Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Rs.500 crores: అంకుల్ మొగుడు, శ్యామ్ రెడ్డి ప్రియుడు, ఆస్తి కోసం సిద్దార్థ్ ?, తిరుపతి, నెల్లూరు !

బెంగళూరు/ తిరుపతి/ నెల్లూరు: మాజీ సీఎం మేనల్లుడు, రూ. 500 కోట్లకు ఏకైక వారసుడు సిద్దార్థ్ పక్కా ప్లాన్ తో హత్యకు గురైనాడు. సిద్దార్థ్ తండ్రిని రెండో పెళ్లి చేసుకున్న ఇందు పిన్నీ, శ్యామ్ రెడ్డి, కిరణ్ తదితరులు కలిసి మాజీ సీఎం మేనల్లుడు సిద్దార్థ్ ను నెల్లూరులో చంపేశారని ఆరోపణలు ఉన్నాయి. తిరుపతిలో శ్యామ్ రెడ్డి ఆత్మహత్మ చేసుకున్నాడు. ఇందు మేడమ్ ఇప్పటికే అరెస్టు అయ్యింది. కిరణ్ మాయం అయిపోయాడు. సిద్దార్థ్ తండ్రి తిక్కతిక్క సమాధానాలు చెప్పడంతో ఏం చెయ్యాలో తెలీక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.

 మాజీ సీఎం మేనల్లుడు

మాజీ సీఎం మేనల్లుడు

కర్ణాటక మాజీ సీఎం ధర్మసింగ్ సమీప బంధువు దేవేంద్ర సింగ్. దేవేంద్ర సింగ్ ప్రముఖ వ్యాపారవేత్త. కర్ణాటకలోని కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వంలో ధర్మసింగ్ ముఖ్యమంత్రిగా పని చేశారు. ప్రస్తుతం రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు (కాంగ్రెస్) మల్లిఖార్జున్ ఖార్గేకి మాజీ సీఎం ధర్మసింగ్ ప్రాణ స్నేహితుడు. మాజీ సీఎం ధర్మసింగ్ మేనల్లుడు సిద్దార్థ్ సింగ్.

 తండ్రి లవ్ మ్యారేజ్

తండ్రి లవ్ మ్యారేజ్

సిద్దార్థ్ సింగ్ యువకుడు. పెళ్లి వయసుకు వచ్చిన సిద్దార్థ సింగ్ అమెరికాతో పాటు విదేశాలు తిరుగుతూ కాలం గడుపుతున్నాడు. సిద్దార్థ్ సింగ్ తండ్రి దేవేంద్ర సింగ్ ఇందు చౌహ్హాన్ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దేవేంద్ర సింగ్, ఇందు చౌహ్హాన్ కు వయసులో నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అయితే డబ్బు పలుకుబడిని చూసిన ఇందు చౌహ్హాన్ పెళ్లి వయసు వచ్చిన కొడుకు ఉన్న దేవేంద్ర సింగ్ ను పెళ్లి చేసుకుందని సమాచారం.

 మాయం అయిన సిద్దార్థ్ సింగ్

మాయం అయిన సిద్దార్థ్ సింగ్

ఇటీవల సిద్దార్థ్ సింగ్ కనపడటం లేదని అతని కుటుంబ సభ్యులు బెంగళూరులోని అమృతహళ్ళి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తాను అమెరికాలో ఉన్న స్నేహితులను కలవడానికి విదేశాలకు వెలుతున్నానని సిద్దార్థ్ సింగ్ అతని మొబైల్ నుంచి అతని కుటుంబ సభ్యులకు మెసేజ్ పంపించాడు. అయితే అక్కడే ఓ ట్విస్ట్ ఉంది.

 అసలు ఏం జరిగింది ?

అసలు ఏం జరిగింది ?

సిద్దార్థ్ సింగ్ కనపడటం లేదని అతని కుటుంబ సభ్యులు కేసు పెట్టిన తరువాత అతని మొబైల్ నుంచి అతని కుటుంబ సభ్యులకు మెసేజ్ వెళ్లిందని, తాను అమెరికాలో ఉన్న స్నేహితులను కలవడానికి వెలుతున్నానని సిద్దార్థ్ సింగ్ మొబైల్ నుంచి కుటుంబ సభ్యులకు చివరి మెసేజ్ వెళ్లిందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. ఇదే సమయంలో సిద్దార్థ్ సింగ్ ఎక్కడికి వెళ్లాడు ?, అతను ఏమయ్యాడు ? అంటూ పోలీసులు విచారణ చేశారు.

