రైల్లో అమ్మాయిపై అర్మీ జవాన్ల గ్యాంగ్ రేప్
కోల్‌కతా: ఓ 14 ఏళ్ల అమ్మాయిపై ఆర్మీ జవాన్లు అత్యంత నీచమైన కార్యానికి ఒడిగట్టారు. ఇంట్లోంచి పారిపోయి రైలు ఎక్కిన అమ్మాయిపై ఆర్మీ జవాన్లు సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటన హౌరా - అమృతసర్ ఎక్స్‌ప్రెస్ రైల్లో జరిగింది.
అమ్మాయి ఆదివారంనాడు ఇంట్లోంచి పారిపోయింది. దాంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్లు రైల్వే శాఖను అప్రమత్తం చేశారు. హౌరా స్టేషన్‌లో వేలాది మంది మధ్య ఆమెను సిసీ టీవీలో పోలీసులు గుర్తించారు. ఆమె అమృతసర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కినట్లు తెలుసుకున్నారు.
పోలీసులు గుర్తించే సరికే రైలు జార్ఖండ్ దాటిపోయింది. రాంచీ డీజీపి కార్యాలయానికి సమాచారం పంపించారు. దాంతో అమ్మాయిని కాపాడే ప్రయత్నం చేశారు. రైలును మధుపూర్ స్టేషన్‌లో ఏడు నిమిషాల పాటు ఆపి జీఆర్పి, ఆర్పిఎఫ్ సిబ్బంది ప్రతి బోగీనీ పరిశీలించరాు. మిలిటరీ కోచ్ మాత్రం లోపలి నుంచి గడియ వేసి ఉంది.
కొంత సేపు వాగ్వాదం జరిగిన తర్వాత ఆర్పిఎఫ్, జీఆర్పీ సిబ్బంది బోగీలోకి వెళ్లారు. అందులో ఆ అమ్మాయి ఉంది. మహిళా పోలీసులు ఆమెను జీఆర్పీ స్టేషన్‌కు తరలించారు. అక్కడ అనుమానాస్పదంగా ఉన్న మంజ్రీష్ త్రిపాఠీ ఏనే సైనికుడిని అదుపులోకి తీసుకున్నారు.
అమ్మాయిని జీఆర్పీ పోలీసులు ప్రశ్నించారు. ముగ్గురు జవాన్లు తనతో బలవంతంగా మద్యం తాగించారని, ఇద్దరు అత్యాచారం జరిపారాని తెలిపింది. సిసిటీవీ ఫుటేజీలో ఆ ఇద్దరినీ ఆమె గుర్తించింది. ఈ ప్రక్రియ ముగిసి వాళ్లను అరెస్టు చేయాలని ఆదేశాలు ఇచ్చేసరికి రైలు 22 స్టేషన్లు దాటి సుల్తాన్ పూర్ చేరుకుంది. దాంతో వాళ్లు ఆ బోగీలోంచి మాయమయ్యారు. మంజ్రీస్ త్రిపాఠీని మాత్రం రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications