వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దగ్గరికి రావడం లేదని ఉరివేసి కొడుకుని చంపిన తల్లి

|
Google Oneindia TeluguNews

Kolkata mom kills boy, slits own throat
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో దారుణం జరిగింది. మానసిక పరిస్థితి సరిగా లేని ఓ తల్లి తన ఐదేళ్ల కుమారుడ్ని హత్య చేసి, తాను గొంతుకోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సర్వే పార్క్ సమీపంలోని తన నివాసంలో రక్తపు మడుగులో ఉన్న ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

శాస్త్రవేత్త అయిన ఆమె భర్త డ్రెహ్రాడూన్‌లో డిఆర్‍‌డిఓలో విధులు నిర్వహిస్తున్నారు. విషయాన్ని ఆయనకు తెలపడంతో అక్కడినుంచి హుటాహుటిన బయల్దేరి కోల్‌కతాకు చేరుకున్నారు. ప్రస్తుతం బాధితురాలు దేవజాని చౌధురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ఆత్మహత్యకు యత్నించిన ఆమె గదిలో పోలీసులకు ఓ సూసైడ్ నోట్ లభించింది. తన ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులు కారని దేవజాని చౌధురి తన సూసైడ్ నోట్‌లో పేర్కొంది.

తన కుమారుడు దేవాంగ చాలా చిన్నవాడని, తల్లికి దూరంగా ఉంటూ చాలా బాధ అనుభవిస్తున్నాడని, అందుకే అతడ్ని హత్య చేస్తున్నట్లు అందులో దేవజాని తెలిపింది. కాగా, దేవజాని తన భర్తతోపాటు డెహ్రాడూన్‌లో నివాసం ఉండేది. అయితే కొంత మానసిక సమస్యలు ఏర్పడటంతో చికిత్స కోసం కోల్‌కతాకు తన కుమారుడితోపాటు వచ్చింది. ఇక్కడే ఉన్న దేవజాని సోదరులు ఆమె కోసం ఓ ఫ్లాట్ తీసుకున్నారు. వారికి ఆ ఫ్లాట్ దగ్గరగానే ఉంటుంది.

కాగా, అతని కుమారుడు ఎక్కువగా సోదరులు వద్దే ఉండేందుకు ఇష్టపడుతుండటంతో ఆమె కొంత మనస్తాపానికి గురైంది. దీంతో దేవాంగ తన దగ్గరికి తీసుకువచ్చుకున్న చౌధురి, ఆదివారం ఉదయం దుప్పట్టతో అతనికి ఉరివేసి హత్య చేసింది. తర్వాత ఆమె కూడా కత్తితో గొంతు, చేతులు కోసుకుంది. అక్కడికి చేరుకున్న ఆమె సోదరులు పోలీసులకు సమాచారం ఇచ్చి, ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

English summary
A 42-year-old woman, who was undergoing psychiatric treatment, strangled her five-year-old son before attempting suicide early on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X