బ్యూటీ పార్లర్ లో యువతికి మత్తు ఇచ్చి గ్యాంగ్ రేప్
బ్యూటీ పార్లర్ లో మాట్లాడేందుకు వచ్చి యువతికి మత్తు మందు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు నిందితులు. ఈ ఘటన కోల్ కతాలో చోటుచేసుకొంది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
కోల్ కతా: ఓ బ్యూటీ పార్లర్ లో మాట్లాడేందుకు వచ్చిన యువతికి మత్తుమందు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు నిందితులు . నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
కోల్ కత్తా నగరంలోని ముకుందాపూర్ లోని ఓ బ్యూటీ పార్లర్ కు మాట్లాడేందుకు వచ్చిన రాజ్ కుమార్ మండల్, అమల్ మండల్ కలిసి వచ్చారు. అయితే అక్కడే ఉన్న యువతికి మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డారు.

బ్యూటీ పార్లర్ లో యువతి ఒంటరిగా ఉన్న విషయాన్ని గుర్తించిన నిందితులు పథకం ప్రకారంగా యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు.ఆమెకు భోజనం తెప్పించి బోజనంలో మత్తు మందు కలిపారు. యువతి స్పృహ కోల్పోయిన తర్వాత నిందితులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications