Killer: భార్య, మరదలిని ఒకేసారి స్పాట్ లో చంపేశాడు. అక్క కోసం వెళ్లింది, అంతే, డౌట్, క్లైమాక్స్ లో !

భువనేశ్వర్/ఒడిశా: కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు కాపురం చేస్తున్నారు. దంపతులకు ఇంకా పిల్లలు పుట్టలేదు. భార్యకు సొంత చెల్లెలు ఉంది. అక్క, బావ ఉంటున్న సిటీలోనే ఫేమస్ ప్రైవేట్ ఆసుపత్రిలో మరదలు నర్సుగా ఉద్యోగం చేస్తున్నది. ఒకే సిటీలో ఉంటున్న అక్క ఇంటికి ఆమె చెల్లెలు వెళ్లి వస్తోంది. ఇదే సమయంలో మరదలితో బావ చనువుగా ఉండటం మొదలుపెట్టాడని తెలిసింది. ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న మరదలు ఆసుపత్రి హాస్టల్ లోనే ఉంటున్నది. అయితే వారంలో రెండు రోజులు అక్క ఇంటికి వెలుతోంది. మూడు రోజుల క్రితం అక్క ఇంటికి వెళ్లిన చెల్లెలు అక్కడే ఉంది. అక్కా, చెల్లి నుంచి మూడు రోజుల అయినా వాళ్లు ఎవ్వరికీ ఫోన్లు రాలేదు. ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న కూతురికి ఆమె తల్లిదండ్రులు ఫోన్లు చేసినా ఆమె రిసీవ్ చెయ్యలేదు. చిన్న కూతురు ఫోన్ తియ్యడం లేదని ఆందోళన చెందిన తల్లిదండ్రులు అదే సిటీలో భర్తతో కలిసి ఉంటున్న పెద్ద కూతురికి ఫోన్ చేశారు. మూడు రోజుల నుంచి అక్కా, చెల్లికి ఫోన్లు చేసినా ఎవ్వరూ ఫోన్ రిసీవ్ చెయ్యలేదు. తల్లికి అనుమానం వచ్చి ఆమె బంధువులతో కలిసి పెద్ద కూతురు నివాసం ఉంటున్న ఇంటి దగ్గరకు వెళ్లారు. ఇంటి బయట తాళం వేసి ఉండటంతో పెద్ద కూతురు, అల్లుడు ఎక్కడికో వెళ్లి ఉంటారని, వచ్చే వరకు వేచి చూద్దామని అక్కడే ఉన్నారు. ఆ సమయంలో ఇంటి దగ్గరకు వెళ్లిన అల్లుడు అత్తను చూసి పారిపోవడానికి ప్రయత్నించాడు అత్తా, ఆమె బంధువులు వెంబడించి అల్లుడిని పట్టుకుని చితకబాది ఏం జరిగింది అని విచారణ చేస్తే భార్య, మరదలిని చంపేశానని అతను సమాధానం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు హడలిపోయారు.

 భార్యతో కాపురం చేస్తున్న అక్క

భార్యతో కాపురం చేస్తున్న అక్క

ఒడిశాలోని భువనేశ్వర్ నగరంలోని చంద్రశేఖర్ పూర్ ఆసుపత్రి సమీపంలోని చంద్రశేఖర్ పూర్ హౌసింగ్ బోర్డు క్వాటర్స్ లో బిజయ్ సేథి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఓ ప్రముఖ విద్యాసంస్థలో ఉద్యోగం చేస్తున్న విజయ్ సేథీ కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు సెట్ చేసిన గాయిత్రీ అనే మహిళను వివాహం చేసుకున్నాడు.

 చెల్లెలు అదే సిటీలో ఉద్యోగం

చెల్లెలు అదే సిటీలో ఉద్యోగం

గాయిత్రీకి సరస్వతి అనే చెల్లెలు ఉంది. భువనేశ్వర్ లోని ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో సరస్వతి నర్సుగా ఉద్యోగం చేస్తున్నది. అక్క గాయిత్రీ, బావ బిజయ్ సేథీ నివాసం ఉంటున్న భువనేశ్వర్ లోనే ఫేమస్ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగం చేస్తున్న సరస్వతి హ్యాపీగానే ఉంటున్నది. భువనేశ్వర్ లోనే ఉంటున్న అక్క గాయిత్రీ ఇంటికి ఆమె చెల్లెలు సరస్వతి వెళ్లి వస్తోంది.

