ఎస్ జమున టుడూ అంటే హడలే మరి.. ఆమె కలప మాఫియాకు సింహస్వప్నం

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: చేతిలో విల్లు, బాణాలు.. వాటితోపాటు కుక్కలు కూడా వెన్నంటి ఉంటాయి. దీంతోపాటు గుండెల నిండా ధైర్యం.. ప్రతి చెట్టును కాపాడాలన్న తపన.. వీటినే అస్ర్తాలుగా వాడుతూ ఆమె 20 ఏండ్లుగా కలప మాఫియాపై పోరాడుతున్నారు. ఆమె పేరు. జమున టుడూ.. స్థానికులు లేడీ టార్జాన్ అని ముద్దుగా పిలుచుకుంటారు.
కానీ ఆమె అంటే కలప స్మగ్లర్లకు హడల్. ఆమెది జార్ఖండ్ రాష్ట్రంలోని ఈస్ట్ సింఘ్ భుం జిల్లా ముటుర్ఖం గ్రామం. ఈ మారుమూల గిరిజన గ్రామానికి ఆమె ప్రపంచస్థాయి గుర్తింపును తీసుకొచ్చారు. ఈ 37 ఏండ్ల మహిళ అక్కడి కలప మాఫియా పాలిట సింహస్వప్నంగా మారారంటే అతి శయోక్తి కాదు.

ఆమెకు ప్రతి చెట్టు ఒక సోదరుడే

ఆమెకు ప్రతి చెట్టు ఒక సోదరుడే

ప్రతి చెట్టును ఓ సోదరుడిలా భావిస్తూ రాఖీ కడుతూ కంటికి రెప్పలా కాపాడుతున్నారు. అడవిలో పుట్టి, పెరిగి.. అడవిపై ఆధారపడి బతుకుతున్న మనమే అడవితల్లిని కాపాడుకోవాలంటూ సాటి మహిళలకు ధైర్యం నూరిపోస్తున్నారు. తోడు వచ్చిన వారితో రక్షణ దళాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఒకప్పుడు ఒంటరిగా ప్రారంభమైన ఆమె ప్రయాణం ఇప్పుడు 9,000 మంది అనుచరులకు విస్తరించింది.

పెండ్లయ్యాక జార్ఖండ్‌లో స్థిర నివాసం

పెండ్లయ్యాక జార్ఖండ్‌లో స్థిర నివాసం

ఒడిశాలో పుట్టిన జమున పెండ్లయిన తర్వాత జార్ఖండ్ తూర్పు ప్రాంతంలోని సింఘ్‌భుమ్ జిల్లా ముటుర్ఖం గ్రామంలో స్థిరపడ్డారు. చుట్టుపక్కల 50 హెక్టార్ల పరిధిలో అటవీ భూమి ఉన్నది. దాదాపు 50 ఇండ్లు మాత్రమే ఉన్న ఆ గిరిజన గ్రామం చుట్టూ ఉన్న చెట్లపై కలప మాఫియా కన్ను పడింది. ఇష్టం వచ్చినట్టు చెట్లను నరకడం మొదలుపెట్టారు. అడవి క్రమేపీ అంతమవుతుండడంతో ఎలాగైనా కాపాడాలని ఆమె నిర్ణయించుకున్నారు. ‘నేను ఈ ప్రాంతంలో అడవి కనుమరుగు కావడాన్ని అంగీకరించను' అన్న నినాదంతో కలప మాఫియాను ఎదిరించాలని నిర్ణయించుకున్నారు.

 1998లో జమున టుడూ ప్రయాణం షురూ..

1998లో జమున టుడూ ప్రయాణం షురూ..

జమున టుడూ తనతో కలిసి వచ్చిన ఐదుగురు మహిళలతో 1998లో వన్ సురక్షా సమితిని ఏర్పాటు చేశారు. కానీ ఆమె, ఆమె సహచరుల ప్రతీనను ప్రతిఘటించారు.. వ్యతిరేకించారు. మాఫియాతో పోరాటం వద్దని, చెట్లను నరుకకుంటే మనకు వంటచెరుకు ఎక్కడి నుంచి వస్తుందని అభ్యంతరం తెలిపారు. దీంతో చెట్ల ప్రాధాన్యం వారికి మరోసారి గుర్తు చేశారు. ప్రారంభంలో వ్యతిరేకించిన వారికి నచ్చ జెప్పారు. అప్పటి నుంచి బాణం, విల్లుల సాయంతో కలప మాఫియాకు ఎదురుతిరుగడం మొదలుపెట్టారు.

