రైళ్ల దహనాల వెనుక షాకింగ్ కారణాలు-ఉద్యోగాల్లేక యువతలో అసహనం-పట్టించుకోని ప్రభుత్వాలు
దేశవ్యాప్తంగా గత రెండు రోజులుగా కేంద్రం తీసుకొస్తున్న అగ్నిపథ్ ఆర్మీ రిక్రూట్ మెంట్ పథకాన్ని నిరసిస్తూ నిరుద్యోగులు రోడ్డెక్కుతున్నారు. ఉద్యోగల భద్రత ఉంటుందని భావించే కేంద్ర ప్రభుత్వాల ఉద్యోగాలే కాంట్రాక్టు ఉద్యోగాల్లో తాత్కాలికంగా మారిపోతున్న వేళ నిరుద్యోగుల్లో ఆగ్రహం పెరుగుతోంది. దాని ఫలితంగా ఏకంగా కేసుల్ని కూడా లెక్కచేయకుండా రైళ్ల దహనాలు యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. దీంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.

దేశవ్యాప్తంగా రైళ్ల దహనాలు
దేశవ్యాప్తంగా రైళ్ల దహనాల ఘటనలు పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా బీహార్, యూపీతో పాటు తెలంగాణ వంటి రాష్ట్రాల్లోనూ రైళ్ల దహనాల ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో రైల్వే శాఖ అప్రమత్తమవుతోంది. మిగతా రైల్వే స్టేషన్లలోనూ భద్రత పెంచుతోంది. ఇప్పటికే చోటు చేసుకున్న ఘటనలపై విచారణ జరుపుతోంది. కట్టుదిట్టమైన భద్రత ఉంటే రైల్వేస్టేషన్లలో ఆందోళనకారులు చాలా చులువుగా చొచ్చుకుని వచ్చి రైళ్లను తగులబెడుతున్న వైనం రైల్వేశాఖకు ఇబ్బందికరంగా మారిపోతోంది. దీంతో ఈ ఘటనల వెనుక నిర్దిష్ట కారణాలు తెలుసుకునే పనిలో రైల్వే వర్గాలు నిమగ్నమై ఉన్నాయి.

రైళ్ల దహనాల వెనుక ?
ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకూ చూస్తే పలు రైళ్లు దహనమయ్యాయి. ఈ వరుస రైళ్ల దహనాల వెనుక పెరుగుతున్న నిరుద్యోగం ఓ బలమైన కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా దేశంలో కోవిడ్ తర్వాత పెరిగిన నిరుద్యోగిత యువతను కలవరపెడుతోంది. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గతంలోలా ఉద్యోగాలు ఇచ్చే పరిస్ధితుల్లో లేవు. దీంతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం యువత తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. స్ధిరత్వం లేని ప్రైవేటు ఉద్యోగాల కంటే ప్రభుత్వ ఉద్యోగాలే నయమని వాటి కోసం ఎదురుచూస్తుంటే ప్రభుత్వాలు నిరుద్యోగుల్ని నిరాశ పరుస్తున్నాయి. దీంతో వారిలో పెరుగుతున్న అసహనమే రైళ్ల దహనాలకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది.

నిలిచిన రైల్వే రిక్రూట్ మెంట్లు
కోవిడ్ సమస్య ప్రారంభమైన తర్వాత దేశంలో కొత్త ఉద్యోగాల సంగతే అందరూ మర్చిపోయారు. ఉన్న ఉద్యోగం కాపాడుకుంటే చాలనే పరిస్దితికి వచ్చేశారు. మరి నిరుద్యోగులు అలా ఉండలేకపోతున్నారు. వీరు కొన్నేళ్లుగా రైల్వే రిక్రూట్ మెంట్ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. మరి వారిని ప్రభుత్వాలు కరుణించడం లేదు. కరోనా సమస్యలతో రైల్వే రిక్రూట్ మెంట్లు నిలిచిపోయాయి. మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతాయో కూడా తెలియని పరిస్ధితి. దీంతో వీటినే నమ్ముకున్న యువతలో అసహనం పెరుగుతోంది. ఇది రైళ్లు తగులబెట్టే స్ధాయికి చేరిపోతోంది.

యువతలో పెరుగుతున్న అసహనం
రైల్వే రిక్రూట్ మెంట్ కోసం రైల్వే బోర్డు గతంలో జారీ చేసిన నోటిఫికేషన్ లో 35281 ఉద్యోగాలు ఉంటే వాటి కోసం 1.25 కోట్ల మంది అభ్యర్ధులు పరీక్షలు రాశారు. ప్రస్తుత లెక్కల ప్రకారం చూస్తే భారత్ లో 2030 నాటికి 90 మిలియన్ల కొత్త ఉద్యోగాలు అవసరమవుతాయి. కానీ ప్రభుత్వాల తీరు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. తాజాగా కేంద్రం ప్రకటించిన 10 లక్షల ఉద్యోగాల భర్తీకి 18 నెలలు తీసుకుంటోంది. ఇక 90 కోట్ల ఉద్యోగాలు కల్పించడం ప్రభుత్వానికి సాధ్యమేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సరిగ్గా ఇలాంటి పరిస్ధితులే దేశంలోని యువతలో అసహనం పెంచుతున్నాయి. ఈ అసహనం కాస్తా రైళ్ల దహనం వంటి హింసాత్మక ఘటనలకు దారి తీసేలా చేస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఉద్యోగాల కల్పనపై దృష్టిపెడితే ఇలాంటి హింసాత్మక పద్ధతుల నుంచి యువతను దారి మళ్లించే అవకాశం ఉంటుంది.
-
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!











Click it and Unblock the Notifications