Lady doctor: విస్మయా కేసులో సంచలన నిర్ణయం, భర్త ఉద్యోగం శాస్వతంగా, చరిత్రలో ఫస్ట్ టైమ్ !
కొచ్చి/చెన్నై: ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న యువకుడిని పెళ్లి చేసుకుంటే తాను జీవితాంతం సుఖంగా ఉంటానని లేడీ డాక్టర్ బావించింది. ఆర్ టీఓ ఉద్యోగం చేస్తున్న యువకుడిని పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులు చెప్పడంతో లేడీ డాక్టర్ ఓకే చెప్పింది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో పెళ్లి గ్రాండ్ గా జరిగింది. భర్తతో కాపురం చేసుకుని సంతోషంగా ఉందామని అత్తారింటిలో అడుగు పెట్టిన లేడీ డాక్టర్ కు తారువాత సినిమా కనపడింది. భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులు లేడీ డాక్టర్ కు ప్రత్యక్ష నరకం చూపించారు. చెప్పిన వరకట్నం ఇంత వరకు ఎందుకు తీసుకురాలేదు అంటూ భర్తతో పాటు ఆమె కుటుంబ సభ్యులు టార్చర్ పెట్టడంతో లేడీ డాక్టర్ తట్టుకోలేకపోయింది. చాలా కాలం భర్త టార్చర్ తట్టుకుని సర్దుకుపోదామని అనుకున్న లేడీ డాక్టర్ చివరికి ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయ్యింది. తన భర్త తనను ఎలా టార్చర్ పెడుతున్నాడో అనే పూర్తి విషయాలు, ఫోటోలను వాట్సాప్ లో తల్లిదండ్రులకు పంపించిన లేడీ డాక్టర్ బాత్ రూమ్ లో ఆత్మహత్య చేసుకునింది. భార్యను టార్చర్ పెట్టి ఆమె ఆత్మహత్యకు కారణం అయిన భర్త అరెస్టు అయ్యాడు. లేడీ డాక్టర్ ఆత్మహత్యకు కారణం అయిన భర్తను ప్రభుత్వ ఉద్యోగం నుంచి శాస్వతంగా తొలగించారు. రాష్ట్ర చరిత్రలోనే వరకట్నం వేధింపుల కేసులో ఒక ప్రభుత్వ అధికారిని శాస్వతంగా ఉద్యోగం నుంచి తప్పించడం ఇదే మొదటిసారి కావడం హాట్ టాపిక్ అయ్యింది.

అసిస్టెంట్ ఆర్ టీఓ
కేరళలోని కొల్లాంలో నివాసం ఉంటున్న ఎస్ వి. విస్మయా నాయర్ (24) అనే యువతి ఆయుర్వేదిక డాక్టర్. కొల్లాంలోనే రవాణా శాఖలో అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్ పెక్టర్ గా (ఆర్ టీఓ)గా ఉద్యోగం చేస్తున్న కిరణ్ కుమార్ (30) తో విస్మయా నాయార్ వివాహం చెయ్యాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.

గ్రాండ్ గా పెళ్లి
ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న కిరణ్ ను పెళ్లి చేసుకుంటే తాను జీవితాంతం సుఖంగా ఉంటానని లేడీ డాక్టర్ విస్మయా నాయర్ బావించింది. ఆర్ టీఓ ఉద్యోగం చేస్తున్న కిరణ్ కుమార్ ను పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులు చెప్పడంతో లేడీ డాక్టర్ విస్మయా నాయర్ ఓకే చెప్పింది. 2020 జూన్ నెలలో కొల్లాంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో పెళ్లి గ్రాండ్ గా జరిగింది.

అత్తారింటిలో ప్రత్యక్ష నరకం
వివాహం జరిగిన తరువాత రెండు మూడు నెలలు విస్మయా నాయర్ తో ఆమె భర్త కిరణ్ సంతోషంగానే ఉన్నాడు. భర్త కిరణ్ తో కాపురం చేసుకుని సంతోషంగా ఉందామని అత్తారింటిలో అడుగు పెట్టిన లేడీ డాక్టర్ విస్మయాకు మూడు నెలల తారువాత సినిమా కనపడింది. భర్త కిరణ్ తో పాటు అతని కుటుంబ సభ్యులు లేడీ డాక్టర్ విస్మయాకు ప్రత్యక్ష నరకం చూపించారు.

