హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Khiladi: రసికరాజా, సుఖం, డబ్బు, కోసం ఏం చేశాడంటే ?, జస్ట్ ఇంటర్నెట్ బిల్లు పెట్టుబడి, 200 మంది లేడీస్ !

|
Google Oneindia TeluguNews

లక్నో/ఉత్తరప్రదేశ్: అమాయకులైన అమ్మాయిలు ఎక్కడ చిక్కుతారా ? అంటూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో తెగవెతికేశాడు. మ్యాట్రీమోనీలో పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్న యువతులు, విడాకులు తీసుకున్న మహిళల వివరాలు అతని కంట్లోపడ్డాయి. అమ్మాయిలు, విడాకులు తీసుకున్న మహిళల వివరాలు పూర్తిగా, క్షుణ్ణంగా తెలుసుకున్న అతను వారిలో కన్నింగ్ ఎవరు, అమాయకులు ఎవరు ? అంటూ లిస్టు తయారు చేసుకుంటున్నాడు. తన మాయమాటలకు ఎవరెవరు పడుతారు, వీళ్లల్లో శ్రీమంతులు ఎవరు, మిడిల్ క్లాస్ వాళ్లు ఎవరు అంటూ లెక్కలు వేసుకున్నాడు. స్కెచ్ ప్రకారం అతని మ్యాట్రీమోనీ వెబ్ సైట్లలో మహిళలతో పరిచయం పెంచుకున్నాడు.

జ్యోతిష్యుడి దగ్గర అతనికి కావలసిన రీతిలో చూపించిన ఓ జాతకం మహిళల ముఖాన కొట్టి వారిని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అంతే అమాయకులను వలలో వేసుకుని నిత్య పెళ్లికొడుకులా అతని రెచ్చిపోయాడు. ఓ బాధితురాలు తనకు అన్యాయం జరిగిందని పోలీసులను ఆశ్రయించింది. మహిళను మోసం చేసి పెళ్లి చేసుకుని జెండా ఎత్తేసిన కేటుగాడిని పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల విచారణలో నిత్య పెళ్లి కొడుకు ఒకరు ఇద్దరు కాదని ఏకంగా 200 మంది అమాయకులైన యువతులు, మహిళలకు కుచ్చుటోపీ పెట్టాడని వెలుగు చూడటం కలకలం రేపింది.

Actor: ఫ్రెండ్ తల నరికి ఎత్తుకెళ్లిన నటుడు, స్క్రీన్ మీద విలన్, నిజ జీవితంలో ?, అదే డౌట్, క్లైమాక్స్ లో !Actor: ఫ్రెండ్ తల నరికి ఎత్తుకెళ్లిన నటుడు, స్క్రీన్ మీద విలన్, నిజ జీవితంలో ?, అదే డౌట్, క్లైమాక్స్ లో !

 సుఖంగా డబ్బు సంపాధించడం ఎలా ?

సుఖంగా డబ్బు సంపాధించడం ఎలా ?

ఉత్తరప్రదేశ్ లోని ఘాజియాబాద్ లో తరుణ్ కుమార్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. చూడటానికి కొంచెం అందంగా ఉంటున్న తరుణ్ కుమార్ త్వరగా శ్రీమంతుడు అయిపోవాలని అనుకున్నాడు. కష్టపడి పని చెయ్యకుండా సుఖంగా డబ్బు సంపాధించాలని, అమ్మాయిలతో ఎంజాయ్ చెయ్యాలని స్కెచ్ వేశాడు.

 మ్యాట్రీమోనీ స్కెచ్

మ్యాట్రీమోనీ స్కెచ్

అమాయకులైన అమ్మాయిలు ఎక్కడ చిక్కుతారా ?, అంటూ తరుణ్ కుమార్ సోషల్ మీడియాలో తెగవెతికేశాడు. మ్యాట్రీమోనీలో పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్న యువతులు, విడాకులు తీసుకున్న మహిళల వివరాలు తరుణ్ కుమార్ కంట్లోపడ్డాయి. చాలాకాలం గూగుల్ లో మ్యాట్రీమోనీ వెబసైట్లు మొత్తం వెతికేశాడు.

 శ్రీమంతులు, మిడిల్ క్లాస్ వాళ్లు ఎవరు ?

శ్రీమంతులు, మిడిల్ క్లాస్ వాళ్లు ఎవరు ?

