వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డ్యాం లీక్ అయితే సుమలతను పడుకోబెట్టాలన్న కుమారస్వామి, సుమలత ఫైర్ .. కేఆర్ఎస్ డ్యాం పై డిష్యూం డిష్యూం

|
Google Oneindia TeluguNews

కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఎంపీ సుమలత పై షాకింగ్ కామెంట్స్ చేశారు. కావేరి నదికి అనుబంధంగా మండ్య జిల్లాలోని కృష్ణ రాజ సాగర్ జలాశయం నుంచి నీరు లీక్ అవుతుంటే అడ్డుగా ఎంపీ సుమలత పడుకోబెట్టాలి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో దుమారం రేపాయి. ఇక దీనిపై సుమలత కూడా రివర్స్ ఎటాక్ చేశారు. ఇప్పుడు వీరిద్దరి మాటల దాడి కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

భారత్ లో గణనీయంగా తగ్గిన కొత్త కేసులు, మరణాలు .. గత 24 గంటల్లో 34,703 కేసులు, 553 మరణాలుభారత్ లో గణనీయంగా తగ్గిన కొత్త కేసులు, మరణాలు .. గత 24 గంటల్లో 34,703 కేసులు, 553 మరణాలు

 కేఆర్ఎస్ డ్యాం పై సుమలత కామెంట్స్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం కుమారస్వామి

కేఆర్ఎస్ డ్యాం పై సుమలత కామెంట్స్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం కుమారస్వామి

కృష్ణ రాజ సాగర్ జలాశయానికి పగుళ్ళు ఏర్పడ్డాయని ఎంపీ సుమలత పలుమార్లు ఆరోపణలు గుప్పించారు. ఎంపీ సుమలత విపత్తు నిర్వహణ కమిటీ కూడా తాను చేసిన వ్యాఖ్యలనే నివేదిక ఇచ్చిందని పేర్కొన్నారు. జలవనరుల శాఖ ముఖ్య ఇంజనీర్ల పర్యవేక్షణలో దీనిపై తనిఖీలు కూడా నిర్వహించి పగుళ్లు లేవని కమిటీ తేల్చి చెప్పింది. దీంతో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ కేవలం ప్రాజెక్టు నుంచి నీరు లీక్ అవుతుందని సుమలత తరచుగా మాట్లాడుతున్నారని, ఆమె జలాశయం రక్షణను పర్యవేక్షిస్తున్నట్లుగా నిత్యం వ్యాఖ్యలు చేయడాన్ని ఎద్దేవా చేస్తూ లీకేజీలు ఆగాలంటే అడ్డంగా పడుకోబెట్టాలని షాకింగ్ కామెంట్స్ చేశారు.

 ఇది ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం : మండిపడిన సుమలత

ఇది ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం : మండిపడిన సుమలత

మండ్యా ప్రజలు గతంలో ఇలాంటి ఎంపీని చూడలేదని, ఇక ముందు ముందు కూడా ఇలాంటి ఎంపీని చూడలేరని ఆయన మండిపడ్డారు. అంతేకాదు ఆమె సానుభూతితో ఎన్నుకోబడింది అని, మళ్లీ మళ్లీ తనకు అవకాశం రాదు కాబట్టి ఆమె తన వ్యక్తిగత ద్వేషంతో ప్రకటనలు చేస్తోందని హెచ్డి కుమారస్వామి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కుమారస్వామి వ్యాఖ్యలపై మండిపడిన జెడిఎస్ నేత సుమలత అంబరీష్ మాజీ సీఎం కుమారస్వామి మాటలు ఆయన మనస్తత్వాన్ని ప్రదర్శిస్తున్నాయని, వ్యక్తిత్వం, సంస్కృతి లేకుండా ఆయన మాట్లాడుతున్నారని, ఆయన ఎటువంటి వారో చెప్పకనే చెబుతున్నారని సుమలత ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాటలు అదుపులో ఉండాలని సుమలత ఫైర్

మాటలు అదుపులో ఉండాలని సుమలత ఫైర్

కుమారస్వామి మహిళలను టార్గెట్ గా చేసుకుని మహిళల పట్ల తన అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు అంటూ సుమలత ఫైర్ అయ్యారు. వ్యక్తిగతంగా ఎవరిపైనా దాడి చేయలేదని పేర్కొన్న సుమలత, కుమారస్వామి ఇది వ్యక్తిగతంగా ఎందుకు తీసుకుంటున్నారో చెప్పాలన్నారు. విమర్శలు చెయ్యొచ్చు కానీ మాట్లాడేటప్పుడు మాటలు అదుపు ఉండాలని ఎంపీ సుమలత పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా కొనసాగిన వ్యక్తి కనీస జ్ఞానం లేకుండా మాట్లాడారని నిప్పులు చెరిగారు. అందుకే ప్రజలు ఎవరికి బుద్ధి చెప్పారో దేశమంతా తెలుస్తోంది అంటూ తిట్టిపోశారు.

Recommended Video

Aamir Khan and Kiran Rao announce divorce, to remain friends and co-parents | Oneindia Telugu
 లీకేజీ జరిగిన చోట ఆయననే పడుకోబెడితే సరి అంటూ ఎదురు దాడి

లీకేజీ జరిగిన చోట ఆయననే పడుకోబెడితే సరి అంటూ ఎదురు దాడి

కె ఆర్ ఎస్ ప్రాజెక్టు సమీపంలో గనుల తవ్వకాల్లో సమస్య ఏర్పడుతోందని, తాను గనులకు వ్యతిరేకం కాదని అక్రమ మైనింగ్ కు వ్యతిరేకమని సుమలత తేల్చిచెప్పారు. లీకేజీ జరిగేచోట ఆయననే పడుకోబెడితే సరిపోతుందన్నారు ఎంపీ సుమలత. కృష్ణ రాజ సాగర్ జలాశయం వ్యవహారంలో సీఎం యడ్యూరప్పను కలిసిన తర్వాత మాజీ సీఎం కుమారస్వామి ఈ వ్యాఖ్యలు చేయగా, కుమారస్వామి వ్యాఖ్యల తర్వాత ఎంపీ సుమలత అంబరీష్ కృష్ణ రాజ సాగర్ రిజర్వాయర్ విషయంలో ముఖ్యమంత్రి యడ్యూరప్పను కలిశారు.

English summary
Former Karnataka CM Kumaraswamy made shocking comments on MP Sumalatha. Controversial remarks were made that MP Sumalatha should lie down if water is leaking from the Krishna Raja Sagar reservoir in Mandya district, which is adjacent to the kaveri river. The remarks made by former CM HD Kumaraswamy have now sparked outrage in Karnataka politics. Sumalatha also made a reverse attack on this. Now the verbal attack between the two has become a hot topic in Karnataka politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X