 జమున టుడూపై కలప స్మగ్లర్ల హత్యాయత్నం

జమున టుడూపై కలప స్మగ్లర్ల హత్యాయత్నం

అటవీ అధికారులకు సైతం సాధ్యంకాని పనిని జమున టుడూ వన సురక్షా సమితి చేసి చూపారు. పలువురు నేరస్థులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టించి కేసులు పెట్టించారు. కానీ జమున టుడూ చేపట్టిన చర్యలు కలప మాఫియాకు ఆగ్రహం తెప్పించాయి. పలుసార్లు ఆమెకు హెచ్చరికలు జారీ చేశారు. బెదిరించారు. ఆమె ఇంటిని లూటీ చేశారు. ఇంటికి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ వద్ద దాడి చేసి హత్య చేయడానికి ప్రయత్నించారు.

 ముట్టుర్ఖం గ్రామాన్ని దత్తత తీసుకున్న జార్ఖండ్ అటవీశాఖ

ముట్టుర్ఖం గ్రామాన్ని దత్తత తీసుకున్న జార్ఖండ్ అటవీశాఖ

కానీ చెట్టును, అటవీ సంపదను కాపాడుకోవాలన్న ఆమె సంకల్పం మాత్రం కొడిగట్టిపోలేదు. తన చివరి క్షణం వరకు అడవుల పరిరక్షణ కోసం పోరాడుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆమె నిస్వార్థ పూరిత సేవను గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్నాయి. జార్ఖండ్ అటవీశాఖ దత్తత తీసుకోవడంతోపాటు తాగునీటి సరఫరా, విద్యా వసతులు కల్పించింది.

 30 మంది సభ్యులతో ఒక్కో గ్రూప్ ఇలా

30 మంది సభ్యులతో ఒక్కో గ్రూప్ ఇలా

ఒకప్పుడు ఐదుగురు సభ్యులతో ఒక బృందంగా ప్రారంభమైన వన్ సురక్షా సమితి.. ఇప్పుడు 9000 మందితో 300 బృందాలకు విస్తరించింది. ప్రతి గ్రూపులో 30 మంది సభ్యులు ఉంటారు. ఈ బ్రుందాలు మూడు షిప్టుల్లో పని చేస్తున్నాయి. వీరివద్ద బాణాలు, విల్లులు, కట్టెలతోపాటు కుక్కలు తోడుగా ఉంటాయి. జార్ఖండ్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్, జార్ఖండ్ అటవీశాఖ వీరికి సహాయం అందిస్తున్నాయి.

 ప్రముఖ మహిళా కార్యకర్తల ఆధ్వర్యంలో ఇలా చర్చాగోష్టి

ప్రముఖ మహిళా కార్యకర్తల ఆధ్వర్యంలో ఇలా చర్చాగోష్టి

జమున టుడూ క్రుషి కేవలం గిరిజనులకు అండగా నిలుస్తూ అడవుల పరిరక్షణకు మాత్రమే పరిమితం కాలేదు. సుస్థిర అభివ్రుద్ధికి.. ఆమె స్ఫూర్తి ఒక పాఠంగా మారింది. నీతి ఆయోగ్, ది గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ లీడర్ షిప్ ఫౌండేషన్ (టీజీఇఎల్ఎఫ్) సంస్థల సహకారంతో షిప్ట్ సిరీస్ అనే సంస్థ తరుచుగా చర్చాగోష్టులు నిర్వహించింది. రెండు రోజుల క్రితం సప్నా భావ్నానీ, రాబిన్ చౌరాసియా, కంచన్ చందర్, పూజాబేడీ వంటి ప్రముఖులు, మహిళా హక్కుల కార్యకర్తల ఆధ్వర్యంలో చర్చాగోష్టి జరిగింది.

 జీఈఎస్ సదస్సులోనూ ఒక ఎజెండా వన సంరక్షణ

జీఈఎస్ సదస్సులోనూ ఒక ఎజెండా వన సంరక్షణ

షిప్ట్ సిరీస్ అనే సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ చర్చాగోష్టిలో ఆహుతుల మధ్య నుంచి స్పీకర్లుగా వచ్చిన వారు కలప మాఫియాను ఎదుర్కొనే క్రమంలో ఆగంతకుల లైంగిక దాడి, హత్యా యత్నాల నుంచి ఎలా బయట పడ్డదీ వివరిస్తున్నప్పుడు కళ్లనీళ్ల పర్యంతమయ్యారు. ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన ఈ విజయగాథపై త్వరలో హైదరాబాద్ నగర వేదికగా జరిగే గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిస్ (జీఈఎస్) ఎజెండాలో చర్చించాలని నిర్ణయించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A people without children would face a hopeless future; a country without trees is almost as helpless, said Theodore Roosevelt, the twenty-sixth president of the United States. A little over a century later and over 13,000 km away in India, bow and arrow wielding Jamuna Tudu, a fierce woman who knows the value of trees, protects the forest from the timber mafia like it was her own brother.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X