వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శబరిమలలో మరో కొత్త వివాదం. ఇప్పుడు ట్రాన్స్ జండర్ల వంతు

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ / తిరువనంతపురం: ఇప్పుడు అక్క‌డ మ‌గాళ్లు, ఆడాళ్ల వంతు ఐపోయింది. మ‌గ‌వాళ్ల‌తో స‌మానంగా ఆడాళ్లుకూడా శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప‌ను ద‌ర్శించుకోనుండ‌గా.. తాజాడా మాడాల‌కు కూడా ద‌ర్శ‌న బాగ్యం క‌లిగిస్తున్నారు అదికారులు. అయితే వారు ఏ రూపంలో ఆల‌యంలోకి వెళ్లాల‌న్న అంశం పై సందిగ్ద‌త నెల‌కొంది. ఆడ వారిలా చీర క‌ట్టుకోవాలా, లేక మ‌గ‌వారిలా పంచ‌క‌ట్టుకోవాలా అన్న అంశం పై అదికారుల్లో స్ప‌ష్ట‌త కొర‌వ‌డిన‌ట్టు తెలుస్తోంది. దీంతో ట్రాన్స్ జెండ‌ర్ల‌కు ఆల‌యంలో ప్ర‌వేశించేందుకు అనుమ‌తులు ల‌బించినా దేవుడి ద‌ర్శ‌న భాగ్యం మాత్రం ఇంకా క‌ల‌గ‌లేదు.

శ‌బ‌రిమ‌ల‌కు ఇక‌నుండి ట్రాన్స్‌జెండర్లు..! అంద‌రితో స‌మానంగానే ద‌ర్శ‌నం..!!

శ‌బ‌రిమ‌ల‌కు ఇక‌నుండి ట్రాన్స్‌జెండర్లు..! అంద‌రితో స‌మానంగానే ద‌ర్శ‌నం..!!

శబరిమల ఆలయంలోకి ట్రాన్స్‌జెండర్లు ప్రవేశించేందుకు అనుమతి లభించింది. ఐన‌ప్ప‌టికి గుడిలోకి ప్రవేశించడం ప‌ట్ల వారిని పోలీసులు అడ్డుకున్నట్టు తెలుస్తోంది. తొలుత పురుషుల్లా వస్త్రధారణ చేసుకోవాలని చెప్పిన పోలీసులు.. తర్వాత ట్రాన్స్‌జెండర్లను పూర్తిగా అనుమతించలేదు. దీన్ని సవాలు చేస్తూ నలుగురు ట్రాన్స్‌జెండర్ల బృందం.. భక్తుల సమస్యలపై కేరళ హైకోర్టు నియమించిన పోలీసు ఉన్నతాధికారులను కలిసింది. తాము ఆలయంలోకి సంప్రదాయబద్ధంగా చీర కట్టుకొనే ప్రవేశిస్తామని డీజీపీ హేమచంద్రన్‌కు చెప్పినట్లు ట్రాన్స్‌జెండర్లలో ఒకరైన అనన్య తెలిపారు. ‘‘ఇతర కమిటీ సభ్యులతో చర్చించి ఆలయ ప్రవేశం గురించి చెబుతానని డీజీపీ చెప్పిన‌ట్టు స‌మాచారం. కొంత సేపటికి త‌మ‌కు అనుమతినిస్తున్నట్లు చెప్పారు.

 ఏ రూపంలో రావాల‌న్న‌దే ఉత్కంఠ‌..! పంచ క‌ట్టా...? చీర క‌ట్టా..?

ఏ రూపంలో రావాల‌న్న‌దే ఉత్కంఠ‌..! పంచ క‌ట్టా...? చీర క‌ట్టా..?

త్వరలోనే తాము ఆలయ ప్రవేశం చేసి, స్వామి వారిని దర్శించుకోవాలనుకుంటున్నాం. అవసరమైతే పోలీసులు రక్షణ కూడా కల్పిస్తామని చెప్పారని ట్రాన్స్‌జెండర్‌ అనన్య వెల్లడించారు. ఆలయంలోకి ప్రవేశించేందుకు తాము చేసిన పోరాటం ఫలించిందని, ఇప్పుడు తమకు ఆనందంగా ఉందని అనన్య తెలిపారు. ఇక నుంచి ట్రాన్స్‌జెండర్లు ఎవరైనా సులభంగా ఆలయంలోకి ప్రవేశించవచ్చని ఆమె అన్నారు.

కిక్కిరిసి పోనున్న శ‌బ‌రి..! ఇప్ప‌టికే భ‌క్తులతో పోటెత్తుతున్న ఆల‌యం..!!

కిక్కిరిసి పోనున్న శ‌బ‌రి..! ఇప్ప‌టికే భ‌క్తులతో పోటెత్తుతున్న ఆల‌యం..!!

ఎర్నాకుళం నుంచి వచ్చిన నలుగురు ట్రాన్స్‌జెండర్లు శబరిమల ఆలయానికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. మొదటి బేస్‌ క్యాంప్‌ అయిన ఎరుమేలి వద్దే పోలీసులు అడ్డుకున్నారు. పురుషుల వస్త్రధారణ ఉండాలని తేల్చి చెప్పారు. దీంతో వెంటనే వారు కొట్టాయం ఎస్పీని కలిసి, పోలీసులు తమను హేళన చేశారని ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి తిరువనంతపురం వెళ్లి డీజీపీని కలిశారు.

ఆల‌యంలో ఉత్కంఠ ప‌రిస్థితులు..! ఐనా వెన‌క్కు త‌గ్గేది లేదంటున్న భ‌క్తులు..!!

ఆల‌యంలో ఉత్కంఠ ప‌రిస్థితులు..! ఐనా వెన‌క్కు త‌గ్గేది లేదంటున్న భ‌క్తులు..!!

శబరిమల ఆలయానికి వస్తున్న భక్తుల నుంచి పోలీసులపై అనేక ఫిర్యాదులు అందిన నేపథ్యంలో.. కేరళ హైకోర్టు నవంబరు 27న పర్యవేక్షక ప్యానల్‌ను నియమించింది. ఇందులో డీజీపీ హేమచంద్రన్‌ సహా విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తులు ఎస్‌.సిరిజగన్‌, పీఆర్‌ రామన్‌ ఉన్నారు. అన్ని వయసుల మహిళలను ఆలయంలోకి అనుమతించాలన్న సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో సెప్టెంబరు 28 నుంచి శబరిమల ఆలయం భక్తుల నిరసనలతో హోరెత్తుతున్న సంగతి తెలిసిందే.

English summary
Transgenders were allowed to enter the Sabarimala temple. However, the police have blocked them from entering the temple. The police who first told them to wear the male clothes were not allowed .. then the transgenders were not fully permitted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X