అమ్మాయిలు, ఇప్పటికే భర్తలతో విడాకులు తీసుకున్న మహిళల వివరాలు పూర్తిగా, క్షుణ్ణంగా తెలుసుకున్నతరుణ్ కుమార్ వారిలో కన్నింగ్ ఎవరు, అమాయకులు ఎవరు ? అంటూ ఓ లిస్టు తయారు చేసుకుంటున్నాడు. తన మాయమాటలకు ఎవరెవరు పడుతారు, వీళ్లల్లో శ్రీమంతులు ఎవరు, మిడిల్ క్లాస్ వాళ్లు ఎవరు అంటూ తరుణ్ కుమార్ పక్కా లెక్కలు వేసుకున్నాడు.

 పరిచయం చేసుకుని జాతకం ముఖాన కొడుతున్నాడు

పరిచయం చేసుకుని జాతకం ముఖాన కొడుతున్నాడు

తరుణ్ కుమార్ అతని స్కెచ్ ప్రకారం మ్యాట్రీమోనీ వెబ్ సైట్లలో పెళ్లికాని అమ్మాయిలు, విడాకులు తీసుకున్న మహిళలతో పరిచయం పెంచుకున్నాడు. జ్యోతిష్యుడి దగ్గర తరుణ్ కుమార్ కు అనుకూలంగా చూపించిన జాతకాలను మహిళల ముఖాన కొట్టి వారిని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి వాళ్లను నమ్మించాడు.

 చిక్కినకాడికి చిక్కినంత దోచుకో

చిక్కినకాడికి చిక్కినంత దోచుకో

అమాయకులను వలలో వేసుకుని నిత్య పెళ్లికొడుకులా తరుణ్ కుమార్ రెచ్చిపోయాడు, అమాయకులను పెళ్లి చేసుకున్న తరువాత కొంతకాలం వారితో కాపురం చేసి వారి దగ్గర ఉన్న బంగారు నగలు, నగదు లాక్కొని వెళ్లిపోతున్నాడు. పెళ్లి చేసుకున్న మహిళలను తరుణ్ కుమార్ కు ఫోన్ చేస్తే అతని ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం వచ్చింది.

చచ్చిపోయాడని కొందరు వదిలేశారు

చచ్చిపోయాడని కొందరు వదిలేశారు

కొంతకాలం వేచి చూసిన బాదితులు తరుణ్ కుమార్ చనిపోయాడని కొందరు, మోసం చేసి వెళ్లిపోయాడని కొందరు పోలీసులకు ఫిర్యాదు చెయ్యకుండా సైలెంట్ గా ఉండిపోయారు. తన మీద ఎక్కడా కేసులు నమోదు కాలేదని తెలుసుకుంటున్న తరుణ్ కుమార్ తనను ఎవ్వరూ పట్టుకోలేరని రానురాను ఇంకా రెచ్చిపోయాడు.

 బాధితుల లిస్టులో 200 మంది అమాయకులు

బాధితుల లిస్టులో 200 మంది అమాయకులు

ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ బాధితురాలు తనకు తరుణ్ కుమార్ అన్యాయం చేశాడని పోలీసులను ఆశ్రయించింది. మహిళను మోసం చేసి పెళ్లి చేసుకుని జెండా ఎత్తేసిన ఘాజియాబాద్ కు చెందిన కేటుగాడు తరుణ్ కుమార్ ను పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల విచారణలో నిత్య పెళ్లి కొడుకు తరుణ్ కుమార్ ఒకరు ఇద్దరు కాదని ఏకంగా 200 మంది అమాయకులైన యువతులు, మహిళలకు కుచ్చుటోపీ పెట్టాడని వెలుగు చూడటం కలకలం రేపింది.

 దేశం మొత్తం తిరిగేస్తున్నాడు

దేశం మొత్తం తిరిగేస్తున్నాడు

తరుణ్ కుమార్ మోసాల చిట్టాను విప్పుతున్నామని, తరుణ్ కుమార్ ఉత్తరప్రదేశ్ తో పాటు హైదరాబాద్ తో సహ అనేక రాస్ట్రాల్లో ఇలాగే మోసం చేశాడని వెలుగు చూసిందని. త్వరలో మీడియాకు వివరాలు చెబుతామని ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

English summary
Khiladi: Young man arrested for fraud 200 women in Uttar Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X