Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Kiladi aunty: ముసలాడిని పెళ్లి చేసుకుంటే ఆ కిక్కే వేరప్ప, రాత్రి స్వర్గం చూపించి క్లేమాక్స్ లో మేడమ్ ?

భార్యకు విడాకులు ఇచ్చి కుమారుడితో కలిసి నివాసం ఉంటున్న వ్యక్తి రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యతో కొన్ని రోజులు హ్యాపీగా ఉన్నాడు. రెండో మొగుడు పసలేనోడు అయితే ఆ కిక్కేవేరప్ప అంటూ రెండో భార్య చేతివాటం చూపించింది.

బెంగళూరు: వయసులో ఉన్న యువతి, యువకుడు పెళ్లి చేసుకుని సంసారం చెయ్యడం సర్వసాధారణం. వివాహం చేసుకున్న తరువాత దంపతుల మద్య గొడవలు రావడం, విడిపోవడం ప్రతిరోజు జరుగుతున్నాయి. విడాకులు తీసుకున్న తరువాత మహిళ కాని, భర్త కాని, రెండో పెళ్లి చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఇక్కడ భలే గమ్మత్తు అయిన విషయం వెలుగు చూసింది. భార్యకు విడాకులు ఇచ్చి కుమారుడితో కలిసి నివాసం ఉంటున్న వ్యక్తి రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యతో కొన్ని రోజులు హ్యాపీగా ఉన్నాడు. రెండో మొగుడు పసలేనోడు అయితే ఆ కిక్కేవేరప్ప అంటూ రెండో భార్య చేతివాటం చూపించింది. దెబ్బకు ముసలోడికి త్రీడి సినిమా కనపడింది.

భార్యతో హ్యాపీ

భార్యతో హ్యాపీ

బెంగళూరు సిటీలోని కాటన్ పేట పోలీస్ స్టేషన్ రోడ్డులోని ఓటీసీ రోడ్డులో షణ్మగం (62) వ్యక్త నివాసం ఉంటున్నాడు. 20 ఏళ్ల క్రితం షణ్ముగంకు వివాహం అయ్యింది. వివాహం చేసుకున్న తరువాత షణ్ముగం అతని భార్యతో చాలా సంతోషంగా ఉన్నాడు. షణ్ముగం కూడా తమిళనాడుకు చెందిన వాడు అయినా బెంగళూరుకు వచ్చి ఇక్కడే స్థిరపడ్డాడు. షణ్ముగం మెజస్టిక్ సమీపంలో సొంతంగా మెకానిక్ షాపు నిర్వహిస్తున్నాడు.

విడాకులు తీసుకున్న దంపతులు

విడాకులు తీసుకున్న దంపతులు

షణ్ముగం దంపతులకు 10 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. భార్య తీరుతో విసిగిపోయిన షణ్ముగం అతని భార్యతో గొడవలు పడ్డాడు. భార్య అక్రమ సంబంధం పెట్టుకుని ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ తనకు మోసం చేస్తోందని అనుకున్న షణ్ముగం అతని భార్యతో విడిపోవాలని డిసైడ్ అయ్యాడు, అనుకున్నట్లుగానే భార్యకు విడాకులు ఇచ్చిన షణ్ముగం అతని 10 ఏళ్ల కుమారుడితో వేరుగా నివాసం ఉంటున్నాడు.

బ్రోకర్ తో రెండో పెళ్లికి మంతనాలు

బ్రోకర్ తో రెండో పెళ్లికి మంతనాలు

కుటుంబ కలహాల కారణంగా మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన షణ్ముగం తన పదేళ్ల కొడుకుతో కలిసి అదే ఏరియాలో చాలా కాలం నుంచి నివాసం ఉంటున్నాడు. మెకానిక్‌గా జీవనం సాగిస్తున్న షణ్ముగం రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తరువాత తమిళనాడులోని సేలంలో తనకు పరిచయమైన మునియమ్మ అలియాస్ మణియమ్మ అనే బ్రోకర్‌ను షణ్ముగం సంప్రదించాడు. తనకు మంచి మహిళతో పెళ్లి చెయ్యాలని షణ్ముగం మణియమ్మకు చెప్పాడు.

