కిరణ్ ఫ్లెక్సీ ధ్వంసం: నిన్ను ఫాలో అవుతుంటా..ప్లీజ్: కిరణ్ బేడీకి కేజ్రీ
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారిణి, ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ పైన కమలం పార్టీలో వ్యతిరేకత ఉన్నట్లుగా కనిపిస్తోంది. పార్టీ ఎంపీ మనోజ్ తివారీ సోమవారం తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. బీజేపీ ఢిల్లీ కార్యాలయం ఎదుట ఉన్న కిరణ్ బేడీ ప్లెక్సీని ధ్వంసం చేశారు.
ఆమె పేరును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన కాసేపటికే దీనిని కొంతమంది ధ్వంసం చేశారు. హోర్డింగ్ పైన ఉన్న కిరణ్ బేడీ, పార్టీ ఢిల్లీ అధ్యక్షులు సతీష్ ఉపాధ్యాయ ముఖాలు పూర్తిగా కత్తిరించారు. ఇదే హోర్డింగ్ పైన ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఫోటోలు మాత్రం అలాగే ఉన్నాయి.

కిరణ్ బేడీ 15న బీజేపీలో చేరారు. ఈ హోర్డింగ్‌ను 14వ తేదీన ఏర్పాటు చేశారు. ఎంపీ మనోజ్ తివారి, ముఖ్యమంత్రి పీఠం ఆశిస్తున్న సీనియర్ నేత జగదీశ్ ముఖి తదితరులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, అసంతృప్తి పైన కిరణ్ బేడీ మాట్లాడుతూ.. తాను మనోజ్ తివారి దగ్గరకు వెళ్లి తనతో కలిసి టీ తాగి వస్తానని, ఇక్కడ బేషజాలు ఏమీ లేవని, ఢిల్లీని ప్రశాంతంగా ఉంచడమే ఉన్నత లక్ష్యమన్నారు. అందుకు మేమంతా పని చేస్తున్నామన్నారు.
కేజ్రీవాల్, కిరణ్ బేడీ ట్విట్టర్ రగడ!
బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ తన ట్విట్టర్ అకౌంటులో కేజ్రీవాల్‌ను బ్లాక్ చేశారు. దీంతో ఆయన తాను మీ ట్విట్టర్ ఖాతాను నేను ఫాలో అవుతుంటానని, మీర్ బ్లాక్ చేశారని, దయచేసి అన్ బ్లాక్ చేయాలని ట్వీట్ చేశారు. అయితే, కిరణ్ బేడీ మాత్రం అన్ బ్లాక్ చేయడానికి ఇష్టపడటం లేదట. అంతకుముందు కిరణ్ బేడీకి కేజ్రీవాల్ శుభాకాంక్షలు తెలిపారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థి అయినందుకు ఆయన కంగ్రాట్స్ చెప్పారు. అనంతరం చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. మరోవైపు, కేజ్రీవాల్ మంగళవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. భారీ ఎత్తున ర్యాలీతో వెళ్లి ఆయన ర్యాలీ తీశారు. వాల్మికీ సదన్ నుండి భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేశారు.












Click it and Unblock the Notifications