వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆరురోజులు ఛాన్స్.. అయినా నో యూజ్.. కుప్పకూలిన కుమార సర్కార్

|
Google Oneindia TeluguNews

బెంగళూరు : కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. గత మూడువారాల నుంచి సాగుతున్న ఉత్కంఠకు .. సభలో డివిజన్ పద్ధతిలో జరిగిన ఓటింగ్ ముగింపు పలికింది. సభలో మొత్తం 224 మంది సభ్యులు ఉండగా .. 16 మంది రెబల్స్ తిరుగుబావుటా ఎగరేశారు. ఇవాళ సభకు 205 మంది సభ్యులు హాజరవడంతో .. 105 మ్యాజిక్ ఫిగర్‌గా నిర్ణయించారు.

సంకీర్ణ ప్రభుత్వం కాంగ్రెస్, జేడీఎస్ 99 సభ్యుల మద్దతు వచ్చింది. విపక్ష బీజేపీ 105 సభ్యుల మద్దతుతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. బలపరీక్షకు ముందు సీఎం కుమారస్వామి సుదీర్ఘంగా ప్రసంగించారు. 14 నెలల సమయంలో తాను చేసిందేంటో వివరించారు. విపక్ష బీజేపీని ఏకీపారేశారు. యడ్యూరప్ప అధికారం కోసం అర్రులు చాచారని మండిపడ్డారు. తమ సభ్యులను ప్రలోభాలకు గురిచేశారని .. కర్ణాటకలో అధికారం కోసం బీజేపీ చేయాల్సిదంతా చేసిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

kumara swami govt loss trust vote

కుమారస్వామి ప్రసంగం తర్వాత సభలో బలపరీక్ష నిర్వహించారు. సభా సంప్రదాయాల ప్రకారం అసెంబ్లీ తలుపులు మూసివేసి .. బలపరీక్ష నిర్వహించారు. డివిజన్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. డివిజన్ పద్ధతి అంటే ఒక్కో వరుసలో సభ్యుల ఓటింగ్ ను లెక్కించడం. తర్వాత సిబ్బంది స్పీకర్‌కు మద్దతు సంఖ్యను తెలిపారు. సంకీర్ణ సర్కార్ 99 మంది సభ్యులతో సరిపోగా .. బీజేపీ 105 సభ్యులతో మెజార్టీ పార్టీగా అవతరించింది. మరోవైపు రెబల్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతుగా ఓటేసిన ఫలితం లేకుండా పోయింది.

English summary
The political drama in Karnataka ended with the fall of 14-month-old Congress-JDS government as Kumaraswamy lost the trust motion by a margin of 99 to 105 votes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X