బీజేపీ మీద తిరుగుబాటు, మోదీ ఫోటో కోసం కోర్టుకు వెళ్లిన మాజీ డీసీఎం, ఎవరి నాయన ఆస్తి ?
ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో పెట్టుకునే విషయంలో బీజేపీ నాయకులకు, బీజేపీ మీద తిరుబాటు చేసి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ డీసీఎం మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో పెట్టుకునే విషయంలో మాజీ డీసీఎం కోర్టును ఆశ్రయించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. బీజేపీ సింబల్ తో పోటీ చేస్తున్న లీడర్, మాజీ డీసీఎం ఇప్పుడు న్యాయపోరాటం చేస్తున్నారు
కర్ణాటకలోని శివమొగ్గలో బీజేపీ మీద తిరుగుబాటు చేసిన కేఎస్. ఈశ్వరప్ప ఇప్పుడు బీజేపీ నాయకులకు తలనొప్పిగా తయారైనాడు. తన కుమారుడికి బీజేపీ నాయకులు ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో శివమొగ్గలో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలని కర్ణాటక మాజీ డీసీఎం కేఎస్ ఈశ్వరప్ప నిర్ణయించుకున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను వినియోగించారని బీజేపీ నాయకులు కేఎస్ ఈశ్వరప్ప మీద మండిపడుతున్నారు.

మోదీ ఫోటో వివాదంతో కేఎస్ ఈశ్వరప్ప కోర్టుకెక్కారు. శివమొగ్గ లోక్ సభ నియోజకవర్గంలో బీజేపీ రెబల్ అభ్యర్థిగా మాజీ ఉపమంత్రి కేఎస్ ఈశ్వరప్ప పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఫొటోను వాడుకోవడం వివాదానికి గురి అయింది. బీజేపీ మీద తిరుగుబాటు చేసిన తరువాత మోదీ ఫోటో ఎలా పెట్టుకుంటారు అంటూ బీజేపీ నాయకులు రెబల్ లీడర్ కేఎస్ ఈశ్వరప్పను నిలదీశారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో పెట్టుకునే విషయంలో మాజీ డీసీఎం కేఎస్ ఈశ్వరప్ప శివమొగ్గ కోర్టులో కేవియట్ దాఖలు చేశారు. కేఎస్ ఈశ్వరప్ప తన ప్రచారంలో మోదీ ఫొటోను పెట్టుకోవడంపై శివమొగ్గ బీజేపీ అభ్యర్థి బీవై రాఘవేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఈశ్వరప్ప స్పందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఎవరి నాయన సొత్తు కాదు అంటూ బీవై రాఘవేంద్రకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు ఈ ఫోటో వ్యవహారం కోర్టు మెట్లెక్కింది.

సొంత పార్టీ మీద తిరుగుబాటు చేసిన స్వతంత్ర అభ్యర్థులు సాధారణంగా తమ పాత పార్టీలోకి రారు. ఏ పార్టీ నుంచి బయటకు వెళ్లారో అదే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం ఎక్కువ అయ్యింది. అయితే కేఎస్ ఈశ్వరప్ప ఎత్తుగడలు మాత్రం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. పార్టీయేతర అభ్యర్థిగా ప్రచారం కోసం మోదీ ఫొటోను వాడుకోవడంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేఎస్ ఈశ్వరప్ప ఇటీవల అమిత్ షా బెంగళూరు వచ్చినప్పుడు ఆయనకు ఫోన్ చేశారు.
అప్పుడు నన్ను ఢిల్లీకి రమ్మని చెప్పారని ఈశ్వరప్ప అన్నారు, అయితే ఢిల్లీకి వెళ్లినా కేఎస్ ఈశ్వరప్పతో మాట్లాడటానికి అమిత్ షాతో పాటు బీజేపీ పెద్దలు ఎవ్వరూ పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఢిల్లీలో బీజేపీ నాయకులు ఎవ్వరిని కలవకుండానే కేఎస్ ఈశ్వరప్ప శివమొగ్గకు తిరిగి వచ్చేశారు. ఢిల్లీ పెద్దలు కలవకపోవడంతో శివమొగ్గలో బీఎస్, యడియూరప్ప కుమారుడు బీవై రాఘవేంద్రను ఓడించాలని డిసైడ్ అయిన ఈశ్వరప్ప బీజేపీ మీద తిరుగుబాటు చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే బీజేపీ మీద తిరుగుబాటు చేసిన కేఎస్. ఈ్వరప్పను ఇంత వరకు బీజేపీ నాయకులు పార్టీ నుంచి సస్పెండ్ చెయ్యకపోవడంతో ఇప్పుడు తీవ్రచర్చకు దారితీసింది.
-
డీలిమిటేషన్ పై మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు -
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..!












Click it and Unblock the Notifications