నీ తమ్ముడి ముందే రేప్ చేస్తా: ఫేస్‌బుక్‌లో యువతికి బెదిరింపు

Posted By:
Subscribe to Oneindia Telugu

కోల్‌కతా: సామాజిక అనుసంధాన వేదిక ఫేస్‌బుక్‌లో ఓ మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు, పోస్టింగ్ పెట్టినందుకు ఓ యువకుడిని కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు.

స్మైలీని డిలీట్ చేయడంతో అత్యాచారం బెదిరింపు

స్మైలీని డిలీట్ చేయడంతో అత్యాచారం బెదిరింపు

నిందితుడిని అగ్నీశ్వర్ చక్రవర్తిగా గుర్తించారు. అతని వయస్సు 24. అతను కోల్‌కతాలోని సాల్ట్ లేక్‌లో నివాసం ఉంటున్నాడు. తన ప్రొఫైల్‌లో అతను పోస్టే చేసిన స్మైలీని ఆమె డిలీట్ చేసింది. దీంతో అతను రేప్ చేస్తానని బెదిరించాడు.

యువతి ఇలా

యువతి ఇలా

తద్వారా, అభిప్రాయాలు పంచుకుని స్నేహపూరిత వాతావరణం పెపొందించుకునేందుకు రూపొందించిన సోషల్ మీడియా ఏ స్థాయిలో దుర్వినియోగమవుతుందో తెలిపే ఘటన కోల్‌కతా వేదికగా చోటు చేసుకుంది.

తమ్ముడికి ట్యాగ్

తమ్ముడికి ట్యాగ్

అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్న యువతి (20) తన ఫేస్‌బుక్ ఖాతాలో ఒక పోస్టు పెట్టింది. దానిని తన తమ్ముడిని ట్యాగ్ చేసింది.

కోల్‌కతా వ్యక్తి కామెంట్

కోల్‌కతా వ్యక్తి కామెంట్

దీంతో ఆ పోస్టు ఆమె తమ్ముడి ఖాతాలోని స్నేహితులకు కూడా వెళ్లింది. దీంతో కోల్‌కతాకు చెందిన అగ్నీశ్వర్ చక్రవర్తి దానికి కామెంట్ పెట్టాడు.

అపరిచిత వ్యక్తి అని తొలగించింది

అపరిచిత వ్యక్తి అని తొలగించింది

అపరిచితుడు పెట్టిన కామెంట్ అంటూ ఆమె దానిని తొలగించింది. దీంతో అగ్నీశ్వర్ చక్రవర్తి ఆగ్రహానికి గురయ్యాడు. నిన్ను రేప్ చేస్తానని, ఆ తర్వాత క్షమించమని కోరుతానని, నీ తమ్ముడి ముందే నేను రేప్ చేస్తానని బూతులు తిట్టి బెదిరించాడు.

తమ్ముడి ముందు రేప్ చేస్తానని

తమ్ముడి ముందు రేప్ చేస్తానని

దీనిపై కోల్ కతాకు చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ అగ్నీశ్వర్ పైన పోలీసులు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ పోస్టును చూసిన పోలీసులు, వెంటనే అతనిపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకుని, అతని ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Kolkata police on arrested a person on charges of outraging the modesty of a woman by posting sexually explicit comments on Facebook.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి