బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Khiladi: కారం పొడి కహాని, అక్క పెళ్లితో ? నెల రోజుల్లోనే కిలాడీ స్కెచ్, ఫ్లైఓవర్ డ్రామాతో జైలుపాలు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రముఖ జ్యువెలరీ షోరూమ్ ల కంపెనీలో ఉద్యోగంలో చేరిన యువకుడు ఆ కంపెనీ యాజమాన్యం, అధికారుల దగ్గర నెల రోజుల్లోనే మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్నాడు. నెల రోజుల్లోనే లక్షల రూపాయల డబ్బులు ఆ జ్యువెలరీ కంపెనీకి చెందిన బ్రాంచ్ ఆఫీసులకు తరలించడం మొదలు పెట్టాడు. ప్రతిరోజు ఉదయం హెడ్ ఆఫీసు నుంచి సిటీలోని ఆ జ్యువెలరీ షోరూమ్ లకు డబ్బులు తరలిస్తుంటాడు. ఎప్పటిలాగే రూ. 8 లక్షలు డబ్బులు తీసుకుని బ్యాగ్ లో బ్రాంచ్ ఆఫీసులకు బయలుదేరాడు. రెండు గంటల తరువాత పోలీసులు, జ్యువెలరీ షోరూమ్ అధికారులకు ఫోన్ చేసిన ఆ యువకుడు తన కళ్లల్లో కారం చల్లిన నిందితులు తన మీద దాడి చేసి దగ్గర ఉన్న డబ్బులు లాక్కొని వెళ్లిపోయారని చెప్పాడు. సిటీలో నిత్యం రద్దీగా ఉండే ఫ్లేఓవర్ మీద ఈ దోపిడీ జరిగిందని తెలుసుకున్న పోలీసులు హడలిపోయారు. పోలీసుల విచారణలో కొన్ని గంటల తరువాత కారం పొడి కహాని అసలు మ్యాటర్ బయటకు రావడంతో అందరూ షాక్ అయ్యారు.

Pushpa: పుష్పా-3 సినిమా చూపించిన కిలాడీ పోలీసులు, ఎర్రచందనం ఏం చేశారు, అల్లు అర్జున్ కే పోటీనా!Pushpa: పుష్పా-3 సినిమా చూపించిన కిలాడీ పోలీసులు, ఎర్రచందనం ఏం చేశారు, అల్లు అర్జున్ కే పోటీనా!

బెంగళూరు జేపీ నగర్ లో !

బెంగళూరు జేపీ నగర్ లో !

బెంగళూరులోని జేపీ నగర్ 7వ స్టేజ్ లో అరుణ్ కుమార్ అలియాస్ అరుణ్ (29) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అరుణ్ కుమార్ తో పాటు అతని తల్లి నివాసం ఉంటున్నది. కొంతకాలం క్రితం వరకు వేరే కంపెనీలో ఉద్యోగం చేసిన అరుణ్ కుమార్ ఇటీవల అతను ప్రముఖ జ్యువెలరీస్ సంస్థ అట్టికా గోల్డ్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు.

నెల రోజుల్లోనే నమ్మకస్తుడు అయ్యాడు

నెల రోజుల్లోనే నమ్మకస్తుడు అయ్యాడు

బెంగళూరులోని క్వీన్స్ రోడ్డులో అట్టిగా మెయిన్ బ్రాంచ్ ఉంది. ఇక్కడే అరుణ్ కుమార్ ఉద్యోగం చేస్తున్నాడు. ప్రముఖ జ్యువెలరీ షోరూమ్ ల కంపెనీలో ఉద్యోగంలో చేరిన అరుణ్ కుమార్ ఆ కంపెనీ యాజమాన్యం, అధికారుల దగ్గర నెల రోజుల్లోనే మంచి పేరు, గుర్తింపుతో పాటు నమ్మకస్తుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

రూ. 8 లక్షలు డబ్బులు తీసుకుని వెళ్లాడు

రూ. 8 లక్షలు డబ్బులు తీసుకుని వెళ్లాడు

నెల రోజుల్లోనే అరుణ్ కుమార్ లక్షల రూపాయల డబ్బులు ఆ జ్యువెలరీ కంపెనీకి చెందిన బెంగళూరులోని బ్రాంచ్ ఆఫీసులకు తరలించడం మొదలు పెట్టాడు. ప్రతిరోజు ఉదయం క్వీన్స్ రోడ్డులోని హెడ్ ఆఫీసు నుంచి సిటీలోని ఆ జ్యువెలరీ షోరూమ్ లకు అరుణ్ కుమార్ డబ్బులు తరలిస్తుంటాడు. ఎప్పటిలాగే రూ. 8 లక్షలు డబ్బులు తీసుకుని బ్యాగ్ లో పెట్టుకున్న అరుణ్ కుమార్ మిగిలిన బ్రాంచ్ ఆఫీసులకు బయలుదేరాడు.

