వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎల్ఏసీ వెంట బలగాల పూర్తి ఉపసంహరణ: మరోసారి భారత్-చైనా చర్చలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/బీజింగ్: వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట అన్ని ఫ్రిక్షన్ పాయింట్లలో నుంచి ఇరు దేశాల దళాలను దశలవారీగా పూర్తిగా వెనక్కి రప్పించేందుకు భారత్, చైనా అంగీకరించాయి. ఈ మేరకు చర్చలు జరిపేందుకు శుక్రవారం ఇరుదేశాలు సుముఖత వ్యక్తం చేశాయి. సాధ్యమైనంత త్వరలోనే దళాలను వెనక్కి రప్పించాలని ఆకాంక్షించాయి.

Recommended Video

India-China Stand Off:ఇరు దేశాల దళాలను దశలవారీగా పూర్తిగా వెనక్కి రప్పించేందుకు India,China అంగీకారం

భారత్, చైనా తరపున ఇరుపక్షాల మిలిటరీ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరిపారు. దళాలను ఉపసంహరించుకోవడంతోపాటు ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందాలను ఖచ్చితంగా పాటించాలని భారత విదేశీ మంత్రిత్వ శాఖ చైనాకు స్పష్టం చేసింది. ఫ్రేమ్‌వర్క్ ఆఫ్ వర్కింగ్ మెకానిజమ్ ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్(డబ్ల్యూఎంసీసీ) ఆధ్వర్యంలో భారత్-చైనా సరిహద్దు వ్యవహారాలపై చర్చలు జరిగాయి.

LAC standoff: India, China resume diplomatic talks, agree to work towards complete disengagement

చివరిసారి సెప్టెంబర్ 30న సరిహద్దు పరిస్థితులపై ఇరు దేశాల మధ్య ఎంసీసీ చర్చలు జరిగాయి. మే నుంచి సరిహద్దులో ఇరుదేశాల దళాలు మోహరించిన విషయం తెలిసిందే. ఎల్ఏసీ వెండి అన్ని ఫ్రిక్షన్ పాయింట్లలో కూడా దళాలను ఉపసంహరించుకోవాలని భారత్ స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ అంశంపై అక్టోబర్ 12, నవంబర్ 6న ఇరు దేశాల మధ్య చర్చలు జరగాయని భారత విదేశాంగ శాఖ గుర్తు చేసింది.

సరిహద్దులో శాంతి పరిస్థితులు నెలకొనేందుకు ఇరుదేశాలు కూడా అంగీకరించాయని వెల్లడించింది. సరిహద్దులో ఘర్షణ వాతావరణం నేపథ్యంలో భారత్, చైనాలు భారీ ఎత్తున బలగాలను మోహరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బలగాలను ఉపసంహరించుకుని సరిహద్దులో శాంతి పరిస్థితులను తిరిగి నెలకొల్పాలని భారత్ ప్రయత్నిస్తోంది. చైనా ఇందుకు అంగీకరిస్తున్నట్లు చెబుతున్నప్పటికీ.. ఆ దిశగా ముందుకు కదలడం లేదు.

సరిహద్దులో శాంతి పరిస్థితులు నెలకొల్పేందుకు భారత్ తోపాటు తాము కూడా సహకరిస్తామని చైనా చెప్పిందని ఆ దేశ అధికార వర్గాలు తెలిపాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ వెల్లడించారు. ప్రస్తుతం జరిగే చర్చలు శాంతియుత పరిస్థితులు నెలకొల్పేందుకు మరింతగా సహకరిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

English summary
Resuming diplomatic talks on their military standoff, India and China on Friday agreed to continue working towards ensuring complete disengagement of troops in all friction points along the Line of Actual Control (LAC) in eastern Ladakh at the earliest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X