Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నేడే విశ్వాసపరీక్ష!: బీజేపీ మరో ఎత్తుగడ?, కుమారస్వామికి పరమేశ్వర ఝలక్..

Recommended Video

    కర్ణాటక సీఎం కుమారస్వామి విశ్వాసపరీక్ష నెగ్గడం కష్టమే

    బెంగళూరు: కర్ణాటక సీఎం కుమారస్వామి విశ్వాసపరీక్షకు సిద్దమయ్యారు. ఆయన నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం శుక్రవారం విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి ప్రస్తుతం 117మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో బలనిరూపణలో నెగ్గడం లాంఛనంగానే కనిపిస్తోంది.

    కాగా, సభలో విశ్వాసపరీక్షకు ముందు స్పీకర్ ఎన్నిక జరగనుంది. స్పీకర్ ఎంపిక తర్వాత సభలో ఉండే మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా బలపరీక్షలో గెలిచేందుకు 111 మంది మద్దతు అవసరం. ఆ సంఖ్య కాంగ్రెస్, జేడీఎస్ కూటమికి ఉంది కాబట్టి బలనిరూపణలో నెగ్గడం కష్టమేమి కాదు.

    ఇంకా రిసార్టుల్లోనే ఎమ్మెల్యేలు:

    ఇంకా రిసార్టుల్లోనే ఎమ్మెల్యేలు:

    యడ్యూరప్ప&కో ప్రలోభాల నుంచి ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను ఇంకా రిసార్టులోనే ఉంచిన సంతి తెలిసిందే. కూటమికే ఓటేస్తామని, ఇళ్లకు వెళ్లేందుకు అనుమతినివ్వాలని కొంతమంది ఎమ్మెల్యేలు కోరినా.. కాంగ్రెస్ అందుకు సమ్మతించలేదు. దీంతో ఎమ్మెల్యేలంతా రిసార్టు నుంచి నేరుగా అసెంబ్లీకి రానున్నారు. జేడీఎస్ ఎమ్మెల్యేలు సైతం ఇంకా ఓ హోటల్లోనే బస చేస్తున్నారు. ఇంటికి వెళ్తామన్న వారి అభ్యర్థనను పార్టీ తిరస్కరించినట్టు తెలుస్తోంది.

    బీజేపీ మరో ఎత్తుగడ:

    బీజేపీ మరో ఎత్తుగడ:

    మెజారిటీ లేక బలనిరూపణలో వీగిపోయిన యడ్యూరప్ప.. స్పీకర్ ఎన్నికకు మాత్రం తమ అభ్యర్థిని రంగంలోకి దింపారు. ఐదోసారి ఎమ్మెల్యేగా ఎంపికైన సీనియర్‌ నేత ఎస్‌. సురేశ్‌ కుమార్‌తో స్పీకర్ పదవికి నామినేషన్ వేయించారు.
    ఇక కాంగ్రెస్-జేడీఎస్ ల తరుపున మాజీ స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ స్పీకర్‌గా ఖరారు కాగా, డిప్యూటీ స్పీకర్‌గా జేడీఎస్‌ ఎమ్మెల్యే ఒకరికి అవకాశం దక్కనుంది. శుక్రవారం మధ్యాహ్నం కుమారస్వామి విశ్వాస పరీక్షను ఎదుర్కోనుండగా.. అంతకుముందే స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ పదవులకు ఎన్నిక జరగనుంది.

    'స్పీకర్' పోస్టు మాదే అంటున్న బీజేపీ:

    'స్పీకర్' పోస్టు మాదే అంటున్న బీజేపీ:

    స్పీకర్ పోస్టుకు నామినేషన్ అనంతరం సురేశ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. 'అసెంబ్లీలో మా సంఖ్య, వివిధ అంచనాలతో నేను విజయం సాధిస్తానని మా పార్టీ బలంగా నమ్ముతోంది. ఆ ధైర్యంతోనే నేను నామినేషన్‌ వేశాను. ఫలితం మీరే చూస్తారు' అంటూ ఆయన పేర్కొన్నారు. ఇక అటు కాంగ్రెస్ సైతం తమ అభ్యర్థి విజయం ధీమా వ్యక్తం చేసింది.

    యడ్యూరప్ప విమర్శలు:

    యడ్యూరప్ప విమర్శలు:

    అనివార్య స్థితిలో కాంగ్రెసుతో కలిశారు తప్పితే ఆ పార్టీపై కుమారస్వామికి ఏమాత్రం నమ్మకం లేదని యడ్యూరప్ప పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం డిప్యూటీ సీఎం పరమేశ్వరకు మాట్లాడే అవకాశం కూడాల ఇవ్వలేదని, లింగాయత్‌ల గురువు పండితారాధ్య శివాచార్య స్వామీజీపై కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనమని యడ్యూరప్ప మండిపడ్డారు.

    కుమారస్వామికి పరమేశ్వర ఝలక్:

    కుమారస్వామికి పరమేశ్వర ఝలక్:


    ఇక డిప్యూటీ సీఎం పరమేశ్వర వ్యాఖ్యలు కుమారస్వామిని కలవరపెట్టేవిగా ఉన్నాయి. ఐదేళ్ల పాటు కుమారస్వామే సీఎంగా కొనసాగే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన పేర్కొనడం గమనార్హం. జేడీఎస్‌ వద్ద ఏయే మంత్రిత్వ శాఖలు ఉండాలి. కాంగ్రెస్‌కు ఏయే శాఖల బాధ్యతలు ఇస్తారనేదానిపైనా ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని చెప్పారు.

    ఐదేళ్లు జేడీఎస్ కే అవకాశం ఇవ్వాలా? అన్న దానిపై పార్టీతో చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇక ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఓటమికి ఈవీఎంలే కారణమన్నారు పరమేశ్వర. కాంగ్రెస్‌ పార్టీకి 70-80% ఓట్లున్న బూత్‌లలోనూ బీజేపీ మెజారిటీ సాధించడంపై విచారణ జరిపి తీరుతామన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+