'ఒకట్రెండు రోజుల్లో నిన్ను గ్యాంగ్ రేప్ చేస్తాం'
ముంబై: ఓ మహిళా జర్నలిస్టుకు దారుణమైన హెచ్చరిక వచ్చింది. ఒకటి రెండు రోజుల్లో నిన్ను గ్యాంగ్ రేప్ చేస్తామటూ ఓ మహిళా జర్నలిస్టును ఓ వ్యక్తి ట్విట్టర్‌లో హెచ్చరించాడు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ముంబై పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.
అమరేందర్ సింగ్ అనే ట్విట్టర్ ఖాతాదారుడు ఆ హెచ్చరిక చేశాడు. జెఎన్‌యూ వివాదం నేపథ్యంలో ఢిల్లీ పాటియాలా కోర్టులో మీడియా ప్రతినిధులపై దాడిని ఖండిస్తూ ముంబైలో విలేకరులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ఆందోళనలో పాల్గొన్న ఫొటోలను ఓ మహిళా జర్నలిస్టు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.

దీంతో ఆమెను ఉద్దేశించి అమరేందర్ సింగ్ బెదిరింపులకు దిగాడు. ఒకటిరెండు రోజుల్లో నిపై తీవ్రమైన గ్యాంగ్ రేప్ జరుగుతుంది, స్పృహలోకి రండి, భారత మాతతో చెలగాటమాడకండి అంటూ అతను ట్వీట్ చేశాడు. దీనిపై బాధితురాలు పోలీసులు ఆశ్రయించారు.
దుండగుడిపై పోలీసులు ఐపిసి సెక్షన్లు 354 (ఎ)1 (అమర్యాదకరంగా వ్యవహరించడం), 509 (మహిళలను అవమానించే చర్యలకు పాల్పడడం), 506 (నేరపూరిత ఉద్దేశం) కింద ఆజాద్ మైదాన్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేయలేదు.












Click it and Unblock the Notifications