కోరేగావ్ - బీమా సంఘటన: మహారాష్ట్ర బంద్

Posted By:
Subscribe to Oneindia Telugu
  Bhima-Koregaon incident : మహారాష్ట్ర బంద్, ఆందోళనలతో అట్టుడికిన ముంబై

  ముంబై: కోరేగావ్ - భీమా సంఘటనకు నిరసనగా దళిత నేతలు ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం మహారాష్ట్ర బంద్ కొనసాగుతోంది. భరిప బహుజన్ మహాసంఘ్ నేత, బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాష్ అంబేడ్కర్ బంద్‌కు పిలుపునిచ్చారు.

  హింసాత్మక సంఘటనలను నిలువరిండంలో ప్రభుత్వం విఫలమైనందుకు నిరసనగా బంద్ నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. పూణేలో సోమవారం జరిగిన హింసాత్మక సంఘటనలకు నిరసనగా ముంబైలో నిరసనలు పెల్లుబుకాయి.

  ఆందోళనకరాలు బస్సులను ధ్వంసం చేశారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది.

  Koregaon-Bhima violence: Bandh in Maharashtra today; CM appeals for calm

  మితవాద హిందూ సంస్థలకు, దళిత గ్రూపులకు మధ్య సోమవారం భీమా - కోరేగావ్ 200 వార్షికోత్సవం సందర్భంగా పూణేలో ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణల్లో ఓ వ్యక్తి మరణించాడు.

  హిందూ ఏక్తా అఘాదీ, శివరాజ్ ప్రతిష్టాన్ నేతలు మిలింద్ ఎక్బోటే, శంబాజీ భీడేలపై పింప్రి పోలీసు స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. ఈ రెండు సంఘాలు కూడా దళితుల బీమా కోరేగావ్ విజయ్ దివస్‌ను వ్యతిరేకించాయి.

  ముంబైలో ఆందోళనకారుల నిరసన సందర్బంగా 160 బస్సు ధ్వంసమయ్యాయి. వంద మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూణే సంఘటనపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విచారణకు ఆదేశించారు.

  సోమవారంనాటి హింసలో ఏమైనా కుట్ర కోణం ఉందా చూడాల్సి ఉందని ఆయన అన్నారు. ప్రశాంతంగా ఉండాలని ఆయన ప్రజలను కోరారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫడ్నవీస్‌కు ఫోను చేసి పరిస్థితిని తెలుసుకున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Dalit leaders have called for a state-wide bandh across Maharashtra on Wednesday to protest against the violence that broke out during the 200th-anniversary celebrations of Bhima-Koregaon battle in Pune

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి