Karnataka: కర్నాటక సీఎంగా కొత్త పేరు ? ఢిల్లీలో మారుతున్న లెక్కలు..!

కర్ణాటకలో కాంగ్రెస్ నేతలు రాజకీయ ఉద్రిక్తతలు మరియు పార్టీ ప్రతిష్టపై ఆందోళనల కారణంగా ఢిల్లీకి పిలవబడ్డారు. కీలక నిర్ణయాలు ఎదురుచూస్తున్నాయి.

కర్నాటకలో రెండున్నరేళ్లు పూర్తి చేసుకున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు సీఎం పదవిలో సిద్దరామయ్యను కొనసాగించాలా లేక మార్చాలా అన్నది తెలియడం లేదు. రెండున్నరేళ్లు సీఎం పదవిలో ఉన్న సిద్దరామయ్యను తప్పించి మిగిలిన రెండున్నరేళ్లు తనను సీఎం చేయాలని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పట్టుబడుతున్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత సీబీఐ, ఈడీ కేసుల్ని సాకుగా చూపి శివకుమార్ ను తాత్కాలికంగా పక్కనబెట్టిన కాంగ్రెస్ కు ఈసారి మాత్రం ఆ పరిస్ధితి లేదు.

కర్నాటక సంక్షోభంపై కాంగ్రెస్ సీరియస్

ఈ నేపథ్యంలో ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు అధిష్టానం కర్నాటక విషయంలో పలు ఆప్షన్లను పరిశీలిస్తోంది. ముందుగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లను ఢిల్లీకి పిలిపించాలని సన్నాహాలు చేస్తోంది. అలాగే రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ డ్రామాపై అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో చోటుచేసుకుంటున్న పరిణామాలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని ఢిల్లీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా సిద్ధు, డీకేఎస్ వర్గాలు తమ స్థానాలను పటిష్టం చేసుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలు, ఎమ్మెల్యేలు తరచూ ఢిల్లీకి రావడం ఇబ్బందికరంగా మారిందంటున్నారు.

K taka Crisis Deepens As Siddaramaiah-Shivakumar Tussle Grows What Are Congress s Options

డీకేకు మద్దతుగా సోనియా, ప్రియాంక

ఈ నేపథ్యంలో అధిష్ఠానం త్వరలో జరిగే భేటీలో ప్రధాన అజెండా ఇరువురు నేతలను తమ వర్గాలను అదుపులో ఉంచుకోవాలని ఆదేశించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగించేలా బహిరంగ ప్రకటనలు చేయవద్దని స్పష్టం చేయనున్నారు. అయితే కర్ణాటక నాయకత్వ సమస్యపై తుది నిర్ణయం రాహుల్ గాంధీదేనని కాంగ్రెస్ సీనియర్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే అధిష్టానం కోర్ కమిటీలో ఉన్న ఆరుగురిలో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రణదీప్ సింగ్ సూర్జేవాలా డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచనకు మొగ్గు చూపుతున్నారని న్యూస్‌18 వెల్లడించింది.

సిద్ధరామయ్యకు మద్దతుగా రాహుల్ ?

కానీ రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ మాత్రం సిద్ధరామయ్యను పూర్తికాలం కొనసాగడానికి అనుకూలంగా ఉన్నారని తెలిపింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాత్రం దీనిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. మరోవైపు జనవరి-మార్చికి ముందు నాయకత్వ మార్పు లేదా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండదని కాంగ్రెస్ ఉన్నత స్థాయి వర్గాలు చెప్తున్నాయి. అటు కర్నాటకలో నెలకున్న సంక్షోభం నేపథ్యంలో ఖర్గే పేరును కూడా ఆయన వర్గం సీఎంగా తెరపైకి తెస్తోంది. అయితే ప్రస్తుతానికి కాంగ్రెస్ ఎలాంటి దూకుడు నిర్ణయం తీసుకున్నా వచ్చే ఎన్నికలపై కచ్చితంగా ప్రభావం పడుతుందని అంచనా వేస్తున్నారు.

K taka Crisis Deepens As Siddaramaiah-Shivakumar Tussle Grows What Are Congress s Options

ఖర్గే సీఎం-రాజ్యసభకు సిద్దూ ?

ప్రస్తుతానికి కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలిస్తున్న ఆప్షన్లలో ప్రస్తుతానికి ఇరువర్గాలు శాతంగా ఉండాలని, పరిస్ధితి సాధారణ స్థితికి వచ్చాక అప్పుడు నాయకత్వ మార్పుపై చర్చిద్దామమని ప్రతిపాదించే అవకాశముంది. అలాగే రెండో ఆప్షన్ గా ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత రహస్య సమావేశం పెట్టి మార్చిలో బడ్జెట్ తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకుంటామని చెప్తారు. మూడవ ఆప్షన్ గా ప్రస్తుతానికి అధికార మార్పిడి ఉండదు. అయితే 2028 ఎన్నికల కోసం ప్రణాళిక, అమలు, ప్రచార వ్యూహం, నాయకత్వాన్ని శివకుమార్ చూసుకునేందుకు సిద్ధరామయ్య అంగీకరించాలి. నాలుగో ఆప్షన్ గా నాయకుడిగా ఖర్గేను ఏఐసీసీ ఛీఫ్ గా కొనసాగించా లేక సీఎంను చేయాలా అనేది పరిశీలిస్తారు. ఐదో ఆప్షన్ గా ఖర్గే కర్ణాటక సీఎంగా, సిద్ధరామయ్య ఢిల్లీలో రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా మారతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+