మహిళా ఎగ్జిక్యూటివ్‌పై పిజి యజమాని రేప్

గుర్గావ్: ఓ బహుళ జాతి సంస్థ (ఎంఎన్సీ)లో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న 21 ఏళ్ల వయస్సు గల మహిళపై ఓ పేయింగ్ గేస్ట్ హౌస్ యజమాని అత్యాచారం చేశాడు. హర్యానాలోని గుర్గావ్‌ సెక్టార్ -39లో శుక్రవారం రాత్రి ఆ ఘటన జరిగింది.

దానిపై బాధితురాలు శనివారం గుర్గావ్ మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పంజాబ్‌లోని లూథియానాకు చెందిన ఆమె గత కొన్ని నెలలుగా ఓ పెయింగ్ గెస్ట్ హౌస్‌ యజమాని ఇంట్లో ఉంటోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి యజమాని ధర్మవీర్ థాక్రాన్ తన గదిలోకి బలవంతంగా ప్రవేశించి అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది.

Gurgaon

ఆ విషయాన్ని పోలీసులకు చెప్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా అతను హెచ్చరించినట్లు తన ఫిర్యాదులో తెలిపింది. ఈ విషయాన్ని తాను తొలుత మిత్రులతో పంచుకున్నానని వారిచ్చిన ధైర్యంతో పోలీసులను ఆశ్రయించానని చెప్పింది.

ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ధర్మవీర్ పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+