ఫ్లైఓవర్ మీద దోపిడి జరిగిందని పోలీసులకు ఫోన్

ఫ్లైఓవర్ మీద దోపిడి జరిగిందని పోలీసులకు ఫోన్


డబ్బులు తీసుకుని బయలుదేరిన రెండు గంటల తరువాత పోలీసులు, జ్యువెలరీ షోరూమ్ అధికారులకు ఫోన్ చేసిన అరుణ్ కుమార్ తన కళ్లల్లో కారం చల్లిన నిందితులు తన మీద దాడి చేసి తన దగ్గర ఉన్న రూ. 4 డబ్బులు లాక్కొని వెళ్లిపోయారని చెప్పాడు. సిటీలో నిత్యం రద్దీగా ఉండే మైసూరు రోడ్డులోని నాయండనహళ్ళిలో ఫ్లైఓవర్ మీద ఈ దోపిడీ జరిగిందని తెలుసుకున్న పోలీసులు హడలిపోయారు.

పక్కాస్కెచ్ వేసినా ?

పక్కాస్కెచ్ వేసినా ?

ఇన్స్ పెక్టర్ శంకర్ నాయక్ కు అరుణ్ కుమార్ మీద అనుమానం మొదలైయ్యింది. ఉదయం 10. 45 గంటలకు ఫ్లై ఓవర్ మీద నడుచుకుంటు వచ్చిన ఇద్దరు వ్యక్తులు తన కళ్లల్లో కారం చల్లి రూ. 4 లక్షలు లాక్కెళ్లారని అరుణ్ కుమార్ పోలీసులకు చెప్పాడు. ఎంతో ఎత్తులో ఉండే నాయండనహళ్ళి ఫ్లై ఓవర్ మీద నడుచుకుంటూ వెళ్లే అవకాశం లేదని పోలీసులకు అనుమానం వచ్చింది.

 మ్యాటర్ లీక్

మ్యాటర్ లీక్

ఫ్లైఓవర్ మీద నడుచుకుంటూ వెళ్లిన వాళ్లు డబ్బులు లాక్కొని అంత త్వరంగా తప్పించుకోవడం సాధ్యం కాదని, లూటీ జరిగిన గంట తరువాత అరుణ్ కుమార్ పోలీసు కంటోల్ రూమ్ కు ఫోన్ చేశాడని ఇన్స్ పెక్టర్ శంకర్ నాయక్ గుర్తించారు. అరుణ్ కుమార్ కు ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయిస్తే అసలు అతని కళ్లలో కారం పొడిపడలేదని వెలుగు చూసింది.

సోదరి పెళ్లితో ఆర్థిక సమస్యలు

సోదరి పెళ్లితో ఆర్థిక సమస్యలు

వెంటనే పోలీసులు అరుణ్ కుమార్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి ట్రీట్ మెంట్ ఇచ్చారు. ఆర్థిక సమస్యల కారణంగా అరుణ్ కుమార్ రూ. 4 లక్షలు అతనే దాచి పెట్టి దోపిడీ జరిగిందని నాటకాలు ఆడాడనని పోలీసులు గుర్తించారు. కొన్ని నెలల ముందు సోదరి వివాహం చేసిన అరుణ్ కుమార్ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని వెలుగు చూసింది.

ఇంట్లో రూ. 4 లక్షలు దాచిపెట్టాడు

ఇంట్లో రూ. 4 లక్షలు దాచిపెట్టాడు


బాపూజీ పార్క్ సమీపంలోని జ్యువెలరీ షోరూమ్ లో రూ. 4 లక్షలు ఇచ్చిన తరువాత నేరుగా జేపీ నగర్ లోని ఇంటికి వెళ్లి రూ. 4 లక్షలు దాచి పెట్టాడని, తరువాత దారి దోపిడీ జరిగిందని నాటకాలు ఆడాడని పోలీసులు గుర్తించారు. తన కళ్లల్లో ఎవ్వరూ కారం పొడి చల్లలేదని, తానే డ్రామా ఆడానని అరుణ్ కుమార్ అంగీకరించాడని పోలీసు అధికారులు అన్నారు. అరుణ్ కుమార్ ఇంట్లో ఉన్న రూ. 4 లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు అతన్ని విచారణ చేస్తున్నారు.

English summary
Khiladi: Young man arrested for created robbery drama in Bengaluru City.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X