 మూడు రోజుల క్రితం మరదలు ?

మూడు రోజుల క్రితం మరదలు ?

ఇదే సమయంలో మరదలు సరస్వతితో ఆమె బావ బిజయ్ సేథీ చనువుగా ఉండటం మొదలుపెట్టాడని తెలిసింది. ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న సరస్వతి ఆసుపత్రి హాస్టల్ లోనే ఉంటున్నది. ఆసుపత్రి హాస్టల్ లో ఉంటున్న సరస్వతి వారంలో రెండు రోజులు అక్క గాయిత్రీ ఇంటికి వెలుతోంది. మూడు రోజుల క్రితం అక్క గాయిత్రీ ఇంటికి వెళ్లిన ఆమె చెల్లెలు సరస్వతి అక్కడే ఉంది.

అక్కా, చెల్లెలు ఫోన్లు రిసీవ్ చెయ్యకపోవడంతో డౌట్

అక్కా, చెల్లెలు ఫోన్లు రిసీవ్ చెయ్యకపోవడంతో డౌట్


సరస్వతికి ఆమె తల్లి ఫోన్ చేసినా ఆమె ఫోన్ రిసీవ్ చెయ్యలేదు. తల్లికి అనుమానం వచ్చి పెద్దకూతురు గాయిత్రీకి ఫోన్ చేసింది. పెద్ద కూతురు గాయిత్రీ, చిన్న కూతురు సరస్వతి ఫోన్లు రిసీవ్ చెయ్యకపోవడంతో అల్లు బిజయ్ సేథీకి ఫోన్ చేశారు. ముగ్గురు ఫోన్లు రిసీవ్ చెయ్యకపోవడంతో గాయిత్రీ, సరస్వతిల తల్లికి అనుమానం వచ్చి ఆమె బంధువులతో కలిసి పెద్ద కూతురు గాయిత్రీ ఇంటి నివాసం ఉంటున్న ఇంటి దగ్గరకు వెళ్లారు. ఇంటి బయట తాళం వేసి ఉండటంతో పెద్ద కూతురు గాయిత్రీ, అల్లుడు బిజేస్ సేథీ ఎక్కడికో వెళ్లి ఉంటారని, వాళ్లు వచ్చే వరకు వేచి చూద్దామని అక్కడే ఉన్నారు.

భార్య, మరదలిని ఒకేసారి చంపేశాడు

భార్య, మరదలిని ఒకేసారి చంపేశాడు

ఆ సమయంలో ఇంటి దగ్గరకు వెళ్లిన బిజయ్ సేథీ అతని అత్తను చూసి పారిపోవడానికి ప్రయత్నించాడు. గాయిత్రీ తల్లి, ఆమె బంధువులు వెంబడించి అల్లుడు బిజయ్ సేథీని పట్టుకుని చితకబాది ఏం జరిగింది అని విచారణ చేశారు. ఆ సమయంలో తన భార్య గాయిత్రీ, మరదలు సరస్వతిని కొట్టి చంపేశానని బిజయ్ సేథీ సమాధానం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు హడలిపోయారు.

అక్కా చెల్లిని ఎందుకు చంపేశాడు ?

అక్కా చెల్లిని ఎందుకు చంపేశాడు ?


అయితే భార్య గాయిత్రీ, సరస్వతిని ఎందుకు హత్య చేశాను అనే విషయంలో బిజయ్ సేథీ పక్కా క్లారిటీ ఇవ్వడం లేదని అతన్ని విచారణ చేస్తున్నామని భువనేశ్వర్ పోలీసు అధికారులు తెలిపారు. మొత్తం మీద భార్య గాయిత్రీ, మరదలు సరస్వతిని చంపేసిన బిజయ్ సేథీ పారిపోయి తరువాత ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులు, డబ్బు తీసుకోవడానికి వచ్చి అత్త కుటుంబ సభ్యులకు చిక్కిపోయాడని కేసు విచారణ చేస్తున్న కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+