తమిళనాడు సీఎం పళనిసామికి నైటీ, స్పీకర్ ధనపాల్ కు చీర: రాజీనామా చెయ్యాలని, అరెస్టు !

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి నైటీ, ఆ రాష్ట్ర స్పీకర్ ధనపాల్ కు చీర పంపించడానికి ప్రయత్నించిన ఎనిమిది మందిని ఈరోడ్ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి నైటీ, ఆ రాష్ట్ర స్పీకర్ ధనపాల్ కు చీర పంపించడానికి ప్రయత్నించిన ఎనిమిది మందిని ఈరోడ్ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఈరోడ్ జిల్లా ఈస్ట్ కొంగునాడు వెట్టువగౌండర్ యువజన సంక్షేమ సంఘం కార్యదర్శి జగదీశన్ తో సహ ఏనిమిది మందిని అరెస్టు చేశారు.

ఈరోడ్ జిల్లా ఈస్ట్ కొంగునాడు వెట్టువగౌండర్ యువజన సంక్షేమ సంఘం కార్యదర్శి జగదీశన్ ఆధ్వర్యంలో ఎనిమిది మంది ఈరోడ్ తపాలా కార్యాలయం చేరుకుని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి నైటీ, స్పీకర్ ధనపాల్ కు చీర పంపించడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో వాటిని తీసుకోవడానికి తపాలా సిబ్బంది వెనకడుగు వేశారు.

kongu vettuvagounder youth welfare Secretary send saree to TN CM Palaniswamy.

ఈరోడ్ జిల్లా ఈస్ట్ కొంగునాడు వెట్టువగౌండర్ యువజన సంక్షేమ సంఘం కార్యదర్శి జగదీశన్ ఆధ్వర్యంలో తపాలా కార్యాలయం ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ఈ సందర్బంగా ఆందోళనకారులు మీడియాతో మాట్లాడుతూ స్పీకర్ ధనపాల్ ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వానికి బలపరీక్ష నిర్వహించడానికి ఎందుకు అవకాశం ఇవ్వలేదని ప్రశ్నించారు.

చట్టానికి వ్యతిరేకంగా టీటీవీ దినకరన్ వర్గంలోని 18 మంది ఎమ్మెల్యేల మీద వేటు వేశారని, ఇది ప్రజాస్వామ్య హత్య అని ఆరోపించారు. మైనారీలో ఉన్న ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చెయ్యాలని డిమాండ్ చేస్తూ సీఎం, స్పీకర్ కు నైటీ, చీర పంపించడానికి ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+