ఇంట్లోనే రెండో పెళ్లి

ఇంట్లోనే రెండో పెళ్లి

కొద్దిరోజుల తరువాత తమిళనాడులోని దిండిగల్‌లో ఓ అమ్మాయి ఉందని మునియమ్మ షణ్ముగంకు చెప్పింది. ఇదే నెల జనవరి 4వ తేదీన మల్లిక అలియాస్ మల్లీకా మేడమ్ తో పాటు మరో ఇద్దరు వ్యక్తులను బెంగళూరుకు తీసుకొచ్చిన మునియమ్మ పెళ్లి కోసం ఆరాటపడుతున్న షణ్ముగం ఇంటికి పిలుచుకుని వెళ్లింది. మల్లికును పెళ్లి చేసుకోవడానికి షణ్ముగం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. షణ్ముగం ఇంట్లోనే కొందరి సమక్షంలో మల్లికతో అతని పెళ్లి జరిగిపోయింది. అదే రోజు రాత్రి మునియమ్మ, ఆమె సహచరులు రూ.35 వేలు షణ్ముగం నుంచి కమీషన్ డబ్బులు తీసుకుని తమిళనాడు వెళ్లిపోయారు.

రెండో మొగుడు ముసలోడు అయితే ఆ కిక్కే వేరప్ప...హా...హా...హా !

రెండో మొగుడు ముసలోడు అయితే ఆ కిక్కే వేరప్ప...హా...హా...హా !

కొద్ది రోజులు మసలి మొగుడు షణ్ముగంకు మల్లికా స్వర్గం చూపించింది. భర్త షణ్ముగంకు ఎలా కావాలంటే అలా రొమాన్స్ చేసిన మల్లిక మసలోడి దగ్గర చాలా నమ్మకం సంపాధించింది. తాను చెయ్యలేని పని తన భార్య చేసి తనకు స్వర్గం చూపిస్తోందని షణ్ముగం మురిసిపోయాడు. జనవరి 10వ తేదీ షణ్ముగం మెకానిక్ షెడ్ కు వెళ్లాడు. అదే రోజు మధ్యాహ్నం లక్ష్లల రూపాయల విలువైన బంగారు నగలు. 700 గ్రాముల వెండి వస్తువులతో మల్లికా పరారైయ్యింది.

నీకు అవసరమా రా ?

నీకు అవసరమా రా ?

రాత్రి ఇంటికి వెళ్లిన షణ్ముగం రెండో భార్య కనిపించకపోవడంతో ఆందోళన చెందాడు. రెండో భార్య మల్లికా కోసం అన్ని చోట్ల వెతికినా ఆమె కనపడలేదు. పెళ్లి చేసిన బ్రోకర్ మునియమ్మకు ఫోన్ చేసి విచారించగా ఆమె పదేపదే ఫోన్ కట్ చేస్తూ నాకు సంబంధం లేదని చెప్పింది. ఇన్ని రోజుల పాటు షణ్ముగం అతని రోండో భార్య మల్లికా కోసం గాలించి చివరికి విసిగిపోయాడు.

మేడమ్ కు అక్రమ సంబంధం

మేడమ్ కు అక్రమ సంబంధం

చివరికి తాను మోసపోయామని గుర్తించి బెంగళూరులో కాటన్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడని పోలీసు అధికారులు తెలిపారు. ఈ వయసులో నువ్వు రెండో పెళ్లి చేసుకుని ఏం ఉద్దరిద్దామని అనుకున్నావని పోలీసులు బాధితుడు షణ్ముగం మీద జాలి చూపిస్తున్నారని తెలిసింది. మల్లిక ఆంటీకి అక్రమ సంబంధం ఉందని, ముసలోడితో పెళ్లి చేసుకుని అతని ఇంటిలో బంగారు నగలు లూటీ చేసి ప్రియుడితో లేచిపోయిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+