వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయ వెనుక శశికళ: కొడనాడు ఎస్టేట్‌పై షాకింగ్ ట్విస్ట్, చెన్నారెడ్డి చేతులెత్తేశారు!

దివంగత జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ గురించి ఓ ఆసక్తికర విషయం అంటూ మీడియాలో ఓ కథనం వచ్చింది.

|
Google Oneindia TeluguNews

చెన్నై/హైదరాబాద్: దివంగత జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ గురించి ఓ ఆసక్తికర విషయం అంటూ మీడియాలో ఓ కథనం వచ్చింది. ఇరవై అయిదేళ్ల క్రితం ఈ ఎస్టేట్ కావాలని జయ, శశికళ కోరుకుంటే మర్రి చెన్నారెడ్డి కూడా ఏం చేయలేకపోయారని తెలుస్తోంది.

<strong>విదేశీయుల ఎస్టేట్ రూ. 7 కోట్లకు తీసుకున్న జయలలిత: హత్య, శశికళ చేతిలో! </strong>విదేశీయుల ఎస్టేట్ రూ. 7 కోట్లకు తీసుకున్న జయలలిత: హత్య, శశికళ చేతిలో!

దీనిని ది వీక్ జర్నలిస్ట్ లక్ష్మీ సుబ్రహ్మణ్యన్‌కు పీటర్ కారల్ ఎడ్వర్డ్ క్రెగ్ జోన్స్ చెప్పిన విషయం. కొడనాడు ఎస్టేట్‌ను జయ, శశికళలు బలవంతంగా లాక్కున్నారని పీటర్ ఆరోపించారు. మీడియాలో వస్తున్న కథనం ప్రకారం...

<strong>జయ ఎస్టేట్ గార్డ్ హత్య: వారికి కొడనాడ్ కొట్టినపిండి, అనుమానాలు </strong>జయ ఎస్టేట్ గార్డ్ హత్య: వారికి కొడనాడ్ కొట్టినపిండి, అనుమానాలు

పీటర్‌ది లండన్. ఆయన తండ్రి విలియమ్ జోన్స్ 1975లో కొడనాడులో 906 ఎకరాల భూమి కొన్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు కొడనాడు టీ ఎస్టేట్స్‌గా మారింది.

జయలలిత ముఖ్యమంత్రి అయ్యాక..

జయలలిత ముఖ్యమంత్రి అయ్యాక..

1991లో జయలలిత ముఖ్యమంత్రి అయిన తర్వాత.. యజమానులకు సమాచారం వచ్చింది. టీ ఎస్టేట్ జయకు నచ్చిందని, అది ఆమెకు అమ్మాలని చెప్పారు. అయిదుసార్లు భేటీ అయినప్పటికీ ధర వద్ద కుదరలేదు. 1994లో ఆమె 7.6 కోట్ల ధర చెప్పారు.

150 మంది గూండాలతో వచ్చి..

150 మంది గూండాలతో వచ్చి..

150 మంది గూండాలతో వచ్చారని, నంబరు ప్లేటు కవర్ చేసి ఉందని, వేధించారని, తన తండ్రికి నాటి గవర్నర్ మర్రి చెన్నారెడ్డితో కొంచెం పరిచయం ఉందని, ఫోన్ చేసి సాయం కోరాడని పీటర్ వివరించారు.

మర్రి చెన్నారెడ్డి ఏం చేయలేకపోయారా?

మర్రి చెన్నారెడ్డి ఏం చేయలేకపోయారా?

పోలీసులకు ఫిర్యాదు చేయమని పీటర్ తండ్రికి చెన్నారెడ్డి సూచించారు. పోలీసులు కేసు నమోదు చేసినట్లే చేశారని, కానీ తాము మాత్రం ఆ తర్వాత ఎస్టేట్ వీడేలా చేశారని పీటర్ తెలిపారు.

మేం పారిపోయాలా చేశారని..

మేం పారిపోయాలా చేశారని..

తాము పారిపోయేలా చేసేందుకు శశికళతో పాటు నాటి మంత్రి సెంగొట్టాయన్ కూడా జయలలితకు సహకరించారని పీటర్ చెప్పారు. ఈ టీ ఎస్టేట్‌ను ప్రయివేటు కంపెనీకా రిజిస్టర్ చేసినప్పుడు పీటర్ పేరును ఓ డైరెక్టర్‌గా పేర్కొన్నారంటున్నారు.

జయలలిత వశమయ్యాక డైరెక్టర్లలోఅందరి పేర్లు తీసేసి, బినామీ పేర్లను చేర్చారని, కానీ తన పేరును మాత్రం అలాగే ఉంచారని పీటర్ చెప్పారని తెలుస్తోంది.

చట్టపరమైన పోరాటానికి పీటర్

చట్టపరమైన పోరాటానికి పీటర్

ప్రస్తుతం, జయలలిత చనిపోయారు. శశికళ జైల్లో ఉన్నారు. అయితే తన ఆస్తి కోసం పీటర్ చట్టపరమైన పోరాటానికి సంకల్పించారు. ఇటీవల కొడనాడు ఎస్టేట్‌లో గార్డ్ హత్య జరిగిన విషయం తెలిసిందే. ఇది సంచలనం రేపింది.

English summary
A month after the security guard at late chief minister J Jayalalithaa's Kodanad estate was found murdered, India Today spoke to original owner of the estate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X