వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను ముందే చెప్పా, విశేషాధికారం అన్నారు.. ఇప్పుడేమైందీ?: కేజ్రీవాల్‌పై కుమార్ విశ్వాస్ ఫైర్

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో సంక్షోభంపై ఆ పార్టీ సీనియర్ నేత కుమార్ విశ్వాస్ స్పందించారు. 20 మంది ఆప్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ఎన్నికల కమిషన్ రాష్ట్రపతికి సిఫారసు చేసిన నేపథ్యంలో శనివారం కుమార్ విశ్వాస్ మాట్లాడారు. మరోవైపు ఆప్ రెబల్ ఎమ్మెల్యే కపిల్ మిశ్రా తన అంతర్గత సర్వేను వెల్లడించారు.

శుక్రవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఎన్నికల కమిషన్ ఓ నివేదికను పంపడం, 20 మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు లాభదాయక పదవులను నిర్వహిస్తున్నారని, ఇది చట్ట విరుద్ధమని, వీరిని శాసన సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించాలని సిఫారసు చేయడం తెలిసిందే.

ఇది చట్ట విరుద్ధం, రాజ్యంగ విరుద్ధం...

ఇది చట్ట విరుద్ధం, రాజ్యంగ విరుద్ధం...

పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమితులైన 20 మంది ఆప్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ కారు, తదితర ప్రయోజనాలను పొందుతున్నారు. ఇది చట్ట విరుద్ధం, రాజ్యంగ విరుద్ధం. దీంతో ఎన్నికల కమిషన్ స్పందించి ఈ 20 మంది ఆప్ ఎమ్మెల్యేల శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని సిఫారసు చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఒక నివేదికను పంపింది.

 సీఎంగా అది తనకున్న విశేషాధికారం అన్నారు...

సీఎంగా అది తనకున్న విశేషాధికారం అన్నారు...

20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఎన్నికల కమిషన్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు నివేదికపంపడంపై ఆప్ ఎమ్మెల్యే కుమార్ విశ్వాసం గొంతు విప్పారు. ఈ సంఘటన దురదృష్టకరం, విచారకరం అని వ్యాఖ్యానించారు. ‘‘ఎమ్మెల్యేలకు లాభదాయక పదవులను కట్టబెట్టడంపై గతంలోనే నేను కేజ్రీవాల్‌కు సలహా ఇచ్చాను. కానీ ఆయన పట్టించుకోలేదు. ముఖ్యమంత్రిగా తనకున్న విశేష అధికారంతో నియామకాలు జరుపుతున్నానన్నారు. దీంతో నేను మౌనంగా ఉండిపోయా..''అని కుమార్ విశ్వాస్ వ్యాఖ్యానించారు.

వారిలో ఏ ఒక్కరూ మళ్లీ గెలవరు: కపిల్ మిశ్రా

వారిలో ఏ ఒక్కరూ మళ్లీ గెలవరు: కపిల్ మిశ్రా

మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం అనర్హత వేటు ప్రకటించిన 20 మంది ఎమ్మెల్యేలలో ఏ ఒక్కరు కూడా తిరిగి గెలవబోరని ఆప్‌ ఎమ్మెల్యే(రెబల్‌) కపిల్‌ మిశ్రా చెబుతున్నారు. ఉప ఎన్నికలకు వెళ్తే.. వారంతా చిత్తుగా ఓడిపోవటం ఖాయమని ఆయన అంటున్నారు.
అంతర్గత సర్వేలో ఈ విషయం తేటలెల్లమైందన్న ఆయన.. ఇందుకు సంబంధించిన నివేదికను శనివారం మీడియాకు విడుదల చేశాడు.

 అంతర్గత సర్వే ఏం చెబుతుందంటే...

అంతర్గత సర్వే ఏం చెబుతుందంటే...

కారావాల్‌ నగర్‌ ఎమ్మెల్యే అయిన కపిల్‌ మిశ్రా గత కొంత కాలంగా ఆప్‌ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉంటూ అధికార కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై ఎన్నికల సంఘం అనర్హత వేటు ప్రకటన వెలువడగానే కపిల్ మిశ్రా అంతర్గత సర్వేను ప్రారంభించేశారు. సోషల్‌ మీడియా ద్వారా ఆయా నియోజక వర్గాల్లో ప్రజల అభిప్రాయలను సేకరించిన కపిల్‌.. ఆ నివేదికను రాత్రికి రాత్రే ఆప్‌ కన్వీనర్‌, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు అందజేశారు.

11 స్థానాల్లో ఆప్‌ అభ్యర్థుల ఓటమి ఖాయం...

11 స్థానాల్లో ఆప్‌ అభ్యర్థుల ఓటమి ఖాయం...

‘‘అంతర్గత సర్వే నిర్వహించి నివేదికను తయారు చేశాం. ఆ 20 మందిపై ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ‘ఎమ్మెల్యేల పనితీరు.. ప్రజల్లో వారిపై ఏ మేర వ్యతిరేకత' ఉంది అన్న విషయాలను నివేదికలో స్పష్టంగా పేర్కొన్నాం. వారు తిరిగి గెలిచే అవకాశాలే లేవు. ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు జరిగితే 11 స్థానాల్లో ఆప్‌ అభ్యర్థుల ఓటమి ఖాయం. 9 స్థానాల్లో ఒకవేళ అభ్యర్థులను మార్చినా లాభం లేకపోవచ్చు..'' అని కపిల్‌మిశ్రా పేర్కొన్నారు. కపిల్‌ సూచించిన స్థానాల మార్పుల్లో అల్కా లాంబ, ఆదర్శ్‌ శాస్త్రి, సరితా సింగ్‌, ప్రవీణ్‌ దేశ్‌ముఖ్‌ పేర్లు ప్రముఖంగా ఉన్నాయని తెలుస్తోంది.

English summary
The impending disqualification of 20 AAP MLAs for violation of holding offices of profit has become the ground for the infighting within the party to surface ye again. AAP leader Kumar Vishwas, who stands sidelined within the party, used the opportunity to take a shot at CM Arvind Kejriwal. "It is very unfortunate and sad, the action against 20 AAP MLAs," Vishwas told news agency ANI. "I had given certain suggestions earlier, but I was told it is the CM's prerogative to appoint people. So, I kept quiet," he added. Vishwas is in a strained relationship with the AAP leadership at the moment. He had told the media that he was being targeted, after the party refused to back his nomination to the Rajya Sabha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X