800 గ్రాముల బంగారు, కారు, 10 లక్షల క్యాష్
విస్మయా నాయర్ కు పెళ్లి చేసిన సందర్బంలో ఆమె తండ్రి త్రివిక్రమన్ నాయార్ కట్నం కింద పెళ్లి కొడుకు కిరణ్ కు 800 గ్రాముల బంగారు నగలు, కొత్త కారు, రూ. 10 లక్షల నగదు ఇచ్చారు. అయితే తరువాత తనకు మరొ కొత్త కారు కావాలని, లేదంటే రూ. 10 లక్షలు ఇవ్వాలని, ముందుగా చెప్పిన వరకట్నం తీసుకురాలేదని భర్త కిరణ్ తో పాటు ఆమె కుటుంబ సభ్యులు టార్చర్ పెట్టడంతో లేడీ డాక్టర్ విస్మయా నాయర్ తట్టుకోలేకపోయింది.

ఫోటోలు షేర్ చేసి బాత్ రూమ్ లో శవమైన విస్మయా
కొంతకాలం పుట్టింటిలో ఉన్న విస్మయా నాయర్ తరువాత పెద్దలు రాజీ పంచాయితీలు చెయ్యడంతో ఆమె భర్త కిరణ్ ఇంటికి వెళ్లిపోయింది. చాలా కాలం భర్త కిరణ్ టార్చర్ తట్టుకుని సర్దుకుపోదామని అనుకున్న లేడీ డాక్టర్ విస్మయా నాయర్ చివరికి ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయ్యింది. తన భర్త కిరణ్ తనను ఎలా టార్చర్ పెడుతున్నాడో అనే పూర్తి సమాచారంతో పాటు కొన్ని ఫోటోలు వాట్సాప్ లో తల్లిదండ్రులు, సోదరుడికి పంపించిన లేడీ డాక్టర్ విస్మయా 2021 జూన్ 24వ తేదీన భర్త కిరణ్ ఇంటిలోని బాత్ రూమ్ లో ఆత్మహత్య చేసుకుంది.

సీఎం సీరియస్
లేడీ డాక్టర్ విస్మయా నాయర్ ఆత్మహత్య చేసుకోవడం కేరళను కుదిపేసింది. విస్మయా ఆత్మహత్యకు కారణం అయిన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని, ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరణమని కేరళ సీఎం పినరయి విజయన్ అప్పట్లో విచారం వ్యక్తం చేశారు. కిరణ్ ను వెంటనే ఆరెస్టు చెయ్యాలని కేరళ సీఎం పినరయి విజయన్ పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

కేరళను కుదిపేసింది
విస్మయా భర్త కిరణ్ ప్రభుత్వ అధికారి కావడంతో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావడంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. కేసు విచారణకు 45 రోజులు గడువు ఇచ్చి వెంటనే విచారణ పూర్తి చెయ్యాలని కేరళ రవాణా శాఖా మంత్రి ఆంటోని రాజు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు 6వ తేదీ శుక్రవారంతో కేరళ ప్రభుత్వం ఇచ్చిన గడువు పూర్తి అయ్యింది.

శాస్వతంగా ఉద్యోగం ఊడిపోయింది
భార్య విస్మయా నాయర్ ను టార్చర్ పెట్టి ఆమె ఆత్మహత్యకు కారణం అయిన భర్త కిరణ్ అరెస్టు అయ్యి జైలుపాలైనాడు. లేడీ డాక్టర్ విస్మయా ఆత్మహత్యకు కారణం అయిన ఆమె భర్త కిరణ్ నేరం చేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. కిరణ్ బ్యాంకు ఖాతాలను పరిశీలిచండంతో అతను ఆర్ టీఓ ఉద్యోగం అడ్డం పెట్టుకుని అక్రమంగా డబ్బులు సంపాధించాడని వెలుగు చూసింది. కిరణ్ ను ప్రభుత్వ ఉద్యోగం నుంచి శాస్వతంగా తొలగించామని కేరళ రవాణా శాఖా మంత్రి ఆంటోని రాజు మీడియాకు చెప్పారు.

కేరళ చరిత్రలో మొదటి సారి
కేరళ రాష్ట్ర చరిత్రలోనే వరకట్నం వేధింపుల కేసులో అరెస్టు అయిన ప్రభుత్వ అధికారిని శాస్వతంగా ఉద్యోగం నుంచి తప్పించడం ఇదే మొదటిసారి అని ఆ రాష్ట్ర రవాణా శాఖా మంత్రి ఆంటోని రాజు అన్నారు. కిరణ్ ను అరెస్టు చేసి జైలుకు పంపించడమే కాకుండా అతన్ని ఉద్యోగం నుంచి తప్పించడంతో తన కూతురు విస్మయా ఆత్మ శాంతిస్తుందని ఆమె తండ్రి త్రివిక్రమన్ నాయర్ అన్నారు. కిరణ్ ను ప్రభుత్వ ఉద్యోగం నుంచి శాస్వతంగా తప్పించినట్లు ప్రకటించి చెప్పిన మాట నిలబెట్టుకున్న కేరళ మంత్రి ఆంటోని రాజు తరువాత విస్మయా నాయర్ ఇంటికి చేరుకుని ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications