మిడ్ నైట్ స్కెచ్, లాయర్ ను కిడ్నాప్ చేసి ఏం చేశారంటే ?
బెంగళూరు: ఎవరు ఎవరితో గొడవలు పడుతారో, ఎవరిని ఎవరు హత్య చేస్తారో చెప్పడం చాలా కష్టం. ఎలాంటి కేసులు అయినా లాయర్ దగ్గరకు వెళ్లి సమస్యలు పరిష్కరించుకుంటారు. ఇటీవల అడ్రస్ చెప్పమంటూ ఓ న్యాయవాదిని ఆటోలో ఎక్కించుకుని బెదిరించి మొబైల్ ఫోన్, పర్సు, డబ్బు లాక్కున్న ఇద్దరు దోపిడీ దొంగలను బెంగళూరులోని గిరినగర్ పోలీస్‌స్టేషన్ పోలీసులు అరెస్టు చేశారు.
గిరినగర్ లో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ యశ్వంత్ (23), నందీష్ (24)లను అరెస్టు చేశారు. జూన్ 19న తెల్లవారుజామున 2 గంటలకు బనశంకరి రింగ్‌రోడ్డులోని పీఈఎస్ కళాశాల నుంచి నాగేంద్ర బ్లాక్‌కు నడుచుకుంటూ వెళ్తున్న లాయర్ అశోక్ ను ఆటోలో వెళ్లిన ఐదుగురు దుండగులు అతన్ని కిడ్నాప్ చేశారు. తరువాత లాయర్ అశోక్ ను బెదిరించి ఆయన జోబులో ఉన్న రూ. 20 వేలు లాక్కొన్నారు.

ఈ విషయమై లాయర్ అశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలంలో, చుట్టుపక్కల భవనాల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా ఆటో క్లూ లభించింది. ఈ ఆటో రిజిస్ట్రేషన్ నంబర్‌ను గుర్తించిన తరువాత, ఆటో డ్రైవర్ యశ్వంత్‌ను పోలీసులు మొదట అదుపులోకి తీసుకున్నారు. అయినా మిగిలిన నిందితుల గురించి ఏమాత్రం తెలీలేదు.
అనంతరం నిందితుడు నందీష్‌ను అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు. నాగేంద్ర బ్లాక్‌కు చెందిన అడ్వకేట్ అశోక్ హాసన్‌లోని శాంతిగ్రామ్‌కు వెళ్లారు. జూన్ 19వ తేదీ తెల్లవారుజామున బెంగళూరు నగరానికి తిరిగి వచ్చిన అతను మెజెస్టిక్ బస్టాండ్ నుంచి రింగ్ రోడ్డులోని పీఈఎస్ కాలేజీకి వాహనంలో దిగి ఇంటికి నడుచుకుంటూ బయలుదేరాడు.

ఇంతలో ఐదుగురు అగంతకులు ఆటోరిక్షాలో వచ్చి నిందితులు లాయర్ అశోక్‌తో మాట్లాడి అడ్రస్ అడిగారు.
అనంతరం నైస్ రోడ్డు మీదుగా కనకపుర రోడ్డుకు తీసుకెళ్లి బెదిరించి మొబైల్ ఫోన్, పర్సులో ఉన్న రూ. 200 లాక్కొన్నారు. అనంతరం అశోక్ అతని స్నేహితుడికి ఫోన్ చేసి యూపీఐ ద్వారా ఖాతాలో రూ. 20వేలు జమ చేశాడు. అనంతరం ఏటీఎం సెంటర్‌కు తీసుకెళ్లి డబ్బులు డ్రా చేశారు.
అనంతరం కనకపుర రోడ్డులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమం దగ్గర లాయర్ అశోక్ ను వదిలిన నిందితులు పారిపోయారని పోలీసులు అన్నారు. లాయర్ నే కిడ్నాప్ చేసి నిలువు దోపిడీ చేసిన నిందితులను అరెస్టు చెయ్యడం బెంగళూరులో హాట్ టాపిక్ అయ్యింది. లాయర్ ను కిడ్నాప్ చేసిన 12 రోజుల తరువాత నిందితులు పోలీసులకు చిక్కారు. మొత్తం మీద లాయర్ ను కిడ్నాప్ చేసిన ఆటో డ్రైవర్ గ్యాంగ్ ఇంతకు ముందు ఇలాంటి అరాచకాలు ఎన్ని చేశారు అని పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications