగా,
శుభ్రంగా ఉంచడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి సజావుగా ప్రవహిస్తుంది.
గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా చూసుకుంటే వాస్తు దోషాలు తొలగిపోయి, లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది.












Click it and Unblock the Notifications