కేజ్రీవాల్‌కు షాక్, ఏఏపీలో ముసలం: కుమార్ విశ్వాస్ కంటతడి
ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కుమార్ విశ్వాస్ కంటతడి పెట్టారు. తనపై కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. రేపు కీలక నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు.
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కుమార్ విశ్వాస్ కంటతడి పెట్టారు. తనపై కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. రేపు కీలక నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు.
తనకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కావాలని కానీ, పార్టీ అధ్యక్ష పదవి కావాలని కానీ లేదని చెప్పారు. అయితే పార్టీలో నేతలు తప్పులు చేస్తుంటే చూస్తూ ఊరుకోనని చెప్పారు.

ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలకు వ్యతిరేకంగా మాట్లాడితే పార్టీ నుంచి తొలగిస్తారా అని నిలదీశారు. తన వీడియో వియ్ ది నేషన్ పైన తాను ఎవరికీ క్షమాపణ చెప్పేది లేదన్నారు.
తాను బీజేపీ, ఆరెస్సెస్ ఏజెంటులో వ్యవహరిస్తున్నానని ఏఏపీ నేత అమానుతుల్లా ఖాన్ ఆరోపించడంపై కుమార్ విశ్వాస్ నొచ్చుకున్నారు. అమానతుల్లా ఖాన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విస్మయం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications