'కుంభమేళాకు వెళ్లొద్దు.. 300 కి.మీ. ట్రాఫిక్.. 48 గంటలుగా'.. భక్తుడి ఆవేదన
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంగా మహాకుంభమేళాకు పేరుంది. 45 రోజుల పాటు సాగే ఈ ఆధ్యాత్మిక క్రతువులో భాగంగా రోజూ లక్షలాది మంది భక్తలు ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కు చేరుకుంటున్నారు. గంగా- యమునా- సరస్వతి నదుల త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.
అయితే తాజాగా మహా కుంభమేళాలో భక్తుల రద్దీ మరింత తీవ్రంగా మారింది. కుంభమేళాకు వెళ్లే రోడ్లన్నీ జనంతో నిండిపోయాయి. దాదాపు 300 కి.మీ. మేర ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో భక్తులు త్రివేణీ సంగమానికి వెళ్లేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. గత 48 గంటలుగా కుంభమేళాలో ఇదే పరిస్థితి నెలకున్నట్లు సమాచారం.

"ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడం అసాధ్యంగా మారింది. వివిధ జిల్లాల నుంచి ప్రయాగ్ రాజ్ కు వచ్చే వాహనాలను పోలీసులు ఎక్కడికక్కడ నిలిపివేశారు. 200-300 కి.మీ. వరకు ట్రాఫిక్ జామ్ అయింది. ప్రస్తుతం త్రివేణి సంగమానికి వెళ్లడం అసాధ్యం" అని ఓ పోలీస్ అధికారి తెలిపారు. గత 48 గంటలుగా కుంభమేళాలో ట్రాఫిక్ జామ్ ఉందని ప్రతి 50 కిలోమీటర్ల మేర రోడ్డు క్లియర్ చేయడానికి 10-12 గంటల సమయం పడుతోంది.
प्रयागराज शहर और महाकुंभ मेला क्षेत्र के सभी 'एंट्री प्वाइंट' बंद कर दिए गए हैं. शासन-प्रशासन की बदइंतजामी की एक और तस्वीर.#MahaKumbh2025 pic.twitter.com/rBXFSPhftY
— Dr. Laxman Yadav (@DrLaxman_Yadav) February 9, 2025
వృద్ధులు, మహిళలు, చిన్నారులు 48 గంటలుగా ట్రాఫిక్ లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భక్తుల రద్దీ కారణంగా ప్రయాగ్ రాజ్ స్టేషన్ ను కూడా అధికారులు మూసేశారు. మహా కుంభమేళా కు రావొద్దని.. మహిళలు, చిన్నారులు ఇక్కడకు రాకపోవడమే మంచిదని ఓ భక్తుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈరోజు మొత్తం 46 లక్షలమంది భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 44 కోట్ల మంది భక్తులు కుంభమేళాను సందర్శించినట్లు వివరించారు.
प्रयागराज जाने वालो श्रद्धालुओं की 200 km दूरी की तस्वीर...#Mahakumbh2025 #KumbhMela #SpiritualJourney #FaithInMillions #GangaSnan #HolyDip #Prayagraj #Devotion #HinduPilgrimage #MassGathering pic.twitter.com/RraWKEDUID
— IAN24 (@ian24news) February 10, 2025












Click it and Unblock the Notifications