 సిద్దార్థ్ సింగ్ దారుణ హత్య.... నెల్లూరులో !

సిద్దార్థ్ సింగ్ దారుణ హత్య.... నెల్లూరులో !

బెంగళూరులో జనవరి 18వ తేదీ శుక్రవారం సిద్దార్థ్ సింగ్ కు పీకలదాక మద్యం తాగించిన శ్యామ్ రెడ్డి, కిరణ్ తదితరులు తరువాత అతన్ని కారులో కిడ్నాప్ చేశారు. సిద్దార్థ్ సింగ్ ను చంపేసిన తరువాత అతని మొబైల్ ఫోన్ నుంచి అతని కుటుంబ సభ్యులకు అమెరికా వెలుతున్నట్లు మెసేజ్ పంపించి వారిని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారు. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు సమీపంలోని అటవి ప్రాంతంలో సిద్దార్థ్ సింగ్ శవాన్ని పూడ్చిపెట్టి అతని మొబైల్ పోలీసులకు చిక్కకుండా మాయం చేసి చేతులు దులుపుకున్నారు.

 శ్యామ్ రెడ్డి, ఇందు అక్రమ సంబంధం, తిరుపతిలో ?

శ్యామ్ రెడ్డి, ఇందు అక్రమ సంబంధం, తిరుపతిలో ?

సిద్దార్థ్ సింగ్ తండ్రి దేవేంద్ర సింగ్ ను లవ్ మ్యారేజ్ చేసుకున్న ఇందు చౌహ్హాన్ సింగ్ అతనితో సుఖపడలేక శ్యామ్ రెడ్డితో అక్రమ సంబంధం పెట్టుకుంది. శ్యామ్ రెడ్డితో జల్సా చేస్తున్న ఇందు తన భర్త దేవేంద్ర సింగ్, సిద్దార్థ్ సింగ్ పేరుతో ఉన్న రూ. 500 కోట్ల విలువైన ఆస్తి కోట్టేయాలని స్కెచ్ వేసింది. సిద్దార్థ్ సింగ్ ను హత్య చేసిన శ్యామ్ రెడ్డి కొంతకాలం తప్పించుకుని తిరిగాడు. తన కోసం బెంగళూరు పోలీసులు వెతుకుతున్నారనే భయంతో తిరుపతిలోని ఓ లాడ్జ్ లో శ్యామ్ రెడ్డి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్యామ్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడంతో కథ మరో మలుపు తిరిగింది.

 ఫస్ట్ వికెట్.... ఇందు మేడమ్ తో కొత్త ట్విస్ట్

ఫస్ట్ వికెట్.... ఇందు మేడమ్ తో కొత్త ట్విస్ట్

సిద్దార్థ్ సింగ్ మాయం అయిన కేసులో అతని పిన్నీ (ఆంటీ) ఇందు చౌహ్హాన్ సింగ్ ను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో ఇందు మేడమ్ గురించి ఒక్కొక్క విషయం బయటకు వస్తోంది. ఇదే సమయంలో సిద్దార్థ్ సింగ్ తండ్రి దేవేంద్ర సింగ్ ను పొలీసులు విచారణ చేశారు. పోలీసుల విచారణలో దేవేంద్ర సింగ్ పోంతనలేని విషయాలు చెప్పడంతో కథ అనేక మలుపులు తిరుగుతోంది.

 అన్నీ అనుమానాలే..... ఇందు ఒక్కటే !

అన్నీ అనుమానాలే..... ఇందు ఒక్కటే !

బెంగళూరు, చెన్నై, ఛండీగడ్ లో రూ. 500 కోట్లకు పైగా ఆస్తులు ఉన్న సిద్దార్థ్ సింగ్ హత్య కేసులో అనేక అనుమానాలు ఉన్నాయని పోలీసు అధికారులు అంటున్నారు. సిద్దార్థ్ సింగ్ ను హత్య చేసిన ఇందు ప్రియుడు శ్యామ్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం, అతని స్నేహితుడు కిరణ్ మాయం కావడం, సిద్దార్థ్ సింగ్ మొబైల్ ఆచూకి చిక్కకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. పోలీసుల అదుపులో ఉన్న ఇందు మేడమ్ నోరు విప్పితేనే అసలు రహస్యాలు బయటకు వస్తాయని ఓ సీనియర్ పోలీసు అధికారి అంటున్నారు. మొత్తం మీద రూ. 500 కోట్ల ఆస్తి కోసం మాజీ సీఎం సమీప బంధువు హత్యకు గురి కావడం కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+