తాళితో రుద్రాక్ష వివాదం: నటి ఖుష్పూకు కోర్టు ఊరట

చెన్నై: వివాదాలలో చిక్కకోవడంలో బహుబాష నటి, కాంగ్రెస్ నాయకురాలు ఖుష్బు ముందు వరసలో ఉంటారు. అదే విధంగా గతంలో హిందూ సాంప్రదాయాలకు విరుద్దంగా మాట్లాడి కష్టాలు తెచ్చకున్నారు. హిందువులు, శివ భక్తులు పవిత్రంగా చూసుకునే రుద్రాక్షను మంగళసూత్రంలో వేసుకుని ఒక వార్త పత్రికకు ఫోజు ఇచ్చి న్యాయస్థానంలో విచారణ ఎదుర్కోన్నారు. ఆమె టైం బాగుంది. కోర్టులో ఆమెకు ఊరట లభించింది.

మంగళవారం తమిళనాడులోని కుంభకోణంలోని రెండవ అదనపు న్యాయస్థానంలో పిటిషన్ విచారణ జరిగింది. న్యాయమూర్తి శరవణభవన్ విచారణ చేశారు. ఇదే సమయంలో న్యాయస్థాన్నాన్ని ఆశ్రయించిన (కుంబకోణం సమీపంలోని ఉమామహేశ్వరపురం సారంగిపాణి పేట నివాసి) బాలు హాజరైనారు. ఈ సందర్బంలో బాలు చేసిన ఆరోపణలను ఆయన న్యాయవాది న్యాయస్థానం ముందు పెట్టారు. హిందువులు శివుడిని భక్తి శ్రధ్దలతో ఆరాదిస్తారు. నిత్యం శివ జపం చేస్తు రుద్రాక్షలకు పూజలు చేస్తారని, శివుడి దేవాలయాలలోని గర్బగుడిలో రుద్రాక్షలు పెట్టి పూజలు చేస్తారని, అలాంటి వారు రుద్రాక్షలు దరిస్తారని అన్నారు.

Khushboo relieved from the controversy

నిత్యం పవిత్రంగా ఉండే వారు రుద్రాక్ష్లలు ధరించాలని వేదాలు చెబుతున్నాయి. అయితే నటి ఖుష్బు తన మంగళసూత్రంలో రుద్రాక్షను(మూడు ముఖాలు) పెట్టుకుని పత్రికలకు ఫోజులు ఇస్తు హిందూ సంప్రదాయాన్ని మంట కలిపిందని బాలు ఆరోపిస్తున్నారని ఆయన న్యాయవాది న్యాయస్థానం ముందు చెప్పారు. కుష్బు తరుపు న్యాయవాది మాట్లాడుతూ ఆమె ఎలాంటి తప్పు చెయ్యాలేదని, రుద్రాక్ష ధరించిందని ఎలాంటి ఆధారాలు లేవని న్యాయమూర్తికి చెప్పారు. బాలు న్యాయవాది ఖుష్బు రుద్రాక్ష వేసుకుని ఫోటోకు ఫోజు ఇచ్చిన వార పత్రికను న్యాయమూర్తికి అందించారు. ఈ సందర్బంలో న్యాయమూర్తి శరభవన్ పిటిషన్ వేసిన బాలుకు పలు ప్రశ్నలు వేశారు. కుష్బు మంగళసూత్రంలో రుద్రాక్ష వేసుకున్నారని మీరు ప్రతక్షంగా చూశారా, అది అసలు రుద్రాక్షేనా అంటు పలు ప్రశ్నలు సంధించారు.

బాలు సరైన సమాదానం ఇవ్వకపోవడంతో ఒక వార్త పత్రికలో వచ్చిన ఫోటోని పట్టుకుని న్యాయస్థానంలో పిటిషన్ వెయ్యరాదని మందలించిన న్యాయమూర్తి పిటిషన్ కొట్టి వేశారు. తమిళ సినిమా రంగంలో గతంలో ఒక వెలుగు వెలిగిన నటి కుష్బుకు ఆమె అభిమానులు అప్పట్లో దేవాలయాలు నిర్మించి నిత్యం పూజలు చేసి ఆరాదించారు.

అయితే ఖుష్బు నిత్యం హిందూ సాంప్రదాయాలను కించపరిచి మాట్లాడటంతో అభిమానులు మండిపోయారు. దేవాలయాలు ద్వంసం చేశారు. పెళ్లి కాని అమ్మాయిలు డేటింగ్ చేస్తే తప్పలేదని మీడియా ముందు మాట్లాడటం, దేవాలయంలోకి చెప్పలు వేసుకుని వెళ్లడం తదితర వివాదాలలో చిక్కుకున్న కుష్బు మీద తమిళులు మండిపతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+