వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

KSRTC కేరళదే: 7ఏళ్ల పోరాటంలో కర్ణాటకకు చుక్కెదురు -పేటెంట్ కంట్రోలర్ తీర్పు ఇదే..

|
Google Oneindia TeluguNews

కేఎస్‌ఆర్టీసీ అనగానే అందరికీ గుర్తొచ్చేది.. కర్ణాటక స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌ అని. తెలుగు రాష్ట్రాల్లోనూ కేఎస్‌ఆర్టీసీ బస్సుల సేవలుండటం తెలిసిందే. అయితే, ఇకపై కేఎస్ఆర్టీసీ కర్ణాటకు చెందింది కాదు.. కేరళ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌ మాత్రమే. ఈ రెండు రాష్ట్రాల మధ్య కేఎస్‌ఆర్టీసీ ట్రేడ్‌మార్క్‌ సంక్షిప్తపదంపై ఏడేళ్లుగా నలుగుతోన్న వివాదానికి శుక్రవారం తెరపడింది..

ఇండియన్ పేటెంట్ ఆఫీస్ గా పిలుచుకునే కేంద్ర ప్రభుత్వ సంస్థ 'ది కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ పేటెంట్స్‌ డిజైన్‌ అండ్‌ ట్రేడ్‌మార్క్‌'.. కేఎస్ఆర్టీసీ వివాదంపై తీర్పు వెల్లడించింది. కేఎస్‌ఆర్టీసీ ట్రేడ్‌మార్క్‌ కేరళకే చెందుతుందని, సంక్షిప్త పదంతోపాటు రెండు ఏనుగుల చిహ్నంపై కేరళకే హక్కులు ఉంటాయని పేర్కొంది. కర్ణాటక రాష్ట్రం ఇకపై కేఎస్‌ఆర్టీసీ పదాన్ని ఉపయోగించకూడదని వెల్లడించింది.

జగన్.. ఇవే ప్రశ్నలు మోదీని అడగరేం? -మీరు, నవీన్ బీజేపీకి మిత్రులేకదా! -వ్యాక్సిన్ల రాజకీయంలో అనూహ్య మలుపుజగన్.. ఇవే ప్రశ్నలు మోదీని అడగరేం? -మీరు, నవీన్ బీజేపీకి మిత్రులేకదా! -వ్యాక్సిన్ల రాజకీయంలో అనూహ్య మలుపు

 KSRTC now belongs to Kerala after 7 years of legal battle with Karnataka

ఇరు రాష్ట్రాల రోడ్‌ ట్రాన్స్‌పోర్టు శాఖకు ఘన చరిత్రే ఉంది. మొదట్లో కేరళ రోడ్‌ ట్రాన్స్‌పోర్టును ట్రావెన్‌కోర్‌ స్టేట్‌ ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్‌గా వ్యవహరించేవారు. ఆ తర్వాత 1965 ఏప్రిల్‌ 1 నుంచి కేరళ స్టేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌గా పేరు మార్చారు. మరోవైపు కర్ణాటక ట్రాన్స్‌పోర్టు పూర్వం మైసూర్‌ గవర్న్‌మెంట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్‌గా ఉండేది.. 1973లో దాన్ని కర్ణాటక స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్టుగా మార్చారు. అప్పటి నుంచి ఇరు రాష్ట్రాలు కేఎస్‌ఆర్టీసీ పేరుతోనే ప్రజారవాణా సేవలు అందిస్తున్నాయి.

అయితే, కర్ణాటక రాష్ట్రం కేఎస్‌ఆర్టీసీ ట్రేడ్‌మార్క్‌ రిజిస్ట్రేషన్‌ కోసం 2014లో దరఖాస్తు చేసింది. ఈ సంక్షిప్త పదంపై హక్కులు తమవేనంటూ కేరళకు కర్ణాటక ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. దీంతో కేరళ ప్రభుత్వం న్యాయ పోరాటానికి దిగింది. కేఎస్‌ఆర్టీసీ ట్రేడ్‌మార్క్‌ హక్కులు తమకే ఉంటాయని వాదించింది. ఎట్టకేలకు ఈ న్యాయపోరాటంలో కేరళ గెలుపొంది.. మేధో సంపత్తి హక్కులను దక్కించుకుంది.

Recommended Video

Kamala Harris Speaks To PM Modi, బైడెన్, కమలా కి మోదీ ధన్యవాదాలు!! || Oneindia Telugu

ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ -3జిల్లాలకు కొత్త కలెక్టర్లు, అంతటా జేసీల మార్పు -గంధం చంద్రుడికి ప్రమోషన్ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ -3జిల్లాలకు కొత్త కలెక్టర్లు, అంతటా జేసీల మార్పు -గంధం చంద్రుడికి ప్రమోషన్

English summary
The acronym KSRTC, abbreviated for Kerala State Road Transport Corporation, its emblem and the nickname Aanavandi (elephant cart) now belong to Kerala. The Trademark of Registry has issued an order allowing the name KSRTC, which is commonly used for the vehicles of the Road Transport Corporation of Kerala and Karnataka, now to be used only in Kerala. Both the states have been using the acronym KSRTC for their public transport services for years. But in 2014, Karnataka had sent a notice to Kerala stating that the acronym belonged to Karnataka and that the Kerala State Road Transport Corporation should not use it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X