లడఖ్: ప్యాంగాంగ్ సరస్సుపై చైనా వంతెన నిర్మాణం, ఇది1950లో ఆక్రమించిన ప్రాంతం

లడఖ్: చైనా తన కుట్రలను కొనసాగిస్తోంది. కైలాస్ రేంజి పర్వత శిఖరాన్ని భారత్ ఆక్రమించుకొని ప్యాంగాంగ్ సరస్సు అవతలి వరకు తరిమికొట్టిననాటి నుంచి చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. తాజాగా, ప్యాంగాంగ్ సరస్సులో చైనా భూభాగం(1950లో చైనా ఆక్రమించుకున్న ప్రాంతం) వైపు ఓ బ్రిడ్జిని నిర్మాణం చేపట్టినట్లు కొన్ని మీడియాల్లో వార్తలు వచ్చాయి.

ప్యాంగాంగ్ సరస్సులో చైనా ఆధీనంలోని ఖురాంక్ ప్రాంతంలో ఈ నిర్మాణం చేపట్టింది. ఖురాంక్ నుంచి సరస్సు దక్షిణ సరిహద్దుకు చేరుకునేందుకు ఈ నిర్మాణం జరుగుతోంది. ఇది పూర్తయితే చైనా దళాలు 180 కిలోమీటర్లు చుట్టు తిరిగి రావాల్సిన అవసరం తప్పనుంది. ఖురాంక్ నుంచి రుడాంక్‌కు దాదాపు 50 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ దూరం 200 కిలోమీటర్లకు పైగా ఉంటుంది.

Ladakh: China Building Bridge Over Pangong Lake In Territory It Occupied In 1950s

దాదాపు 130 కిలోమీటర్లు పొడవున్న ప్యాంగాంగ్ సరస్సులో కొంత భాగం టిబెట్‌లో ఉండగా.. మరికొంత భాగం లడఖ్ ప్రాంతంలో ఉంది. భారత్ 2020 ఆగస్టులో కైలాశ్ రేంజిపై ఆపరేషన్ చేపట్టాక చైనా సైన్యం వెంటనే స్పందించి ప్రతిఘటన చేయలేకపోయింది. ఫలితంగా భారత దళాలు అక్కడ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించాయి. చైనా దళాలు అక్కడకు చేరుకోవడానికి కనీసం 24 గంటలకుపైగా సమయం పట్టింది.

ఈ నేపథ్యంలోనే చైనా ఆ ప్రాంతంలో భారత దళాలు నిర్వహించే ఆపరేషన్లను అడ్డుకోవడానికి వివిధ రకాల మార్గాలను అభివృద్ధి చేస్తోంది. 2021లో ఈ ప్రదేశంలో రహదారుల నిర్మాణం చేపట్టింది. 2020 ఆగస్టు 29-30 అర్ధరాత్రి భారత్ కైలాశ్ రేంజి స్వాధనం ఆపరేషన్ మొదలైంది. వేర్వేరు ప్రదేశాల్లో ఉన్న దళాలు, ఆయుధాలు, ఇతర వనరులు ఒక దగ్గరకు చేరాయి. ఈ దళాలు మెరుగు వేగంతో కైలాస్ రేంజీగా పేరున్న ప్యాంగాంగ్ సరస్సు దక్షిణ భాగంలోని శిఖరాలను స్వాధీనం చేసుకున్నాయి.

ఆగస్టు చివరి వరకు ఈ శిఖరాలు భారత్, చైనాల ఆధీనంలో లేవు. వీటిల్లో రెచిన్ లా, రజాంగ్ లా శిఖరాలు ఉన్నాయి. ఇవన్నీ స్వంగూర్ గ్యాప్ ప్రాంతంపై భారత్ కు పట్టుపెంచాయి. కాగా, చైనా స్థావరాలు ఉన్న మాల్డో గారిసన్ పై ఈ శిఖరాల నుంచి గురిపెట్టవచ్చు. కీలక శిఖరాలు భారత్ ఆధీనంలోకి రావడంతో చైనా ఆధిపత్యానికి తెరపడింది. ఈ క్రమంలోనే తమ దళాలను వేగంగా తరలించేందుకు చైనా వంతెన నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+